Hakka Noodles Recipe | హక్కా నూడుల్స్‌తో బ్రేక్‌ఫాస్ట్.. ఇది మీకు పక్కాగా నచ్చుతుంది!-tasty maggi hakka noodles a wholesome meal to start sunday with check recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hakka Noodles Recipe | హక్కా నూడుల్స్‌తో బ్రేక్‌ఫాస్ట్.. ఇది మీకు పక్కాగా నచ్చుతుంది!

Hakka Noodles Recipe | హక్కా నూడుల్స్‌తో బ్రేక్‌ఫాస్ట్.. ఇది మీకు పక్కాగా నచ్చుతుంది!

HT Telugu Desk HT Telugu
Jul 23, 2023 06:06 AM IST

Maggi Hakka Noodles Recipe: మీకోసం ఇక్కడ ఘుమఘుమల సువాసహనలు వెదజల్లే మ్యాగీ హక్కా నూడుల్స్ రెసిపీని అందిస్తున్నాము. ఈ ఆదివారం అల్పాహారం ఇలా కానిచ్చేయండి.

Maggi Hakka Noodles Recipe
Maggi Hakka Noodles Recipe (istock)

Sunday Breakfast Recipe: ప్రతిరోజూ ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం, మరి ఆదివారం పూట కూడా అలాంటి బ్రేక్‌ఫాస్ట్‌నే ఎందుకు చేయడం? రుతుపవనాల విస్తరణతో మస్తుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం పూట వీస్తున్న చల్లని గాలులతో ముసుగేసుకొని నిండుగా పడుకోవాలని మీలో చాలా మందికి అనిపిస్తుండవచ్చు. అదే సమయంలో వేడివేడిగా నోటికి ఏదైనా రుచికరంగా తినాలని మనసు కోరుకుంటుంది. అందుకే మీకోసం ఇక్కడ ఘుమఘుమల సువాసహనలు వెదజల్లే మ్యాగీ హక్కా నూడుల్స్ రెసిపీని అందిస్తున్నాము. సాధారణంగా నూడుల్స్ మనం సాయంత్రం వేళ తింటాము, కానీ.. ఈ వర్షాకాలంలో చల్లని ఉదయం పూట తింటుంటే ఎంతో వెచ్చని అనుభూతి కలుగుతుంది. మీరూ ఓ సారి ట్రై చేయండి మరి.

Maggi Hakka Noodles Recipe కోసం కావలసినవి

  • 2 ప్యాక్‌ల ఇన్‌స్టంట్ నూడుల్స్
  • 1 కప్పు తరిగిన క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ ముక్కలు
  • 2 టీస్పూన్ల బీన్స్
  • 2 టీస్పూన్ల స్ప్రింగ్ ఆనియన్స్
  • 1 టీస్పూన్ కారం
  • 2 tsp తరిగిన వెల్లుల్లి
  • 1 టీస్పూన్ నువ్వులు
  • 1/2 టీస్పూన్ సోయా సాస్
  • 1/2 టీస్పూన్ వైట్ వెనిగర్
  • సరిపడా నూనె

మ్యాగీ హక్కా నూడుల్స్ తయారీ విధానం

  1. ముందుగా ఒక పాన్‌లో 3 కప్పుల నీటిని మరిగించాలి. వేడినీళ్లలో రెండు ప్యాక్‌ల ఇన్‌స్టంట్ నూడిల్స్ వేసి రెండు నిమిషాలు ఉడికించాలి.
  2. మ్యాగీ నూడుల్స్‌ ఉడికిన తర్వాత గిన్నెలో చల్లటి నీరు పోసి చల్లబరచాలి, ఆపై ఆ నీటినంతా తీసేయండి. ఆపై ఆ నూడుల్స్ అంటుకోకుండా ఒక స్పూన్ నూనె వేసి బాగా కలపండి.
  3. ఇప్పుడు పాన్‌లో 1 టేబుల్‌స్పూను నూనెను వేడి చేయండి. ఆ నూనెలో 1 స్పూన్ వెల్లుల్లి వేసి వేయించాలి. తర్వాత తరిగిన బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ వేసి బాగా కలపాలి.
  4. ఈ దశలో పాన్‌లో నూడుల్స్ వేసి కలపండి ఆపై సోయా సాస్, టీస్పూన్ వైట్ వెనిగర్ వేయండి
  5. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేయండి. 2 నిమిషాలు వేయించి బాగా కలపాలి.
  6. ఇప్పుడు ఇంకొక గిన్నెలో కొద్దిగా నూనె వేడి చేసి, అందులో స్ప్రింగ్ ఆనియన్స్, ఎండుమిర్చి, 1 tsp తరిగిన వెల్లుల్లి, 1 tsp నువ్వులు వేసి పోపు వేసుకోవాలి. ఈ పోపును నూడుల్స్ పై వేసి కలపండి.

అంతే, రుచికరమైన హక్కా నూడుల్స్ రెడీ. హాయిగా తింటూ ఆదివారంను అద్భుతంగా ఆరంభించండి.

Whats_app_banner

సంబంధిత కథనం