Swami Vivekananda Quotes । ప్రతీ వ్యక్తిలో శక్తి ఉంటుంది.. స్వామి వివేకానంద సూక్తులు, జీవితానికి పాఠాలు!-swami vivekananda quotes life lessons on his birth anniversary and national youth day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Swami Vivekananda Quotes । ప్రతీ వ్యక్తిలో శక్తి ఉంటుంది.. స్వామి వివేకానంద సూక్తులు, జీవితానికి పాఠాలు!

Swami Vivekananda Quotes । ప్రతీ వ్యక్తిలో శక్తి ఉంటుంది.. స్వామి వివేకానంద సూక్తులు, జీవితానికి పాఠాలు!

HT Telugu Desk HT Telugu
Jan 12, 2023 01:16 PM IST

Swami Vivekananda Quotes: ప్రతి వ్యక్తిలో ప్రతిభ ఉందని స్వామి వివేకానంద నమ్మారు. ఆయన ఎంతో మంది యువతకు స్ఫూర్తి. అందుకే వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవం (National Youth Day) గా జరుపుకుంటున్నాం. ఆయన సూక్తులు కొన్ని ఇక్కడ తెలుసుకోండి.

Swami Vivekananda Quotes- National Youth Day)
Swami Vivekananda Quotes- National Youth Day)

స్వామి వివేకానంద ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు, భారతదేశ ఔన్నత్యాన్ని దశదిశలా చాటి చెప్పిన సిసలైన దేశ భక్తుడు. భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని తపించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. ప్రతీ పేదవాడు చదువుకోవాలని కృష్టి చేసిన ఒక ఆదర్శమూర్తి, తన ఉపన్యాసాలు, బోధనలతో జాతిని జాగృతం చేసిన తత్వవేత్త, బ్రతికినంత కాలం ఎంతో ప్రగతిశీల జీవితాన్ని గడిపిన వివేకానంద, దేశంలోని ఎంతో మంది యువతకు స్ఫూర్థిగా నిలిచారు. స్వామి వివేకానంద ఇచ్చిన ప్రేరణ ఒక్క భారతదేశానికే కాకుండా పాశ్చాత్య దేశాలకూ పాకింది.

ఈరోజు జనవరి 12 స్వామి వివేకానంద జయంతి (Swami Vivekananda Birth Anniversary). భారతదేశంలోని యువతరానికి ప్రేరణగా నిలుస్తూ, యువతకు ఆయన చేసిన విశేషమైన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం జనవరి 12వ తేదీని జాతీయ యువజన దినోత్సవం (National Youth Day) గా ప్రకటించింది.

స్వామి వివేకానంద ప్రతి వ్యక్తిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నమ్మారు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ప్రతిభ కచ్చితంగా ఉంటుందని విశ్వసించారు. ఏ వ్యక్తి నిరుపయోగం కాదని, వ్యక్తులు తమపై తాము నమ్మకంగా ఉండాలని చాటి చెప్పారు. ఇతరుల అభిప్రాయాల ముందు మీ మోకరిళ్ల కూడదని. మీపై మీకు నమ్మకం ఉన్నంత వరకు, మీ లక్ష్యాలను సాధించకుండా ఏదీ మిమ్మల్ని ఆపదంటూ నినదించాడు. స్వామి వివేకానంద చెప్పిన మాటలు, ఆయన సూక్తులు నేటికి ఎంతో మందికి స్ఫూర్థినిస్తాయి, లక్ష్యం దిశగా అడుగులు వేసేందుకు ప్రేరణ కలిగిస్తాయి, జీవితంలో ఎలాంటి కష్టాన్నయినా ఎదురించగల ధైర్యాన్నిస్తాయి.

ఈరోజు స్వామి వివేకానంద జయంతి అలాగే యువజన దినోత్సవం సందర్భంగా వివేకానందుడి సూక్తులు, సందేశాలు ఇక్కడ కొన్ని తెలుసుకుందాం.

Swami Vivekananda Quotes- స్వామి వివేకానంద సూక్తులు

- మనం మాట్లాడే మాటల మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే సరిగా మాట్లాడడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు.

- కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతావు. అనవసరంగా మాట్లాడితే అర్ధాన్ని కోల్పోతావు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు. అబద్ధాలను మాట్లాడితే పేరును కోల్పోతావు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు.

- మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతీ ఆశయాన్ని స్వీకరించండి. బలహీన పరిచే ప్రతీ ఆలోచనను తిరస్కరించండి.

- మనిషి గొప్పవాడా, కాదా అన్నది అతడి విజయాల్ని బట్టి కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి.

- వినయం లేని విద్యా, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలిలేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్ధం.

- లక్ష్యం కోసం అలుపెరుగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమౌతుంది.

- సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమై నశించే వారు ధన్యులు.

జీవితం మంచి, చెడులతో వస్తుంది. మీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించడానికి, మీ మార్గంలో వచ్చే చెడు రోజులను ఎదుర్కోవాలి. వీటి నుండి పారిపోతే ఆ తర్వాత పశ్చాత్తాపపడి లాభం లేదు. భయాలను ఎదుర్కోవడం ప్రపంచంలోనే గొప్ప మార్పును కలిగిస్తుంది అంటూ స్వామి వివేకానంద తెలిపారు. ఆయన చెప్పిన మంచి మాటలను స్వీకరిస్తే, ఆచరణలో పాటిస్తే ఏ వ్యక్తి అయినా తన జీవితంలో గొప్ప వ్యక్తిగా ఎదుగుతాడు.

Whats_app_banner

సంబంధిత కథనం