Mira Rajput: షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ వేసుకున్న చెప్పులు ఆమె డ్రెస్ కన్నా ఎక్కువ ఖరీదు, ధర తెలిస్తే షాకవుతారు-shahid kapoors wife mira rajput wears sandals and handbags that will shock you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mira Rajput: షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ వేసుకున్న చెప్పులు ఆమె డ్రెస్ కన్నా ఎక్కువ ఖరీదు, ధర తెలిస్తే షాకవుతారు

Mira Rajput: షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ వేసుకున్న చెప్పులు ఆమె డ్రెస్ కన్నా ఎక్కువ ఖరీదు, ధర తెలిస్తే షాకవుతారు

Haritha Chappa HT Telugu
Sep 03, 2024 07:00 PM IST

Mira Rajput: షాహిద్ కపూర్ భార్య మీరా అందంలో హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఉంటుంది. ఆమె వాడే యాక్సెసరీలు కూడా ఖరీదైనవే. ఆమె వాడే సెలిన్ బ్యాగ్, హెర్మెస్ చెప్పులు ఎంతో స్టైలిష్ గా ఉంటాయి. వాటి ధరలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

 మీరా రాజ్‌పుత్
మీరా రాజ్‌పుత్ (Instagram)

షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ సినిమాల్లో నటించపోయినా హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఆమె వేసుకునే డ్రెస్సులు, యాక్సెసరీల గురించి నిత్యం సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఆమె జిమ్ నుంచి బయటికి వచ్చే ఫోటోలు, వీడియోలు అప్పుడప్పుడూ బయటికి వస్తూ ఉంటాయి. తాజాగా ముంబైలోని ఓ లగ్జరీ స్పా అండ్ వెల్ నెస్ సెంటర్ బయట మీరా రాజ్ పుత్ కనిపించింది. వెంటనే ఆమె ఫోటోలను క్లిక్ మనిపించారు సెలెబ్రిటీ ఫోటోగ్రాఫర్లు. ఆ సమయంలో ఆమె వేసుకున్న డ్రెస్, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ పై చర్చలు మొదలయ్యాయి. వాటి ఖరీదు ఎంత అని ఎంతోమంది వెతికేశారు. ఆమె ప్రఖ్యాత సెలిన్ బ్యాగ్, హెర్మెస్ కంపెనీ చెప్పులు ధరించింది మీరా. ఆమె బ్యాగ్, పాదరక్షల ఖరీదు ఆమె దుస్తుల కంటే ఎక్కువగా ఉంది.

ముంబైలోని వెల్నెస్ సెంటర్ నుంచి బయటకు వస్తున్న మీరా ఆరెంజ్ కలర్ డ్రెస్ ధరించింది. వైట్ హాల్టర్ నెక్ క్రాప్ ట్యాంక్ టాప్ తో డ్రెస్ ను డిజైన్ చేశారు. యాక్సెసరీలలో భాగంగా బంగారు ఆభరణాలు, హెర్మెస్ ప్లాట్ఫామ్ చెప్పులు, టాన్ సెలిన్ హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నారు.

మీరా చెప్పులు ధర ఎంత?

టాన్ సెలిన్ బ్రాండ్ బ్యాగ్‌ను  మీరా ధరించింది. తన రోజువారీ వస్త్రధారణతో నేచురల్ కాల్ఫ్స్కిన్లో టీన్ ట్రియోంఫే బ్యాగ్ అని పిలుస్తారు. ఈ క్రాస్ బాడీ బ్యాగ్ లో గోల్డ్ ఫినిషింగ్,  ట్రియోంఫే మెటాలిక్ క్లోజర్ ఉన్నాయి. దీని విలువ 4,300 డాలర్లు అంటే మన రూపాయల్లో సుమారు రూ.3,60,887.

మీరా వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ ధర ఎంత?
మీరా వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ ధర ఎంత? (celine.com)

ఆమె వేసుకున్న చెప్పులు హెర్మెస్ సంస్థకు చెందినది. ఈ బ్రాండ్ చెప్పులు చాలా ఖరీదు. ఆ చెప్పుల ఖరీదు 620 పౌండ్లు.  అంటే రూ .68,393 ఖర్చు అవుతుంది. మొత్తంగా పాదరక్షలు, బ్యాగ్ విలువ రూ.4,29,280.

హెర్మెస్ చెప్పులు
హెర్మెస్ చెప్పులు (hermes.com)

మీరా రాజ్ పుత్ డ్రెస్ ధర ఎంత?

డస్క్ కో-ఆర్డ్ దుస్తులను ఆమె కాలింగ్ జూన్ అనే లేబుల్ నుండి కొనుగోలు చేసింది. ఈ ఆరెంజ్ రంగు దుస్తుల విలువ రూ.13,900. ప్రస్తుతం ఇది రూ.11,815 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఆమె దుస్తుల ధర కన్నా ఆమె చెప్పుల ధరే ఎక్కువ.

మీరా రాజ్ పుత్ డ్రెస్ ధర ఎంత?
మీరా రాజ్ పుత్ డ్రెస్ ధర ఎంత? (callingjune.com)

మీరా రాజ్ పుత్ లుక్

కోరల్ సెట్‌లో అందమైన ఎంబ్రాయిడరీతో ఉన్న చొక్కా, ప్యాంట్‌తో ఆమె అందంగా కనిపిస్తుంది . బ్లౌజ్ కాలర్డ్ నెక్లైన్, బటన్ క్లోజర్లతో ఓపెన్ ఫ్రంట్, హాఫ్ లెంగ్త్ స్లీవ్స్ ఈ డ్రెస్ చాలా ట్రెండీగా, స్టైలిష్ గా ఉంది.  

చివరగా, మీరా అందమైన బంగారు గొలుసు, వెండి బ్రాస్లెట్ వాచ్‌ను, వెండి బ్రాస్లెట్లు, బంగారు హూప్ చెవిపోగులు, వెండి-బంగారు ఉంగరాలను ఎంచుకుంది. సగం కట్టిన హెయిర్ స్టైల్‌లో తన పొడవాటి జుట్టును ముడి వేసింది మీరా రాజ్ పుత్.

టాపిక్