Don't Ask : మీ జీవిత భాగస్వామి మాజీ ప్రేమ గురించి ఈ ప్రశ్నలు వేయకండి
Relationship Tips : కొందరు పెళ్లి అయిన తర్వాత జీవిత భాగస్వామిని అనుమానిస్తారు. ఇష్టంవచ్చినట్టుగా ప్రశ్నలు వేస్తారు. ఇలా చేస్తే మీ బంధం నాశనం అవుతుంది.
పెళ్లికి ముందు ఒకరితో ప్రేమాయణం సాగించినా.. అది కుదరక వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టే వారు చాలా మంది ఉన్నారు. కొంతమందికి వారి భాగస్వామికి మాజీ ఉన్నారని తెలుసు, మరికొందరు చాలా కాలం తర్వాత తెలుసుకుంటారు. ఇలా మాజీ గురించి ఆలోచించేటప్పుడు ఎవరికైనా కొంత ఆందోళన కలగడం సహజం.
ఈ ప్రశ్నలు వేయకూడదు
మన భాగస్వామికి ఇంకా వారి జ్ఞాపకాలు ఉన్నాయని తెలిస్తే, అది చాలా బాధగా ఉంటుంది. మన బాధకు వాళ్ళని కొన్ని ప్రశ్నలు వేస్తే మన శాంతిని పాడు చేసుకుంటాం. మీ జీవిత భాగస్వామి మాజీ ప్రేమ గురించి ఈ ప్రశ్నలు వేయకండి. అలా చేస్తే ఆ క్షణం నుండి మీరు మీ మనశ్శాంతిని కోల్పోతారు. అవేంటో చూద్దాం..
ఇప్పటికీ ప్రేమిస్తున్నావా?
మీరు ఇప్పటికీ వారిని ప్రేమిస్తున్నారా? ఈ ప్రశ్న నుండి మీరు ఏమి పొందలేరు. కేవలం మనసు చెడిపోతుంది. ఇప్పటికీ తన మాజీను ఇష్టపడితే ఆ వ్యక్తి మనతో ఎందుకు ఉంటున్నట్టులాంటి అనవసరమైన ఆలోచనలో మానేయండి. వాళ్ళతో మిమ్మల్ని పోల్చుకోకూడదు. మీరు అలాంటి ప్రశ్న అడగకూడదు.
మీ లైంగిక జీవితం ఎలా ఉండేది?
మీ మాజీతో లైంగిక జీవితం ఎలా ఉండేది?లాంటి అసభ్యకరమైన ప్రశ్నలు అడగొద్దు. మిమ్మల్ని మీ భాగస్వామి ఎలా ఇష్టపడుతున్నారో అడగండి. వారి మాజీ గురించి అడగడం మీకు ఏమీ లాభం లేదు. సెక్స్ గురించి సిగ్గుపడకూడదు, బహిరంగంగా మాట్లాడాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక్కడ వరకూ ఓకే. కానీ అలా కాకుండా వారి జీవితాల్లో వచ్చి పోయిన అధ్యాయాల గురించి అడగకండి.
మాజీపై ఆకర్శణ ఉందా?
మీరు ఇప్పటికీ మీ మాజీ పట్ల ఆకర్షితులవుతున్నారా? ఈ ప్రశ్న కూడా అనవసరం. ఇప్పుడు వారికి ఉన్న ఆకర్షణలు, అయిష్టాలు మీపైనే ఉంటాయి. మీరు మీ భాగస్వామికి ఎంత ముఖ్యమో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వారి ప్రవర్తన మనల్ని ఎంతగా ఇష్టపడుతుందో చూపిస్తుంది. మనపై చాలా ప్రేమను చూపిస్తుంటే పాత ఆలోచనను తవ్వకండి.
మీ మాజీలో మీకు ఇష్టమైన విషయం ఏంటి?
మీ భాగస్వామి మాజీ గురించి ఎప్పుడో మరిచిపోయి ఉంటారు. వారు ఇప్పుడు దాని గురించి మరచిపోయి మీతో గడుపుతారు. ఈ సందర్భంలో తన మాజీ ప్రేమికుడు లేదా ప్రేయసికి ఏం ఇష్టం అని ప్రశ్న అడగాల్సిన పనిలేదు. దీని గురించి అడగవద్దు. మీరు మీ భాగస్వామిని ఎలా ఇష్టపడుతున్నారో తెలిసేలా చేయండి. మన ప్రవర్తన వారి మనసుకు భంగం కలిగించకుండా ఉండాలి.
మీ భాగస్వామి కొన్ని కారణాల వల్ల మాజీతో విడిపోయి ఉండవచ్చు. మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఇప్పుడు మళ్లీ మాట్లాడుతుంటే ఈ విషయాన్ని విస్మరించకండి. ఈ సంబంధం మీ బంధంలో సమస్యలను తెస్తుంది. మీ పెద్దల దృష్టికి తీసుకెళ్లండి. తన పాత సంబంధం నుండి పూర్తిగా బయటపడి, మీతో జీవిస్తున్నట్లయితే మీరు పాత విషయాల గురించి మాట్లాడకపోవడమే మంచిది. పైన చెప్పిన విషయాలు మీ భాగస్వామితో చర్చించకూడదు. అలా చేస్తే మీ జీవితాన్ని మీరే పాడు చేసుకున్నవారు అవుతారు.