Sabudana Egg Vada । సాబుదాన గుడ్డు వడ.. రుచికరమైన అల్పాహారం, క్షణాల్లోనే సిద్ధం!
Sabudana Egg Vada Recipe: సాబుదాన గుడ్డు వడ ఆరోగ్యకరమైన, రుచికరమైన, వంటకం. దీనిని చాలా త్వరగా కేవలం 20 నిమిషాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు.
Healthy Breakfast Recipes: సాబుదానతో వివిధ రకాల అల్పాహారాలను సిద్ధం చేసుకోవచ్చు. అయితే మీరు సగ్గుబియ్యంతో ఇదివరకు ఎప్పుడూ ప్రయత్నించని రెసిపీని మీకు తెలియపరుస్తున్నాం. సాబుదాన గుడ్డు వడ రెసిపీని ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు ఛవీ మిట్టల్ పంచుకున్నారు. ఇది ఆరోగ్యకరమైన, రుచికరమైన, వంటకం, బరువు తగ్గాలనుకునేవారు ఈ అల్పాహారాన్ని తమ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చని ఛవీ పేర్కొన్నారు.
అయితే సాబుదానాలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి కాబట్టి దీనిని మితంగా తీసుకోవాలి. కాబట్టి కొన్ని ఆకుకూరలు, గుడ్లు కలిపి ఈ వంటకం తయారు చేసుకోవాలి. సాబుదాన గుడ్డు వడలో సుమారు 20 గ్రాముల కార్బ్స్, అలాగే 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో పాలకూర వంటి ఆకుకూరలను వాడితే ఫైబర్ కూడా చేర్చినట్లు అవుతుంది. రుచికరంగానూ ఉంటుంది.
సాబుదాన గుడ్డు వడను చాలా త్వరగా కేవలం 20 నిమిషాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు. ఈ వంటకానికి ఏమేం కావాలి, ఎలా చేయాలో ఈ కింద ఇచ్చిన సూచనలు చదవండి.
Sabudana Egg Vada Recipe కోసం కావలసినవి
- 50 గ్రాముల నానబెట్టిన సాబుదానా
- 1 ఉడికించిన బంగాళాదుంప
- 25gm వేరుశెనగ పొడి
- తరిగిన కొత్తిమీర
- తరిగిన పాలకూర
- 2 గుడ్లు
- 2 టీస్పూన్ల నూనె
- ఉప్పు రుచికి తగినంత
సాబుదాన గుడ్డు వడ తయారీ విధానం
- ముందుగా నానబెట్టిన సాబుదానా నుంచి నీటిని వడకట్టి మెత్తని సాబుదానాను ఒక గిన్నెలోకి తీసుకోండి,
- అందులో వేరుశనగ పొడి, ఉడికించిన బంగాళదుంప, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా తరిమిన కొత్తిమీర వేసి అన్ని బాగా కలపాలి, ముద్దగా చేయాలి.
- ఆపై సాబుదాన ముద్దను చిన్నని వడలుగా చేయండి. ఆపై వాటిని 15 నిమిషాలు ఎయిర్ ఫ్రై చేయండి.
- అనంతరం పాన్‌లో కొద్దిగా నూనె వేడిచేసి, అందులో తరిగిన పాలకూర ఆకులు, ఎయిర్ ఫ్రై చేసిన సాబుదాన వడలు వేసి కలపండి. పైనుంచి రెండు గుడ్లను గిలక్కొట్టి వేయండి, అన్నింటిని బాగా కలపండి. గుడ్లు కొంచెం ఆమ్లెట్ లాగా ఉడికేవరకు వేయించండి.
అంతే, సాబుదాన గుడ్డు వడ రెడీ. వేడివేడిగా తింటూ ఆనందించండి.
సంబంధిత కథనం