పాలకూర- గుడ్లు.. ఈ రెసిపీ ట్రై చేయండి!-spinach and eggs combo meal comes with great nutrition values here s a recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పాలకూర- గుడ్లు.. ఈ రెసిపీ ట్రై చేయండి!

పాలకూర- గుడ్లు.. ఈ రెసిపీ ట్రై చేయండి!

Manda Vikas HT Telugu
Feb 28, 2022 06:54 PM IST

గుడ్లలో మంచి కొవ్వులు ఉంటాయి, ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అలాగే పొటాషియం, మెగ్నీషియం లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లకు పాలకూర గొప్ప మూలం. ఈ రెండూ కలిపి తినడం ద్వారా శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, కాల్షియం లభిస్తాయి.

<p>Spinach and Egg</p>
Spinach and Egg (Pixabay)

రాత్రిపూట ఒక సుదీర్ఘమైన, పరిపుష్టమైన నిద్ర తర్వాత ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం ఎంతో అవసరం. అందులోనూ ప్రోటీన్ కలిగిన బ్రేక్ ఫాస్ట్ చేయడం ద్వారా మంచి శక్తి లభిస్తుంది. చాలా మంది బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు తీసుకోవడం సాధారణం. అయితే గుడ్లను, పాలకూర కాంబినేషన్లో తీసుకోవడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. గుడ్లలో మంచి కొవ్వులు ఉంటాయి, ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అలాగే పొటాషియం, మెగ్నీషియం లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లకు పాలకూర గొప్ప మూలం. ఈ రెండూ కలిపి తినడం ద్వారా శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, కాల్షియం లభిస్తాయి.

గుడ్లు, పాలకూరను కలిపి చాలా రకాల రుచికరమైన వైరైటీలు తయారుచేసుకోవచ్చు. కేవలం బ్రేక్ ఫాస్ట్ లాగే కాకుండా లంచ్, డిన్నర్ సమయంలో కూడా మంచి భోజనాన్ని ఆస్వాదించవచ్చు. గుడ్లు, పాలకూరతో కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోగల ఒక సూపర్ ఈజీ రెసిపీని ఇక్కడ మీకు అందిస్తున్నాం.

కావాల్సిన పదార్థాలు:

4 గుడ్లు

పాలకూర 1 కట్ట- శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్నది.

1 ఉల్లిపాయ- సన్నగా తరిగినది

3 టేబుల్ స్పూన్లు ఆలివ్ నూనె

½ టీస్పూన్ ఉప్పు

సీజనింగ్ కోసం -1 టీస్పూన్ మిరియాలుడి, లేదా మిర్చి ముక్కలుగా తరిగినది.

తయారుచేసే విధానం:

ఒక బాణీలో 3 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె వేసి, మీడియం మంట మీద వేడి చేయండి- (క్యాలరీలు తక్కువగా ఉండటం కోసం ఆలివ్ నూనె వాడతాం). ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి సుమారు 5 నిమిషాల వరకు ఉడికించాలి. కావాలనుకుంటే చిటికెడు పసుపు వేసుకోవచ్చు. ఇప్పుడు పాలకూర వేసి, ఆపైన మిరియాలు లేదా రెండు మిరపకాయలు తరిగి వేయండి. ఇప్పుడు బాగా కలుపుకొని, పాలకూర ఆకులు మెత్తబడే వరకు సన్నని మంట సెగ మీద ఉడికించుకోవాలి. పాలకూర నీరులాగా మారినపుడు గుడ్లు పగలకొట్టి వేయాలి, కలుపుకోవద్దు. అలాగే 3-4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే వేడివేడిగా వడ్డించుకొని రోటితో లేదా బ్రెడ్ తో గాని తింటే ఆ టేస్టే వేరు.

 

Whats_app_banner

సంబంధిత కథనం