TSPSC Jobs in FCRI: ములుగు ఫారెస్ట్ కాలేజ్‌లో ఉద్యోగాలు!-telangana forest department recruitment 2022 tspsc notifies 27 vacancies in fcri in mulugu
Telugu News  /  Lifestyle  /  Telangana Forest Department Recruitment 2022 Tspsc Notifies 27 Vacancies In Fcri In Mulugu
jobs in Forest College and Research Institute Mulugu
jobs in Forest College and Research Institute Mulugu

TSPSC Jobs in FCRI: ములుగు ఫారెస్ట్ కాలేజ్‌లో ఉద్యోగాలు!

29 August 2022, 15:18 ISTRekulapally Saichand
29 August 2022, 15:18 IST

TSPSC Jobs in FCRI: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

TSPSC Jobs in FCRI: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో 27 ఖాళీల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. TSPSC కమిషన్ వెబ్‌సైట్ www.tspsc.gov.inలో ఉన్న ప్రొఫార్మా అప్లికేషన్ ద్వారా అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు . 

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ సెప్టెంబర్ 6 నుండి 27 మధ్య ఉంటుంది. పరిమిత బుక్‌లెట్‌లను రిజిస్టర్డ్ పోస్ట్/వ్యక్తిగతంగా సమర్పించడానికి సెప్టెంబర్ 6 నుండి 30 వరకు అవకాశం ఉంటుంది. 

ఈ నోటిఫికేషన్‌ ద్వారా ప్రొఫెసర్లు - 2, అసోసియేట్ ప్రొఫెసర్లు - 4, అసిస్టెంట్ ప్రొఫెసర్లు - 21 ఖాళీలు భర్తీ చేయనున్నారు. సవివరమైన సమాచారం కోసం అభ్యర్థులు తమ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కమిషన్ సూచించింది.

సంబంధిత కథనం

టాపిక్