JIO: ఇక అంతా జియోమయం.. Jio Air Fiber, Jio Cloud PC గురించి ఈ విషయాలు తెలుసా?-reliance jio airfiber jio cloud pc services announced in ril s 45th agm ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Reliance Jio Airfiber, Jio Cloud Pc Services Announced In Ril's 45th Agm

JIO: ఇక అంతా జియోమయం.. Jio Air Fiber, Jio Cloud PC గురించి ఈ విషయాలు తెలుసా?

HT Telugu Desk HT Telugu
Aug 29, 2022 06:45 PM IST

Jio Cloud PC: దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) AGM సందర్భంగా కీలక ప్రకటనలు చేసింది. JIO నెట్‌వర్క్ విస్తరణకు సంబందించి కీలక విషయాలను వెల్లడించింది.

Jio Air Fiber
Jio Air Fiber

రిలయన్స్ జియో 45వ AGM సందర్భంగా కీలక ప్రకటన చేసింది. భారతదేశంలో 5G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా నాలుగు మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాలలో దీపావళి వరకు 5జీ ప్రారంభమవుతుందని ముకేశ్ అంబానీ తెలిపారు. 2023 నాటికి, దేశంలోని ప్రతి మూలలో 5G సేవ అందుబాటులో ఉంటుంది వివరించారు. ఇది కాకుండా, కంపెనీ తన కస్టమర్లకు వర్చువల్ పిసిని బహుమతిగా ప్రకటించింది. AGM కార్యక్రమంలో, కంపెనీ తన కొత్త సర్వీస్ Jio AirFiber, Jio క్లౌడ్ PC గురించి వివరించింది. Jio AirFiber, JioFiకి మధ్య చాలా వత్యాసం ఉన్నట్లు వివరించింది. Jio AirFiber మెరుగైన ఇంటర్నెట్ స్పీడ్‌తో రానున్నట్లు వెల్లడించింది. జియో క్లౌడ్ పిసి ఎంటర్‌తో ఖరీదైన లెటెస్ట్ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల కొనుగోలు ఖర్చును తగ్గనుంది. ఈ రెండు డివైజ్‌స్ గురించి వివరంగా తెలుసుకుందాం...

Jio AirFiber

AGM కార్యక్రమంలో, Reliance Jio AirFiber అనే వైర్‌లెస్ సింగిల్-డివైస్ సొల్యూషన్‌ను పరిచయం చేసింది, ఇది వైర్ సెట్స్‌తో కాకుండా సిగ్నల్స్‌తో ఇంట్లోని డివైజ్‌స్‌కు బ్రాడ్‌బ్యాండ్ వేగాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది. హాట్‌స్పాట్‌ను సెటప్ చేసినంత సులువుగా ఉండే ఎండ్-టు-ఎండ్ బ్రాడ్‌బ్యాండ్ సొల్యూషన్‌గా ఇది ఉంటుందని వివరిచింది. Jio AirFiberని ఉపయోగించడం వల్ల న్యూ కంప్యూటర్ హార్డ్‌వేర్‌ కొనుగోలు, అప్‌గ్రేడ్ సంబంధించిన అదనపు ఖర్చులను తగ్గించవచ్చని వెల్లడించింది. Jio క్లౌడ్ PCలో క్లౌడ్‌ హోస్ట్ చేయబడిన వర్చువల్ PC ఉపయోగించవచ్చని తెలిపింది.

జియో క్లౌడ్ పిసి

సాధారణంగా మనం ఉపయోగించే ల్యాప్ టాప్‌ను కొత్త సాప్ట్‌పెర్స్ అనుగుణంగా ప్రతిసారీ అప్ గ్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. దీని వల్ల టైం, డబ్బులు చాలా ఖర్చువుతాయి. ఈ ఖర్చును తగ్గించే లక్ష్యంతోనే రిలయన్స్ జియో క్లౌడ్ పీసీ తీసుకోస్తుంది. అంటే పెద్ద హార్డ్‌వేర్ నిర్మాణం అవసరం లేకుండా క్లౌడ్ పిసి వర్క్ చేస్తుంది. ఈ వర్చువల్ PC ఫీచర్ వేగవంతమైన 5G నెట్‌వర్క్ స్పీడ్, రిమోట్ సర్వర్ అధారంగా పని చేయనుంది. పెద్దగా ఖర్చు లేకుండా తరచుగా అప్‌గ్రేడ్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వినియోగదారు వినియోగ పరిమితి వరకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే దీన్ని ఎంతవరకు వాడుకుంటే అంతే ధర చెల్లించవచ్చు

WhatsApp channel

సంబంధిత కథనం