Spicy Chutney Recipes: స్పైసీగా దొండకాయ రోటి పచ్చడి, ఇలా చేసుకోండి రెసిపీ ఇదిగో
Spicy Chutney Recipes: దొండకాయ వేపుడు దొండకాయ కూర తిను ఉంటారు ఒకసారి దొండకాయ రోటి పచ్చడి చేసి చూడండి ఆంధ్ర స్టైల్ లో అదిరిపోతుంది
Spicy Chutney Recipes: తెలుగువారికి పరిపూర్ణ భోజనం అంటే అందులో పచ్చడి కూడా ఉండాల్సిందే. రోజుకో రకం పచ్చడితో భోజనం చేసే వారి సంఖ్య ఎక్కువే. అలాంటివారు ఒకసారి దొండకాయ రోటి పచ్చడిని ఆంధ్ర స్టైల్ లో ప్రయత్నించండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. ఈ దొండకాయ రోటి పచ్చడి అన్నం లోనే కాదు దోసెలు, అట్లు, ఇడ్లీలో తిన్నా కూడా బాగుంటుంది. దీని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.
దొండకాయ రోటి పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
దొండకాయలు - పావు కిలో
పచ్చిమిర్చి - పది
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - మూడు స్పూన్లు
చింతపండు - నిమ్మకాయ సైజులో
మెంతులు - ఒక స్పూన్
ఆవాలు - ఒక స్పూను
శనగపప్పు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
మినప్పప్పు - ఒక స్పూను
కరివేపాకు - గుప్పెడు
ఎండుమిర్చిలు - రెండు
దొండకాయ రోటి పచ్చడి రెసిపీ
- దొండకాయలు బాగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసి వేయించాలి.
3. పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దొండకాయలను వేసి కాస్త ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించాలి.
4. చివరిలో చింతపండును, కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి.
5. ఆ మిశ్రమాన్ని చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి.
6. ఇప్పుడు ఈ పచ్చడికి తాళింపు తయారు చేసుకోవాలి.
7. స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి నూనె వేయాలి.
8. అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకులు వేసి బాగా వేగనివ్వాలి.
9. దొండకాయ పచ్చడిలో ఈ తాళింపును వేసేయాలి. అంతే టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ అయినట్టే.
దీన్ని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. వేడి అన్నంలో ఒకసారి ఈ దొండకాయ పచ్చడి కలుపుకొని తినండి రుచి అదిరిపోతుంది.
టాపిక్