Hair Straightening Cause Cancer : హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకుంటున్నారా.. అయితే జాగ్రత్త
Side Effects of Hair Straightening Products : చాలా మంది తమ జుట్టు రింగులుగా ఉందని.. స్టైయిట్ చేయాలని చూస్తూ ఉంటారు. దానికోసం హెయిర్ డ్రయర్లు, కొన్ని ఉత్పత్తులు వాడుతూ ఉంటారు. అయితే వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఆ ఉత్పత్తుల వల్ల గర్భాశయ క్యాన్సర్‌కు కారణమవుతాయంటున్నారు. పరిశోధనలు ఏమి చెప్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Side Effects of Hair Straightening Products : తరచుగా హెయిర్ స్ట్రెయిటెనింగ్ ట్రీట్‌మెంట్‌లు చేయడం వల్ల.. గర్భాశయ క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఇటీవల చేసిన ఓ అధ్యయనం నిరూపించింది. గర్భాశయ క్యాన్సర్‌కు అసాధారణమైన కారణాన్ని ఈ అధ్యయనంలో కనుగొన్నారు. యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సేఫ్టీ (NIEHS) హెయిర్ స్ట్రెయిటెనింగ్ ఉత్పత్తులను క్రమం తప్పకుండా ఉపయోగించే వ్యక్తులకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అని సూచించిన ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.
USలో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. USలో గర్భాశయ క్యాన్సర్ ప్రబలంగా ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై అధ్యయనం ప్రారంభించగా.. ఆసక్తికరమైన, షాక్ కలిగించే విషయాలు తెలిశాయి. హెయిర్ స్ట్రెయిటెనింగ్ ట్రీట్‌మెంట్లను తరచుగా ఉపయోగించే వ్యక్తులు గర్భాశయ క్యాన్సర్‌కు గురవుతున్నట్లు గుర్తించారు.
పరిశోధనలోని రచయితలలో ఒకరైన అలెగ్జాండ్రా వైట్ "హెయిర్ స్ట్రెయిట్‌నెర్‌లను ఎప్పుడూ ఉపయోగించని 1.64% మంది మహిళలు 70 సంవత్సరాల వయస్సులో గర్భాశయ క్యాన్సర్ బారిన పడ్డారని.. తరచుగా ఉపయోగించేవారికి.. 4.05% ఆ ప్రమాదం పెరిగింది. ." అని వెల్లడించారు.
35, 74 సంవత్సరాల మధ్య వయస్సు గల 33,947 మంది జాతిపరంగా భిన్నమైన స్త్రీలను పరిశోధకులు సగటున 11 సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు. ఆ సమయంలో 378 మంది మహిళలకు గర్భాశయ క్యాన్సర్ సోకింది. పాల్గొన్నవారిలో ఇతర ప్రమాద కారకాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. మునుపటి సంవత్సరంలో నాలుగు సార్లు స్ట్రెయిటెనింగ్ ఉత్పత్తులను ఉపయోగించిన మహిళలకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 2.5 రెట్లు ఎక్కువున్నట్లు తేలింది. అయితే ఇది కేవలం యాదృచ్చికంగా జరిగి ఉండొచ్చని కూడా చెప్తున్నారు.
మహిళలు ఉపయోగించే జుట్టు ఉత్పత్తుల బ్రాండ్లను పరిశోధకులు నమోదు చేయనప్పటికీ.. పారాబెన్లు, బిస్ఫినాల్ ఎ, లోహాలు, ఫార్మాల్డిహైడ్‌తో సహా స్ట్రెయిటెనింగ్ ఉత్పత్తులలో ఉండే అనేక రసాయనాలు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని అంటున్నారు. మునుపటి పరిశోధనలు హెయిర్ స్ట్రెయిట్‌నెర్‌లలో ఎండోక్రైన్ డిస్ట్రప్టివ్ పదార్ధాలు ఉన్నట్లు తేల్చాయి. ఇవి అండాశయ, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని వెల్లడించాయి.
సంబంధిత కథనం