Air India : ముంబై- బెంగళూరు మధ్య మరిన్ని విమాన సేవలు!
Air India flights Mumbai to Bengaluru : రద్దీ ప్రదేశాలైన ముంబై- బెంగళూరు మధ్య మరిన్ని విమాన సేవలను తీసుకొచ్చింది ఎయిర్ ఇండియా. ఆ వివరాలు..
Air India flights Mumbai to Bengaluru : ముంబై- బెంగళూరు మధ్య అదనపు విమాన సేవలను ప్రారంభించింది ఎయిర్ ఇండియా. టాటా సంస్థ.. ఎయిర్ ఇండియాను దక్కించుకున్న తర్వాత.. ఒక రూట్లో అదనపు విమాన సేవలను అందించడం ఇదే తొలిసారి. ఎయిర్ ఇండియా తాజా నిర్ణయంతో.. ముంబై బెంగళూరు మధ్య ఆ సంస్థ మొత్తం మీద నాలుగు విమానాలను నడుపుతుంది.
ట్రెండింగ్ వార్తలు
రద్దీ ప్రదేశాలైన ముంబై- బెంగళూరులో నివాసముంటున్న వారికి ఇది ఉపశమనాన్ని కలిగించే విషయమే!
"ముంబై- బెంగళూరు మధ్య ప్రయాణించేందుకు మరిన్ని ఆప్షన్లు వచ్చేశాయి. ఈ నెల 20 నుంచి ఈ రూట్లో మరిన్ని విమాన సేవలను అందిస్తున్నాము. మొత్తం మీద నాలుగు విమానాల నుంచి మీ ఎంపిక చేసుకోవచ్చు. మరింత సౌకర్యంగా, మరింత వెసులుబాటుతో విమానాలను ఎంపిక చేసుకోండి," అని ఎయిర్ ఇండియా.. ట్వీట్ చేసింది.
24 అదనపు విమానాలను నడిపేందుకు ఎయిర్ ఇండియా తీసుకున్న నిర్ణయంలో ముంబై- బెంగళూరు మార్గం ఒకటి. ఈ 24 విమానాలు కూడా ఈ నెల 20నే మొదలయ్యాయి.
Mumbai Bengaluru flights : పుణె- అహ్మదాబాద్ మధ్య విమాన సేవలను సైతం శనివారమే ప్రారంభించింది ఎయిర్ ఇండియా. కొవిడ్ సంక్షోభం కారణంగా నేల మీదే ఉండిపోయిన విమానాలకు మరమ్మత్తులు చేసి రంగంలోకి దింపింది ఆ సంస్థ.
"విమాన సేవలను తిరిగి పూర్తి స్థాయిలో తీసుకొచ్చేందుకు.. ఆరు నెలలుగా ఎయిర్ ఇండియా కృషి చేస్తోంది. మా శ్రమకు ప్రతిఫలం దక్కుతుండటం సంతోషకరం," అని ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్బెల్ విల్సన్ తెలిపారు.
ప్రస్తుతం.. ఎయిర్ ఇండియాకు మొత్తం మీద 70 విమానాలు ఉన్నాయి. వీటిల్లో 54 ప్రస్తుతం పని చేస్తున్నాయి. మిగిలిన 16 విమానాలను.. 2023 నాటికి సర్వీసులోకి తీసుకొచ్చేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది.
సంబంధిత కథనం
Air India: ఎయిర్ ఇండియా జోరు.. 24 కొత్త విమానాల టేకాఫ్
August 11 2022
Air India | చంద్రశేఖరన్కే ఛైర్మన్ బాధ్యతలు
March 14 2022
Akasa Air | మరో దేశీ విమానయాన సంస్థ ప్రయాణం ప్రారంభం
August 06 2022