Hip thrust: జిమ్‌లో 200 కిలోల బరువు ఎత్తిన కాబోయే హీరోయిన్, హిప్స్ పెంచుకోవడానికే ఇంత కష్టపడుతోందట-the future heroine who lifted 200 kg weight in the gym is working so hard to increase her hips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hip Thrust: జిమ్‌లో 200 కిలోల బరువు ఎత్తిన కాబోయే హీరోయిన్, హిప్స్ పెంచుకోవడానికే ఇంత కష్టపడుతోందట

Hip thrust: జిమ్‌లో 200 కిలోల బరువు ఎత్తిన కాబోయే హీరోయిన్, హిప్స్ పెంచుకోవడానికే ఇంత కష్టపడుతోందట

Haritha Chappa HT Telugu
Aug 06, 2024 09:28 AM IST

Hip thrust: త్వరలో శ్రీదేవి చిన్నకూతురు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె తన శరీరాన్ని అందమైన షేప్‌కు మార్చేందుకు కష్టపడుతోంది. ఏకంగా 200 కిలోల బరువులు ఎత్తులూ వీడియోను పోస్ట్ చేసింది. ముఖ్యంగా హిప్ థ్రస్ట్ వ్యాయామం చేస్తోంది.

ఖుషీ కపూర్ వ్యాయామం
ఖుషీ కపూర్ వ్యాయామం (Instagram )

అందాల నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ ఇప్పటికే హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. దేవర సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తోంది.  తాజాగా చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా  ఫుల్ టైమ్ హీరోయిన్ గా రాణించేందుకు సిద్ధపడుతోంది. ఆమె ఇప్పటికే నటనలో తన కెరీర్ మొదలుపెట్టింది.  ‘ది అర్చీస్’ సినిమాలో నటించింది. ఇది నేరుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో మెయిన్ హీరోయిన్ పాత్రలను దక్కించుకున్నట్టు సమాచారం. అలాగే తెలుగులో కూడా ఆమెకు ఛాన్సులు వస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మరింత అందంగా, మెరుపు తీగలా మారేందుకు జిమ్ లో చాలా కష్టపడుతోంది ఖుషీ కపూర్.  ఇన్ స్టాగ్రామ్ లో తన వర్కవుట్ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె హిప్ థ్రస్ట్స్ వ్యాయామం చేస్తూ కనిపించింది. 200 కిలోల బరువును ఎత్తడం ఇందులో కనిపిస్తుంది. 

జిమ్ లో హిప్ థ్రస్ట్స్ చేస్తూ 200 కిలోల బరువు ఎత్తిన

ఖుషీ కపూర్ తన పెంపుడు కుక్కలతో క్యూట్ మూమెంట్స్, మిర్రర్ సెల్ఫీలు, ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నప్పుడు తీసిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె జిమ్ లో వెయిట్ ట్రైనింగ్ చేస్తున్న వర్కవుట్ క్లిప్ కూడా పోస్ట్ లో భాగమే. ఇందులో ఆమె జిమ్ ట్రైనర్ గైడ్ చేస్తుండగా హిప్ థ్రస్ట్స్ చేస్తున్నట్లు చూపించారు. 200 కిలోల బరువుతో ఏడుసార్లు వ్యాయామం చేసింది. 'సినిమాలు, కుక్కలు, 200 కేజీలు ' అని ఖుషీ ట్వీట్ చేశారు.

హిప్ థ్రస్ట్‌లు అంటే ఏమిటి?

హిప్ థ్రస్ట్స్ అనేది ఒకరకమైన వ్యాయామం. హిప్స్ భాగాన్ని పెంచుకోవడానికి చేసే వ్యాయామం ఇది. సన్నని నడుము, విశాల మైన హిప్స్ అమ్మాయిలుకు అందాన్ని ఇస్తాయి. అందుకే ఖుషీ కపూర్ కూడా తన అందాన్ని పెంచుకోవడం కోసం హిప్ థ్రస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. శరీరాన్ని నేల నుండి పైకి లేపి హిప్ అంతటా బార్బెల్ సమతుల్యం చేస్తుంది. ఇది చేయడం కాస్త కష్టమే. అయినా ఖుషీ కపూర్ ఈ వ్యాయామం చేయడానికి వెనక్కి తగ్గడం లేదు.

హిప్ థ్రస్ట్ ప్రయోజనాలు

హిప్ థ్రస్ట్ లు హిప్, పిరుదులు, క్వాడ్రిసెప్స్ లోని కండరాలను బలోపేతం చేస్తాయి. ఈ వ్యాయామం బలమైన గ్లూట్‌లను నిర్మిస్తుంది, సమతుల్యతను పెంచుతుంది. కండరాల బలాన్ని పెంచడంతో పాటూ, హృదయ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఎముక సాంద్రతను మెరుగుపరుస్తుంది. శరీర కొవ్వును తగ్గిస్తుంది. కీళ్ళను కాపాడుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

ఖుషీ కపూర్ గురించి

బోనీ కపూర్, దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్. జాన్వీ కపూర్ ఆమె పెద్ద సోదరి. సుహానా ఖాన్, వేదంగ్ రైనా, అగస్త్య నందా, డాట్, మిహిర్ అహుజా, యువరాజ్ మెండా నటించిన ‘ది ఆర్చీస్’ చిత్రంతో ఖుషీ తెరంగేట్రం చేసింది.

టాపిక్