Spiced Rum Recipe : మీ రమ్ని మరింత టేస్టీగా, స్పైసీగా మార్చుకోవాలంటే.. ఇలా చేసేయండి..
Spiced Rum Recipe : చాలామంది చలికాలంలో రమ్ తాగుతూ ఉంటారు. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది అనుకుంటారు. అందుకే దీనిని తాగుతారు. దీనిని మరింత టేస్టీగా, స్పైసీగా మార్చుకోవడానికి మీరు రమ్ని మార్చుకోవచ్చు. అదేలాగంటే..
Spiced Rum Recipe : మీకు రమ్ తాగే అలవాటు ఉందా? అయితే మీరు దానిని టేస్ట్‌ని మరింత స్పైసీగా, టేస్టీగా మార్చుకోవాలంటే ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు కొత్త టేస్ట్‌ని పొందాలనుకుంటే.. కచ్చితంగా ఈ స్పైసీ రమ్ని రెడీ చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* డార్క్ రమ్ - 750 ml
* లవంగాలు - 2
* ఏలకులు - 1
* స్టార్ సోంపు - 1
* దాల్చిన చెక్క స్టిక్ - 1/2
* జాజికాయ - చిటికెడు
* ఆరెంజ్ పీల్ - 1 స్ట్రిప్
మసాలా రమ్ తయారీ విధానం
రమ్‌ను గాలి చేరని జార్‌లోకి తీసుకోండి. నారింజ తొక్కను ట్విస్ట్ చేసి బాటిల్లో వేయండి. మిగిలిన మసాలా దినుసులను కూడా వేసి.. మూత పెట్టి.. బాగా షేక్ చేయండి. రెండు మూడు రోజులు దానిని చీకటి ప్రదేశంలో ఉంచేయండి. అనంతరం మిశ్రమాన్ని జల్లెడతో వడకట్టండి. ఈ మసాల రమ్‌ను మరో బాటిల్లోకి బదిలీ చేయండి. దానిని మూసి వేసి.. చీకటి, పొడి ప్రదేశంలో నిల్వ చేసుకుని.. మీకు నచ్చినప్పుడు తాగవచ్చు.
సంబంధిత కథనం