Spicy Ulava Charu Recipe । స్పైసీగా ఉలవచారు రసం, వర్షాకాలంలో రోగాలను ఉంచుతుంది దూరం!-spicy ulava charu with the goodness of horse gram healthy recipe for the monsoon ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spicy Ulava Charu Recipe । స్పైసీగా ఉలవచారు రసం, వర్షాకాలంలో రోగాలను ఉంచుతుంది దూరం!

Spicy Ulava Charu Recipe । స్పైసీగా ఉలవచారు రసం, వర్షాకాలంలో రోగాలను ఉంచుతుంది దూరం!

HT Telugu Desk HT Telugu
Jun 28, 2023 01:34 PM IST

Spicy Ulava Charu Recipe: ఈ మాన్‌సూన్ సీజన్‌కు ఉలవచారు మంచి రసంగా మారుతుంది. స్పైసీ ఉలవచారు రెసిపీని ఈ కింద ఇచ్చాం చూడండి.

Spicy Ulava Charu Recipe
Spicy Ulava Charu Recipe (slurrp)

Healthy Monsoon Recipes: వర్షాకాలంలో మన శరీరాలు బలహీనపడతాయి. చల్లని వాతావరణం కారణంగా జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మాన్‌సూన్ సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరం తట్టుకోవాలంటే పోషకాలు నిండిన సమతుల్య ఆహారం తీసుకోవడం కీలకం. మీ శరీర రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి మీరు తాజా పండ్లు, కూరగాయలను తీసుకోండి. మీరు తినే ఆహారంలో బాగా ఉడికించిన కూరగాయల రసాలు, సూప్‌లను చేర్చుకోండి.

ఈ సీజన్‌లో మీరు తినగలిగే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో ఉలవలు (horse gram) కూడా ఉండాలి. వివిధ సుగంధ దినుసులతో స్పైసీగా ఉలవ చారు చేసుకొని తింటే అది ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఉలవలలోని ఫైబర్ మీ కడుపును నిండుగా ఉంచటానికి, గ్లూకోజ్ నియంత్రణలో సహాయపడుతుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జలుబు, దగ్గు, ముక్కుదిబ్బడను తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలు కూడా దీనిని మితంగా తీసుకోవచ్చు. ఈ మాన్‌సూన్ సీజన్‌కు ఉలవచారు మంచి రసంగా మారుతుంది. స్పైసీ ఉలవచారు రెసిపీని ఈ కింద ఇచ్చాం చూడండి.

Spicy Ulava Charu Recipe కోసం కావలసినవి

  • 2 టేబుల్ స్పూన్లు ఉలవలు
  • 1 టేబుల్ స్పూన్ జీరా
  • 1 టేబుల్ స్పూన్ మిరియాలు
  • 1 ఉల్లిపాయ
  • 3 వెల్లుల్లి
  • 1 స్పూన్ ధనియాలు
  • 1/2 టీస్పూన్ అల్లం
  • 1 టేబుల్ స్పూన్ ఆవాల నూనె
  • 1/2 టీస్పూన్ ఆవాలు
  • 1 టమోటా
  • ఉప్పు రుచికి తగినంత
  • కొత్తిమీర గార్నిషింగ్ కోసం

స్పైసీ ఉలవచారు తయారీ విధానం

  1. ముందుగా ఉలవలను దోరగా వేయించాలి, ఆపైన మిక్సర్ బ్లెండర్‌లోకి తీసుకోవాలి.
  2. అనంతరం జీలకర్ర, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ధనియాలు, అల్లం తురుమును కూడా బ్లెండర్‌లో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. అవసరం మేర నీరు కలుపుకోవాలి.
  3. ఇప్పుడు బాణలిలో ఆవాల నూనె వేసి వేడి చేయాలి. అది వేడి అయ్యాక ఆవాలు వేసి చిటపడలాడనివ్వాలి, అనంతరం టమాటా ముక్కలు వేసి బాగా కలపుతూ నూనెలో ఉడికించాలి.
  4. టొమాటోలు ఉడికిన తర్వాత, రుబ్బిన ఉలవల పేస్ట్ వేయండి, రసంకు అనుగుణంగా నీరు వేసి మరిగించాలి.
  5. మరుగుతున్న రసంలో రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి, కాసేపు దీనిని ఉడకనివ్వండి.
  6. చివరగా కొత్తిమీర ఆకులను చల్లుకోవాలి.

అంతే, స్పైసీ ఉలవచారు రెడీ. వేడిగా సర్వ్ చేసుకోండి. దీనిని అన్నంలో కలుపుకొని తినవచ్చు లేదా సూప్ లాగా అయినా తాగవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం