Samsung Price Drop | గెలాక్సీ ఏ13 మోడల్ స్మార్ట్‌ఫోన్ ధరలను తగ్గించిన శాంసంగ్!
శాంసంగ్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి వచ్చిన సరికొత్త స్మార్ట్ ఫోన్ ధరలపై డిస్కౌంట్ ప్రకటించింది. తాజా ధరలు ఎలా ఉన్నాయో చూడండి.
సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం Samsung కొన్ని నెలల కిందట భారత మార్కెట్లో Galaxy A13 అనే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా ఈ ఫోన్ మూడు వేరియంట్లో విడుదల చేసింది. అయితే తాజాగా ఈ ఫోన్ ధరలను కంపెనీ తగ్గించింది. శాంసంగ్ ఈ ఫోన్‌ను రూ. 20 వేల బడ్జెట్ రేంజ్ లో విడుదల చేసింది. అయితే తాజా తగ్గింపు ఈ ఫోన్ ఇప్పుడు రూ. 15 వేల బడ్జెట్ శ్రేణిలోకి వచ్చి చేరింది. సుమారు రూ. 1500 వరకు తగ్గింపు ప్రకటించింది.
ఈ Galaxy A13 స్మార్ట్‌ఫోన్ 4GB/64GB వేరియంట్ పాత ధర రూ. 14,999/- కాగా ఇప్పుడు ఇది రూ. 13,999కి లభ్యమవుతుంది. అలాగే 4GB/128GB వేరియంట్ పాత ధర రూ. 15,999/- కాగా, ఇప్పుడు ధర రూ. 14,999/-కు తగ్గింది. అంటే ఈ రెండింటిపై సుమారు రూ. 1000 తగ్గింది. అలాగే 6GB/128GB వేరియంట్ పాత ధర రూ. 17,999/- పై ఇప్పుడు రూ. 1500 తగ్గింది. ఈ ఫోన్ ఇప్పుడు 16,499కి లభిస్తుంది.
అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఒకసారి పరిశీలించండి.
Samsung A13 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 6.6 అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే
- ర్యామ్- స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్: 4GB/64GB, 4GB/128 GB అలాగే 6GB/128GB
- ఎగ్జినోస్ 850 ప్రాసెసర్
- వెనకవైపు 50 మెగా పిక్సెల్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్; ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 25W ఫాస్ట్ ఛార్జర్
ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఆసక్తి గల వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.
కొద్దిరోజుల కిందట గెలాక్సీ A33 అనే 5G మోడల్ స్మార్ట్‌ఫోన్ పై కూడా శాంసంగ్ కంపెనీ రూ. 3 వేల డిస్కౌంట్ ప్రకటించింది.
సంబంధిత కథనం