Curd Dosa । పెరుగు దోశ చూడటానికి తెల్లగా ఉంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది!-start your day with the goodness of curd try perugu dosa recipe inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Curd Dosa । పెరుగు దోశ చూడటానికి తెల్లగా ఉంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది!

Curd Dosa । పెరుగు దోశ చూడటానికి తెల్లగా ఉంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది!

HT Telugu Desk HT Telugu
Aug 28, 2022 08:53 AM IST

ఫాస్ట్ గా టేస్టీగా ఏదైనా అల్పాహారం సిద్ధం చేయాలనుకుంటున్నారా? చిటికెలోనే పెరుగు దోశ చేయవచ్చు. ఇది మిగతా దోశల కంటే భిన్నమైన రుచి ఉంటుంది. దీని రెసిపీ ఇక్కడ చూడండి.

<p>Curd Dosa</p>
<p>Curd Dosa</p> (stock photo)

బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ తినటం అంటే చాలా మందికి ఇష్టం. ఇంట్లో చేసుకుంటే ఒకటి,రెండు, మూడు ఇలా ఎన్నైనా తినాలనిపిస్తుంది.

మీకు అల్పాహారంలో దోశ తినాలనిపిస్తే ఎప్పుడూ తినే దోశ కాకుండా కాస్త భిన్నంగా కూడా చేసుకోవచ్చు. మీకు ఇంట్లోనే చాలా త్వరగా, సులభంగా చేసుకునే దోశ వెరైటీలు అనేకం ఉన్నాయి. ఇందులో పెరుగు దోశ కూడా ఒకటి. పెరుగు దోశ మిగతా దోశలకు భిన్నమైన రుచిని కలిగి ఉంటుంది. మూడువేళ్లతో సుంచేలా మృదువుగా, మెత్తగా ఉంటుంది. ఇలా తినడం చాలా ఆరోగ్యకరం కూడా. మసాలా ఫుడ్ తిని అజీర్ణం సమస్యలు తెచ్చుకునే బదులు ఇలా తెల్లటి స్పాంజిలాంటి పెరుగు దోశ తింటే కడుపులో చల్లగా ఉంటుంది. ఆకలి తీరుతుంది.

పెరుగు దోశ చేసుకోవటానికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు, దీని తయారీకి పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. ఎవరైనా సరే.. మ్యాగీ నూడుల్స్ చేసేదాని కంటే ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? పెరుగు దోశను ఎలా చేసుకోవాలో ఇక్కడ రెసిపీ సిద్ధంగా ఉంది, మీరూ సిద్ధం చేసుకోండి.

పెరుగు దోశ కోసం కావాల్సిన పదార్థాలు

  • 1 కప్పు బియ్యం పిండి
  • 1 కప్పు పెరుగు
  • రుచికోస కొద్దిగా ఉప్పు
  • 1/4 టీస్పూన్ వంట సోడా
  • దోశలు వేయించటానికి నూనె

తయారీ విధానం

  1. ఒక పెద్దగిన్నెలో బియ్యం పిండిని తీసుకోండి, ఈ పిండిలో నేరుగా పెరుగును కలపండి.
  2. ఇందులో కొద్దిగా ఉప్పువేసి బాగా కలపండి.
  3. మిశ్రమం మరి చిక్కగా కాకుండా, మరి పలుచగా కాకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఇంకాస్త పెరుగు లేదా కొన్ని నీళ్లను కలుపుకోవాలి.
  4. చివరగా వంటసోడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక పది నిమిషాల పాటు పక్కనపెట్టండి. ఈ లోపు దోశ పెనం సిద్ధం చేసుకోండి.
  5. పెనం వేడిచేసి, ఆపై 1-2 స్పూన్ నూనె వేసి విస్తరించండి. ఇప్పుడు సిద్ధంచేసుకున్న పిండితో దోశ వేయండి.
  6. మీడియం వేడి మీద ఉంచి దోశపై మూతపెట్టి ఉడికించండి. అనంతరం దోశను తిప్పి మరోవైపు కూడా కాల్చుకోవాలి.

అంతే, పెరుగుదోశ సిద్ధం అయినట్లే వేడివేడిగా సర్వ్ చేసుకోండి. దీనిని మీకు నచ్చిన చట్నీ లేదా పెరుగుతో నంజుకుంటూ కూడా తినొచ్చు.

సంబంధిత కథనం

టాపిక్