Republic Day 2023 : గణతంత్ర దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత
Republic Day 2023 : గణతంత్ర దినోత్సవం 2023 సందర్భంగా దేశవ్యాప్తంగా సన్నాహాలు జోరందుకున్నాయి. ఈ ఏడాది భారతదేశం 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అయితే ఈ సందర్భంగా ఈరోజు వెనుక ఉన్న చరిత్ర, ప్రాముఖ్యత ఏమిటో మరోసారి తెలుసుకుందాం.
Republic Day 2023 : ప్రతి సంవత్సరం జనవరి 26న భారతదేశంలో గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 2023వ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం దేశం తన 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1947లో బ్రిటీష్ రాజ్యం నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ అప్పటికి సొంత రాజ్యాంగం లేదు. భారతదేశం తన రాజ్యాంగాన్ని 26 జనవరి 1950న పొందింది. ఆ రోజునుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీనితో భారతదేశం సార్వభౌమ రాజ్యంగా మారింది. ఇది రిపబ్లిక్‌గా ప్రకటించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దానికి అధ్యక్షత వహించి.. రిపబ్లిక్ ప్రకటించారు. కాబట్టి ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
గణతంత్ర దినోత్సవం 2023 వేడుక
దేశమంతటా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది దిల్లీలోని రాజ్‌పథ్‌లో ప్రారంభమై ఇండియా గేట్ వద్ద ముగిసే పరేడ్. దేశ రాష్ట్రపతి న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జెండాను ఎగురవేస్తారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు.. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా కవాతులు, ఎయిర్ షోల ద్వారా భారతదేశ సాంస్కృతిక, సామాజిక వారసత్వాన్ని ప్రదర్శిస్తాయి.
గణతంత్ర దినోత్సవం 2023 చరిత్ర
భారత రాజ్యాంగం జనవరి 26, 1950న అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించడమే ఉద్దేశ్యమైన రాజ్యాంగ సభ.. డిసెంబర్ 9వ తేదీ 1946న తన మొదటి సమావేశాన్ని నిర్వహించింది. చివరి అసెంబ్లీ సమావేశం నవంబర్ 26, 1949న ముగిసింది. సంవత్సరం తరువాత రాజ్యాంగాన్ని ఆమోదించారు.
గణతంత్ర దినోత్సవం 2023 ప్రాముఖ్యత
గణతంత్ర దినోత్సవం స్వతంత్ర భారతదేశ స్ఫూర్తికి ప్రతీక. 1950లో ఈ రోజున భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్‌ని ప్రకటించింది. ఇది వలస పాలన నుంచి భారతదేశానికి వచ్చిన స్వాతంత్య్ర ప్రకటన. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే శక్తిని కూడా ఈ రోజు భారత పౌరులకు గుర్తు చేస్తుంది. భారత రాజ్యాంగ స్థాపన కోసం దేశం ఈరోజును జాతీయ సెలవుదినంగా జరుపుకుంటున్నారు.