kitchen makeover: ఈ చిన్న మార్పులతో కిచెన్ అద్దంలా మెరిసిపోతుంది-summerinspired kitchen decor ideas to brighten up your space ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kitchen Makeover: ఈ చిన్న మార్పులతో కిచెన్ అద్దంలా మెరిసిపోతుంది

kitchen makeover: ఈ చిన్న మార్పులతో కిచెన్ అద్దంలా మెరిసిపోతుంది

Koutik Pranaya Sree HT Telugu
May 01, 2023 03:57 PM IST

kitchen makeover: మీ కిచెన్‌ను కాస్త వినూత్నంగా మార్చాలనుకుంటున్నారా? అయితే కొన్ని చిట్కాలు తెలుసుకోండి.

కిచెన్
కిచెన్ (Unsplash)

కాలానికి తగ్గట్లు కిచెన్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే ఉల్లాసంగా ఉంటుంది. మార్పు వల్ల భిన్న వాతావరణంలో ఉన్నట్లు అనిపిస్తుంది. పూల ప్రింట్లు, ముదురు రంగులతో ఆహ్లాదంగా మార్చేయొచ్చు.

ప్రింట్లూ, రంగులు:

కిచెన్ లో వాడే పాత్రల్లో, వాల్ పేపర్ల మీద రంగురంగుల ప్రింట్లు, వివిధ ఆకారాల్లో డిజైన్లు, త్రీడీ ఎఫెక్ట్ ఉండే డిజైన్లు ఇలా వీలైన చోట ఉపయోగించొచ్చు. కిచెన్ టవెళ్లను మామూలువి కాకుండా కాస్త ఫ్యాన్సీ ప్రింట్లు లేదా కుచ్చుల్లాగా ఉండేవి వాడొచ్చు. అప్పుడు వాటిని లోపల పెట్టకుండా బయట హ్యాంగిగులకు వేలాడదీయొచ్చు. మంచి లుక్ వస్తుంది. ఉన్నితో చేసిన బాస్కెట్లు, జూట్ తో చేసిన పండ్ల బుట్టలు చూడటానికి బాగుంటాయి. అలాగే కిచెన్ లో మంచి ప్రింట్‌లో మెత్తగా ఉన్న కార్పెట్ వేయొచ్చు. దీనివల్ల ఎక్కువ సేపు నిలబడి పనిచేసుకోవడం సులువవుతుంది. కాస్త లేత రంగు పరదాలు కిటికీలకు వేయండి. ఎండ నేరుగా రాకుండా మంచి వెలుతురు వస్తుంది.

తాజా పూలు, మొక్కలు:

తెలుపు రంగు కిచెన్ ఉంటే ముదురు రంగులో ఉండే చిన్న పూల మొక్కలు పెట్టుకోవచ్చు. పుదీనా లాంటి మొక్కల్ని కూడా పెంచుకోవచ్చు. కాస్త ఎండ తగిలే దగ్గర పెడితే సులువుగా పెరుగుతాయి. వాటివల్ల పచ్చదనంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది.

మనీప్లాంట్స్ లాంటి మొక్కల్ని కూడా మూలల్లో పెంచుకోవచ్చు. ఎటువంటి ఖర్చు లేకుండా హుందాతనాన్ని పెంచే ఉపాయం ఇది. అలంకరణ కోసం వేరే వస్తువుల అవసరం లేకుండా ఒక బుట్టలో ముదురు రంగు పండ్లు.. అంటే నారింజ, నిమ్మ, మామిడి పండ్లను పెట్టి, వెనకాల మంచి రంగులో ఉన్న చాపింగ్ బోర్డ్ పెడ్తే సరిపోతుంది.

నీలిరంగు:

కిచెన్ లో ఎక్కువగా తెలుపు, నీలిరంగు, బూడిద రంగు, లేత ఆకుపచ్చ రంగులు ఉండేలా చూసుకోవచ్చు. నీలి, తెలుపు రంగులో గీతలతో వచ్చిన టవెళ్లు, రగ్గులు వాడొచ్చు. మార్పు చేసే అవకాశం ఉంటే తలుపులకుండే హ్యాండిళ్లను సిరామిక్, పోర్సిలిన్ లో ఎంచుకుంటే మంచి లుక్ వస్తుంది. కబోర్డ్ కి అక్కడక్కడా వివిధ ఆకారాలు థీమ్ లలో ఉండే మ్యాగ్నెట్లు పెట్టొచ్చు.

ఆకర్షణీయమైన వస్తువులు:

కిచెన్ స్లాబ్ మీద పచ్చళ్లు, మసాలా డబ్బలు పెట్టుకునే ఆర్గనైజర్లు కాస్త ఆకర్షణీయంగా ఉండేట్లు చూసుకోండి. రంగురంగుల ప్లేట్లు, గిన్నెలు, గ్లాసులు ఎంచుకోవచ్చు. మామూలుగా వాడే స్టీలు గిన్నెలకు బదులు కొన్ని రోజులు సిరామిక్ బౌల్స్ వాడి చూడండి. దీంటో పాటే కబోర్డ్స్ కింద ప్రొఫైల్ లైటింగ్ పెట్టించుకుంటే గది అందంగా ఉంటుంది.

టాపిక్