Swapna Shastram। మీరు మీ భాగస్వామితో విడిపోతున్నట్లు కలగన్నారా? దాని అర్థం ఇదే!-swapna shastram know the meaning behind if you got dream of getting divorced ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Swapna Shastram। మీరు మీ భాగస్వామితో విడిపోతున్నట్లు కలగన్నారా? దాని అర్థం ఇదే!

Swapna Shastram। మీరు మీ భాగస్వామితో విడిపోతున్నట్లు కలగన్నారా? దాని అర్థం ఇదే!

HT Telugu Desk HT Telugu
Aug 04, 2023 09:30 AM IST

Swapna Shastram: అందరూ కలలు కంటారు. కొన్ని కలలు మనల్ని సంతోషపరుస్తాయి, కొన్ని కలలు మనల్ని బాధపెడతాయి, కొన్ని మనల్ని భయాందోళనకు గురిచేస్తాయి. అయితే స్వప్నశాస్త్రంలో ప్రతి కలకు దాని స్వంత అర్థం ఉంది. మీరు విడిపోయినట్లు కలగంటే దాని అర్థం ఏమిటి, అది మంచిదా చెడ్డదా ఇక్కడ తెలుసుకోండి.

Swapna Shastram- Dreaming of Divorce:
Swapna Shastram- Dreaming of Divorce: (istock)

Swapna Shastram- Dreaming of Divorce: మీరు నిద్రలో కలలు కంటారా? మీకు ఎలాంటి కలలు వస్తాయి? మీకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుందని, అది మీ వ్యవహారశైలిని తెలియజేస్తుందని స్వప్నశాస్త్రం చెబుతుంది. మనం కనే కొన్ని కలలు మన జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలకు సూచికలుగా స్వప్నశాస్త్రం పేర్కొంది. దాదాపు మనలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో అప్పుడు కలలు వస్తూనే ఉంటాయి. ఇందులో కొన్ని భయంకరమైనవి కావచ్చు, కొన్ని చిలిపి కలలు కావచ్చు, అలాగే కొన్నిసార్లు అందమైన కలలు రావచ్చు, ఎక్కువసార్లు శృంగారభరితమైన కలలు రావచ్చు. మీకు వచ్చిన కలను గుర్తుంచుకుంటే అది దేనికి సంకేతమో స్వప్నశాస్త్రంలో జవాబు ఉంటుంది.

మీరు మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తితో విడిపోయినట్లు కలగంటే, మీ స్నేహితులు మీకు దూరం అయినట్లు కలగంటే, ఇటువంటి కల రావడం దేనికి సంకేతమో ఇక్కడ తెలుసుకోండి.

భాగస్వామితో విడిపోవాలని కలగనడం

కలల శాస్త్రం ప్రకారం, మీరు మీ భాగస్వామి నుంచి విడిపోవాలని లేదా విడిపోతున్నట్లు కలలు కంటుంటే అది అశుభం. రాబోయే రోజుల్లో ఏదో సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే, మీరు మానసికంగా ఇబ్బందుల్లో పడవచ్చని కలల శాస్త్రం చెబుతోంది.

ఇతరులు విడిపోవాలని కలలు కనడం

మీరు ఎవరైనా జంట విడిపోవాలని కలలు కనడం, మీ కలలో ఇతర వ్యక్తులు విడిపోవడాన్ని చూడటం కూడా అరిష్టం. మీరు ఇలా కలలుగన్నట్లయితే, మీరు సమీప భవిష్యత్తులో ఇతరులకు చెడు చేస్తారని అర్థం. ఈ కల మీ మనస్సులోని ప్రతికూల ఆలోచనలను వివరిస్తుంది.

విడిపోయిన తర్వాత మళ్లీ కలిసినట్లు కల

విడిపోయిన తర్వాత మళ్లీ కలిసినట్లు కలరావడం, విడిపోయిన వారితో మళ్లీ జత కట్టినట్లు కలలు వస్తే, మీ జీవితంలో కష్టాలను ఆహ్వానిస్తున్నట్లే. భవిష్యత్తులో మీపై మానసిక ఒత్తిడి పెరుగుతుందని ఇది సూచిస్తుంది. అలాగే మానసిక సమస్యలు కూడా మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి.

ప్రేమించిన వారితో బ్రేకప్

మీ కలలో ప్రియుడు లేదా స్నేహితురాలు విడిపోతున్నట్లు మీరు కలలుగన్నట్లయితే, అది కూడా అశుభాన్ని సూచిస్తుంది. ఇలాంటి కలలు కనడం వల్ల మీ బెస్ట్ ఫ్రెండ్‌తో మీ స్నేహం సమీప భవిష్యత్తులో కచ్చితంగా ముగిసిపోతుందని సూచిస్తుంది.

విడిపోయిన తర్వాత సంతోషంగా ఉన్నట్లు కల

విడిపోయిన తర్వాత మీరు సంతోషంగా ఉన్నట్లు కలగన్నట్లయితే, అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది మీరు మీ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు అన్నీ పరిష్కారం అయినట్లు సూచిస్తుంది. ఈ కల మీరు అన్ని చింతల నుండి విముక్తి పొందుతారని, సమీప భవిష్యత్తులో సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని సూచిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం