Republic Day 2023 Parade । గణతంత్ర దినోత్సవ వేడుకలు వీక్షించాలంటే, బుకింగ్ ఇలా చేసుకోవాలి!-republic day 2023 where to buy tickets for the parade and beating the retreat ceremony ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Republic Day 2023 Where To Buy Tickets For The Parade And Beating The Retreat Ceremony

Republic Day 2023 Parade । గణతంత్ర దినోత్సవ వేడుకలు వీక్షించాలంటే, బుకింగ్ ఇలా చేసుకోవాలి!

HT Telugu Desk HT Telugu
Jan 24, 2023 01:42 PM IST

Republic Day 2023 Parade Booking: గణతంత్ర దినోత్సవం 2023 పరేడ్ కోసం ప్రజలు టిక్కెట్లు కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ పోర్టల్ ని ఏర్పాటు చేసింది. ఎలా కొనుగోలు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

Republic Day 2023 Parade Booking
Republic Day 2023 Parade Booking (ANI)

Happy Republic Day 2023: జాతీయ పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ ఆధీనంలో ఘనంగా వేడుకలు జరుగుతాయి. ముఖ్యంగా దేశ రాజధానికి న్యూ ఢిల్లీలో జరిగే వేడుకలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు. మనం ఈ 2023లో 74వ గణతంత్ర దినోత్సవంను జరుపుకోనున్నాం. జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకొని ప్రతీ ఏడాది ఈరోజున జాతీయ పండుగగా జరుపుకుంటున్నాం.

గణతంత్ర దినోత్సవ వేడుకలు న్యూ ఢిల్లీలో అబ్బురపరిచే రీతిలో జరుగుతాయి. ఇందులో భాగంగా అద్భుతమైన సైనిక, సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తారు. ముఖ్యంగా భారత సైన్యం సత్తాను తెలియజేసే కార్యక్రమాలు, త్రివిధ దళాల చేపట్టే ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు, సాయుధ దళాల కవాతు వంటివి దేశభక్తిని ఉప్పొంగేలా చేస్తాయి. ఢిల్లీలోని కర్తవ్య మార్గంలో ఈ ప్రదర్శనలు వీక్షకులకు గ్రౌండ్ విజువల్స్ ను అందిస్తాయి. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి అరుదైన ప్రదర్శనలను ప్రత్యక్షంగా వీక్షించడం మీకు గొప్పా అనుభూతిని మిగిలిస్తుంది. అయితే, ప్రతి ఒక్కరూ రిపబ్లిక్ డే రోజున పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లి సందర్శించలేరు, ఎందుకంటే ముందస్తుగా టిక్కెట్లను బుకింగ్ చేసుకున్నవారికి మాత్రమే ఆ అనుమతి ఉంటుంది. మీరు లైవ్ స్ట్రీమింగ్ చూడటానికి కూడా మీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.

మరి మీకు ఈ గణతంత్ర దినోత్సవం వేడుకలు వీక్షించాలని ఆసక్తి ఉంటే ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను ఎలా కొనుగోలు చేయాలి, మీ పేరును ఎలా నమోదు చేసుకోవాలి మొదలైన అన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Republic Day 2023 Parade Booking

ఈ ఏడాది అంటే, జనవరి 26న జరిగే 74వ గణతంత్ర దినోత్సవం 2023 పరేడ్ కోసం అధికారులు దాదాపు 32,000 టిక్కెట్లను విక్రయించనున్నారు. బుకింగ్ కోసం మీరు www.aamantran.mod.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు.

మీ వాహనాలకు పార్కింగ్ లేబుల్‌ల కొనుగోలు కూడా ఇక్కడ్నించే చేసుకోవాలి. ప్రతి రోజు కోటా ప్రకారం టిక్కెట్ల విక్రయం జరుగుతుంది. ప్రతి రోజు అందుబాటులో ఉన్న టిక్కెట్ల కోటాకు సంబంధించిన సమాచారం ఉదయం 9 గంటలకు వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు. మీరు ఎంచుకొనే ఈవెంట్, టిక్కెట్ రకాన్ని బట్టి ధరలు రూ.20 నుండి రూ.500 వరకు ఉంటాయి.

Republic Day 2023 Parade Booking- Steps To Follow- టికెట్ బుకింగ్ దశల వారీగా

  1. టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి www.aamantran.mod.gov.inలో సైన్ అప్ చేయండి. మీ పేరు, తండ్రి/భర్త పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, శాశ్వత చిరునామా వంటి వివరాలను నమోదు చేయండి.
  2. మీ మొబైల్ ఫోన్‌కు పంపిన OTPని నమోదు చేయండి. దాని ఆధారంగా మీ ఖాతాలోకి లాగిన్ అవ్వండి
  3. ఇప్పుడు మీరు హాజరు కావాలనుకుంటున్న ఈవెంట్‌ను ఎంచుకోండి. ఈవెంట్‌లు: రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్, రిపబ్లిక్ డే పరేడ్, - బీటింగ్ ది రిట్రీట్ రిహార్సల్, బీటింగ్ ది రిట్రీట్ - FDR , బీటింగ్ ది రిట్రీట్ వేడుక.
  4. మీరు ఎంచుకున్న ఈవెంట్‌కు నిర్దిష్ట తేదీన అందుబాటులో ఉన్న టిక్కెట్‌ల రకాలు, సంఖ్య , వాటి ధరలు, ఎన్‌క్లోజర్‌ల వివరాలు వెబ్‌సైట్ మీకు చూపుతుంది.
  5. ఇప్పుడు టికెట్ బుకింగ్ కోసం, మీతో పాటు హాజరయ్యే ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేయండి, ID ప్రూఫ్ లను అప్‌లోడ్ చేయండి. ఒక కాంటాక్ట్ నంబర్/ఖాతా ఉపయోగించి గరిష్టంగా 10 టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
  6. చివరగా పేమెంట్ చెల్లింపుకు కొనసాగండి, మీ ఆర్డర్‌ని పూర్తి చేయండి. మీ పేమెంట్ విజయవంతం అయితే మీకు టికెట్లు జారీ అవుతాయి.

అంతే, మీరు ఎంచుకున్న ఈవెంట్ తేదీ, సమయానికి మీకు నిర్ధేషించిన చోటుకు వెళ్లాలి. అన్ని టిక్కెట్‌లకు ప్రత్యేక QR కోడ్ ఉంటుంది. కవాతు జరిగే ప్రదేశంలో అధికారులు వాటిని స్కాన్ చేస్తారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్