Republic Day 2023 । అధ్యక్షా.. గణతంత్ర దినోత్సవం రోజున ఘనమైన స్పీచ్ ఇవ్వాలంటే మినిమం ఇలా ఉండాలి!-republic day 2023 how to give a great speech on january 26 tips to make your presentation special ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Republic Day 2023 How To Give A Great Speech On January 26, Tips To Make Your Presentation Special

Republic Day 2023 । అధ్యక్షా.. గణతంత్ర దినోత్సవం రోజున ఘనమైన స్పీచ్ ఇవ్వాలంటే మినిమం ఇలా ఉండాలి!

HT Telugu Desk HT Telugu
Jan 23, 2023 04:05 PM IST

Republic Day 2023 Speech Tips: ఈ 74వ గణతంత్ర దినోత్సవం రోజున ఒక గొప్ప ఉపన్యాసం ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ అందించిన చిట్కాలు, సూచనలు పాటించండి.

Republic Day 2023 Speech Tips
Republic Day 2023 Speech Tips (Unsplash)

Republic Day 2023: ఈ ఏడాది జనవరి 26న భారతదేశం 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. స్వాతంత్య్రం పొందిన తర్వాత భారతదేశం తన స్వంత రాజ్యాంగం అమలు చేయాలని నిర్ణయించుకుంది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. ఆరోజు నుంచి దేశం ప్రజాతంత్ర పరిపాలన కలిగిన సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజు కాబట్టే అప్పట్నించీ మనం ప్రతీ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి తర్వాత జాతీయ పండుగగా, జాతీయ సెలవు దినంగా ప్రకటించిన రోజు ఈ రిపబ్లిక్ డేనే.

గణతంత్ర దినోత్సవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు కూడా గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగరేవేసి వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ముఖ్యంగా విద్యాసంస్థలలో పిల్లలకు వ్యాస రచన పోటీలు, ఉపన్యాస పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. ఇవి వారిలోని ప్రతిభను వెలుగులోకి వస్తాయి.

Republic Day 2023 Speech Tips- గణతంత్ర దినోత్సవ ఉపన్యాసం కోసం చిట్కాలు

సాధారణంగా ఉపన్యాస పోటీలు అనగానే చాలా మందిలో ఒక రకమైన బెరుకు ఉంటుంది, స్టేజ్ మీదకు ఎక్కగానే గజగజలాడుతుంటారు. మరి ఈ భయాన్ని వీడి, మంచి ఉపాన్యాసం ఎలా ఇవ్వాలో ఇక్కడ కొన్ని టిప్స్ అందిస్తున్నాం. ఈ సూచనలు పాటిస్తే మీ ప్రసంగంతో అందరినీ ఆకట్టుకోవచ్చు.

మీ ప్రేక్షకులను అర్థం చేసుకోండి

ముందుగా మీరు ఎవరి ముందు ఉపన్యాసం వింటున్నారు, ఎందుకోసం ఇస్తున్నారు అనేది అర్థం చేసుకోండి. మీ ఉపన్యాసం వినే ప్రేక్షకులకు అనుగుణంగా మీ ప్రసంగాన్ని రూపొందించండి. వారి వయస్సు, నేపథ్యాన్ని గుర్తుంచుకోండి. మీ ప్రసంగం 74వ గణతంత్ర దినోత్సవానికి సంబంధించినదని నిర్ధారించుకోండి.

వ్యవస్థీకృతంగా ఉండండి

మీ ప్రసంగం స్పష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉందని నిర్ధారించుకోండి. దీనర్థం ముందుగా అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేయడం, ఆపై మీ పరిచయం, మీరు దేని మీద ఉపన్యాసం ఇవ్వాలనుకుంటున్నారో దాని ఉద్దేశ్యం, ఆ తర్వాత అసలు విషయం చెప్పండి. ఉపన్యాసాన్ని సరైన ఆకృతిలో ఉంచండి, సరైన ముగింపు ఉండాలి. మధ్యమధ్యలో కొన్ని ఉదాహరణలు, కొన్ని సూక్తులు, అల్లికలు, వృతాంతాలు ఉంటే మీ ఉపన్యాసం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

బాగా ప్రాక్టీస్ చేయండి

‘ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్’ అంటారు. అంటే మీ అభ్యాసం మిమ్మల్ని సుశిక్షుతులని చేస్తుంది. మీరు మీ ప్రసంగాన్ని చాలాసార్లు రిహార్సల్ చేయండి. ఇది మీలోని బెరుకును తొలగిస్తుంది. మీరు ఉపన్యాసంకు సిద్ధంగా, ఆత్రుత ఉన్నటువంటి భావనను కలిగిస్తుంది.

మీ ఆత్మవిశ్వాసాన్ని చూపించండి

ఏదో మొక్కుబడిగా ఏదో ఒకటి మాట్లాడేయకుండా మీ సందేశం అక్కడున్న వారికి చేరాలి అన్న విధంగా ఉపన్యాసం ఇవ్వాలి. గాబరా పడకుండా మితమైన వేగంతో మాట్లాడండి, ప్రేక్షకుల దృష్టిని కొనసాగించడానికి అందరినీ చూస్తూ ప్రసంగించండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించండి. మీరు మీ ఉపన్యాసాన్ని చూడకుండా చెప్పాల్సిన పనిలేదు, చూస్తూ కూడా చెప్పొచ్చు. అయితే చెప్పేది స్పష్టంగా చెప్పాలి.

మంచి సందేశంతో ముగించండి

మీ ఉపన్యాసంకు ఒక మంచి ముగింపును ఇవ్వండి, మంచి సందేశం లేదా ఆలోచన రేకెత్తించడం ద్వారా మీ ఉపన్యాసం ముగిసిన తర్వాత కూడా దాని గురించి ఆలోచిస్తారు. చివరగా అందరికీ ధన్యావాదాలు చెప్పి ముగించండి.

ఇవన్నీ మీరు గొప్ప ఉపన్యాసం ఇచ్చినట్లు నిర్ధారిస్తాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్