Intermittent Fasting Side Effects : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా? అయితే మీకు సంతాన సమస్యలు తప్పవట..
Intermittent Fasting Side Effects : బరువు తగ్గడం కోసం ఈ మధ్య చాలామంది ఫాలో అవుతున్న డైట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. దీనిని పాటించడం వల్ల బరువైతే తగ్గుతున్నారు కానీ.. పలు ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆడవారిపై ఈ ఫాస్టింగ్ మరింత చెడు ప్రభావాలు చూపిస్తుందని అధ్యయనాలు నిరూపించాయి.
Intermittent Fasting Side Effects : బరువు తగ్గడం అనేది ప్రస్తుతం కాలంలో ఓ వ్యసనంలా మారిపోయింది. వ్యసనం ఎందుకు అనాల్సి వస్తుంది అంటే.. సాధారణ బరువు ఉన్నవారు కూడా.. డైట్స్, ఫాస్టింగ్ అంటూ బరువు తగ్గిపోయి.. లేనిపోని ఆరోగ్యసమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈజీగా, త్వరగా రిజల్ట్స్ కావాలనుకునే వారు కొన్ని ఫాస్టింగ్స్ చేస్తున్నారు. అనుకున్నట్లు త్వరగా బరువు తగ్గుతున్నారు కానీ.. ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.
బరువు తగ్గాలి.. ఆరోగ్యంగా ఉండాలి అనుకోవడంలో తప్పులేదు. దానికోసం ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గేందుకు ప్లాన్ చేసుకోవాలి. అంతేకానీ.. బరువు తగ్గాలనే ఆత్రంతో ఏది పడితే అది ఫాలో అయితే మీకు ఆరోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. దానిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి. బరువు తగ్గాలి అనుకునే చాలా మంది ఫాలో అయ్యే పద్ధతుల్లో ఇది మెయిన్ అని చెప్పవచ్చు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఎప్పుడు తినాలి.. ఎంత సేపు ఫాస్టింగ్ ఉండాలి.. పరిమిత క్యాలరీలు ఎలా తీసుకోవాలి అనేవి స్పష్టంగా ఉంటాయి. 5:2 చొప్పున ఆహారం తీసుకుంటారు. దీనిలో వారానికి 5 రోజులు తింటారు. ప్రతి వారం వరుసగా 2 రోజులు చాలా తక్కువ కేలరీలు తీసుకుంటారు. లేదంటే రోజులో 8 గంటలు తిని.. తర్వాత అంత ఉపవాసం చేస్తారు. దీనివల్ల బరువు అయితే తగ్గుతున్నారు కానీ.. ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారనేది కూడా వాస్తవమే. ముఖ్యంగా మహిళలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనాలు కూడా వెల్లడించాయి.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉన్న ఆడవారిలో పునరుత్పత్తి హార్మోన్ల స్థాయిలను తగ్గిస్తుందని తాజా అధ్యయనం నిరూపించింది. ఇది సంతానోత్పత్తకికి సంబంధించిన పలు సమస్యలకు దారి తీస్తుందని అధ్యయనం తెలిపింది.
అధ్యయనంలో ఏమి తెలిశాయంటే..
ఒబేసిటీ ట్రస్టెడ్ సోర్స్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురించారు. దీని ప్రకారం.. 8 వారాల TRE ప్రోగ్రామ్‌ను అనుసరించిన స్థూలకాయంతో బాధపడుతున్న ఆడవారిపై రీసెర్చ్ చేశారు. పాల్గొన్న 23 మందిలో.. 12 మంది ప్రీమెనోపౌసల్, 11 మంది పోస్ట్ మెనోపాజ్ దశలో ఉన్నారు. అందరికీ 30, 49.9 మధ్య బాడీ మాస్ ఇండెక్స్ (BMIలు) ఉన్నాయి.
పాల్గొనే వారందరూ 4-గంటలు లేదా 6 గంటల TREని అనుసరించారు. 4 గంటల TREలో ఉన్నవారు మధ్యాహ్నం 3 గంటల మధ్య తమకు కావలసినవి తిన్నారు. మిగిలిన 20 గంటల పాటు నీరు, శక్తి రహిత పానీయాలు మాత్రమే తీసుకున్నారు. 6 గంటల TREలో ఉన్నవారు మధ్యాహ్నం స్వేచ్ఛగా తిన్నారు. 18 గంటల ఉపవాస విండోను ప్రారంభించారు.
ఈ అధ్యయనాన్ని 8 వారాలు చేశారు. ఆ సమయంలో మొత్తం 23 మంది మహిళల నుంచి రక్త నమూనాలు సేకరించారు. రక్త పరీక్షలకు 24 గంటల ముందు వ్యాయామం, ఆల్కహాల్, కాఫీకి దూరంగా ఉండాలని పరిశోధకులు వారికి సూచించారు.
పరిశోధకులు ఋతుక్రమం ఆగిపోయిన దశలో పాల్గొనేవారిలో టెస్టోస్టెరాన్, ఆండ్రోస్టెడియోన్, SHBG, DHEA, ఎస్ట్రాడియోల్, ఈస్ట్రోన్, ప్రొజెస్టెరాన్ గాఢతను కొలిచారు. ఋతు చక్రం సమయంలో ఈ హార్మోన్ల స్థాయిలు మారుతున్నందున పరిశోధకులు ప్రీమెనోపౌసల్ దశలో ఉన్నవారి ఎస్ట్రాడియోల్, ఈస్ట్రోన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలను పరిగణలోకి తీసుకోలేదు.
కొలిచిన అన్ని హార్మోన్లలో.. DHEA మాత్రమే.. తినే విధానాలలో మార్పు ద్వారా గణనీయంగా ప్రభావితమైంది. రెండు సమూహాలలో 8 వారాల TRE తర్వాత DHEA పడిపోయింది. DHEA అనేది స్టెరాయిడ్ హార్మోన్. ఇది అడ్రినల్ గ్రంథులు, గోనాడ్స్, మెదడు ద్వారా శరీరంలో తయారవుతుంది. టెస్టోస్టెరాన్ వంటి ఈస్ట్రోజెన్, ఆండ్రోజెన్ హార్మోన్లను రూపొందించడానికి ఇది చాలా ముఖ్యమైనది.
DHEA తగ్గడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి?
ఆడవారిలో తక్కువ స్థాయి DHEA లిబిడో, యోని పొడిబారడం, బోలు ఎముకల వ్యాధితో సంబంధం కలిగి ఉంటుంది. DHEAని సప్లిమెంట్ చేయడం వల్ల ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్‌లో ఉన్న స్త్రీలలో సక్సెస్ రేట్లను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు విశ్వసనీయ మూలం కూడా చూపించాయి. తక్కువ DHEA సంతానోత్పత్తిని తగ్గిస్తుందని విస్తృతంగా విశ్వసించబడినప్పటికీ, ఈ వాదనలకు మద్దతుగా తక్కువ పీర్-రివ్యూ పరిశోధన ఉంది. అయినప్పటికీ, స్థూలకాయం సంతానోత్పత్తి సమస్యలతో ముడిపడి ఉందని అధ్యయనాలు విశ్వసనీయంగా నిరూపించాయి.
అధిక స్థాయి DHEA రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ రిసెప్టర్-పాజిటివ్, ప్రొజెస్టెరాన్ రిసెప్టర్-పాజిటివ్ ట్యూమర్‌లు, ప్రీమెనోపౌసల్, పోస్ట్ మెనోపాజ్ వ్యక్తులలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
ఇంతకీ బరువు తగ్గారా? లేదా?
అధ్యయనం సమయంలో రెండు సమూహాలు బరువు తగ్గినట్లు గుర్తించారు. ప్రీమెనోపౌసల్ దశలో పాల్గొనేవారు వారి శరీర ద్రవ్యరాశిలో సగటున 3% కోల్పోయారు. రుతుక్రమం ఆగిపోయిన వారు 4% బరువు తగ్గారు.
సంబంధిత కథనం
టాపిక్