Sali Par Eedu । బ్రేక్‌ఫాస్ట్‌లో కొత్తదనం కోరుకుంటే 'సాలి పర్ ఈడు' ట్రై చేయండి!
బ్రేక్‌ఫాస్ట్ లో ఎప్పుడూ ఇడ్లీ, దోశ కాకుండా ఇంకా ఏవైనా కొత్త రుచుల కోసం చూస్తున్నారా? అయితే సాలి పర్ ఈడు ట్రై చేయండి. ఇదేంటి? ఎలా తయారు చేసుకోవాలో రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
మనకు బ్రేక్‌ఫాస్ట్ అనగానే ఇడ్లీ, దోశ, వడ, పూరీ లాంటి సాంప్రదాయ అల్పాహారాలు గుర్తుకువస్తాయి. లేదా బ్రెడ్, జామ్, టోస్ట్ లాంటి ఇంగ్లీష్ రెసిపీలు ఉన్నాయి. అయితే ఎప్పుడైనా 'సాలి పర్ ఈడు' అనే అల్పాహారం తిన్నారా? పోని దీని గురించి విన్నారా? ఇప్పుడు ఈ రెసిపీని మీకు పరిచయం చేస్తున్నాం. సాలి పర్ ఈడు.. ఈ పేరు వినడానికి విచిత్రంగా ఉన్నా, ఇది చాలా సింపుల్ రెసిపీ.
సాలి పర్ ఈడు అనేది వేయించిన బంగాళాదుంప స్ట్రాస్‌పై గుడ్లతో తయారు చేయసిన సాంప్రదాయ పార్శీ బ్రేక్‌ఫాస్ట్ వంటకం. ఇది పార్శీ ఇళ్లలో తయారుచేసుకునే ఒక సాధారణ వంటకం. ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లలో కూడా ఈ బ్రేక్‌ఫాస్ట్ అందుబాటులో ఉంది.
పార్శీలో 'సాలి' అంటే ఫ్రై చేసిన బంగాళాదుంప. దీనికి టొమాటోలు, కొత్తిమీర, కొన్ని మిరియాలు, గుడ్లను కలిపి సాలి పర్ ఈడు వండుతారు. ముఖ్యంగా సన్నగా ఉన్నవారు, బరువు పెరగాలని కోరుకునేవారికి ఇది మంచి బ్రేక్‌ఫాస్ట్ అని చెబుతున్నారు. ఇది కార్బోహైడ్రేట్‌లు, ప్రొటీన్‌లతో నిండిన ఒక సువాసనభరితమైన, రుచికరమైన వంటకం. దీనిని సాధారణంగా బ్రేక్‌ఫాస్ట్ కోసం చేస్తారు. సాయంత్రం స్నాక్స్ లాగా కూడా తినవచ్చు. మరి సాలి పర్ ఈడు తయారు చేయటానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానానికి సంబంధించిన రెసిపీని ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
- 3 కప్పులు బంగాళాదుంప ముక్కలు
- 2 గుడ్లు
- 1 టొమాటో
- 1 టీస్పూన్ నల్ల మిరియాలు పొడి
- 1 టేబుల్ స్పూన్ నెయ్యి
- తాజా కొత్తిమీర
- ఉప్పు తగినంత
తయారీ విధానం
- ముందుగా కడాయిలో బంగాళాదుంప ముక్కలను బంగారు గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించాలి.
- పాన్ మీద కొద్దిగా నెయ్యి వేయండి, నెయ్యి వేడి అయిన తర్వాత తరిగిన టొమాటోలు, బంగాళాదుంప ముక్కలు వేసి వేడిచేయండి. గరిటెతో నొక్కుతూ సమానంగా చేయండి.
- ఇప్పుడు పైనుంచి తరిగిన కొత్తిమీర చల్లి, అనంతరరం రెండు పగలగొట్టండి. ఆపై ఉప్పు, మిరియాలపొడి చల్లి మూతపెట్టండి.
- గుడ్డులోని తెల్లసొన పూర్తిగా ఉడికేంత వరకు తక్కువ మంటపై ఉడికించాలి.
అంతే, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని హోల్ వీట్ బ్రెడ్ లేదా టోస్టుతో కలిపి తినండి.
సంబంధిత కథనం