Quick Noodles Recipe : టెస్టీ, హెల్తీ క్విక్ నూడుల్స్ రెసిపీ ఇదే..
Quick Noodles Recipe : పిల్లలు నూడుల్స్ అంటే చాలా ఇష్టపడతారు. కానీ తల్లిదండ్రులు అవి ఆరోగ్యానికి అంత మంచివి కాదని ఆపేస్తుంటారు. అయితే వాటిని కూడా ఆరోగ్యంగా రెడీ చేసి.. మీ పిల్లలకు పోషకాలు అందించేలా తయారు చేయవచ్చు. ఇవి టేస్ట్‌కి టేస్ట్ ఇవ్వడంతో పాటు.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.
Quick Noodles Recipe : పిల్లలనుంచి పెద్దలవరకు (చాలామంది) నూడుల్స్ తినడానికి ఇష్టపడతారు. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచివి కాదు అని ఆపేస్తారు. అయితే వీటిని హెల్తీగా తయారు చేసుకునేందుకు మరో మార్గం ఉందని.. అది మరింత రుచిని కూడా ఇస్తుందని తెలిస్తే.. ఎవరూ మాత్రం ఈ రెసిపీని దూరం చేసుకుంటారు. పైగా దీనిని చాలా సింపుల్‌గా తయారు చేయవచ్చు. మరి దానిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
*నూడుల్స్ - 2 ప్యాకెట్లు
* వెజిటబుల్ ఆయిల్ - 1 టేబుల్ స్పూన్
* ఉల్లిపాయలు - 1 కప్పు (సన్నగా తరగాలి)
* మిరియాలు - 1 స్పూన్
* క్యారెట్ - 1 కప్పు (సన్నగా తరగాలి)
* స్ప్రింగ్ ఆనియన్స్ - 1 కప్పు (సన్నగా తరగాలి)
* పుట్టగొడుగులు - 1 కప్పు
* పాలకూర - అరకప్పు
* అల్లం వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్
* పసుపు - స్పూన్
* పంచదార - స్పూన్
* కొత్తిమీర - 1 టేబుల్ స్పూన్
* నిమ్మరసం -1 టేబుల్ స్పూన్
* వెనిగర్ - 1 టేబుల్ స్పూన్
* చిల్లీ సాస్ - 1 స్పూన్ (మీకు నచ్చిన సాస్ తీసుకోవచ్చు)
* ఉప్పు - తగినంత
తయారీ విధానం
నూడుల్స్ రకాన్ని బట్టి.. దాని మీద ఉండే సూచనలకు అనుగుణంగా వేడి నీటిలో ఉడికించాలి. అవి అంటుకోకుండా ఉండడానికి దానిలో రెండు, మూడు చుక్కల నూనెపోయాలి. అవి ఉడికేలోపు మరో గిన్నె పెట్టి దానిలో నూనె వేయాలి. అల్లం వెల్లు వేసి.. వేగిన తర్వాత.. ఉల్లిపాయలు, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, పుట్టగొడుగులు వేసి వేసి.. వాటిని ఉడకనివ్వాలి. దానిలో చిల్లీ సాస్, వెనిగర్, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించిన నూడుల్స్‌ని తీసి.. ఈ వెజిటబుల్ స్టాక్‌లో వేసి.. బాగా కలపాలి. అవి బాగా కలిశాయి అనిపిస్తే.. మీరు స్టవ్ ఆపేయవచ్చు. అనంతరం దీనిని నిమ్మరసంతో సర్వ్ చేసుకుని వేడి వేడిగా తినేయండి.
సంబంధిత కథనం