బడ్జెట్ ధరల్లో Redmi 10A, Redmi 10 Power స్మార్ట్‌ఫోన్‌లు విడుదల-redmi 10a redmi 10 power smartphones launched in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  బడ్జెట్ ధరల్లో Redmi 10a, Redmi 10 Power స్మార్ట్‌ఫోన్‌లు విడుదల

బడ్జెట్ ధరల్లో Redmi 10A, Redmi 10 Power స్మార్ట్‌ఫోన్‌లు విడుదల

HT Telugu Desk HT Telugu
Apr 20, 2022 02:54 PM IST

షావోమి నుంచి Redmi 10A, Redmi 10 పవర్ అనే రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు విడిదలయ్యాయి. ఇందులో ఇందులో Redmi 10A రెండు వేరియంట్లలో వచ్చింది. Redmi 10 పవర్ మాత్రం సింగిల్ వేరియంట్లో వచ్చింది. ధరలు రూ. 10K లోపే ఉన్నాయి. మిగతా వివరాలు ఇలా ఉన్నాయి.

<p>Redmi 10 Series</p>
Redmi 10 Series (Mi)

షావోమి కంపెనీ తన సబ్-బ్రాండ్‌ Redmiలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లు విడుదల చేసింది. ఇందులో ఒకటి Redmi 10A కాగా, మరొకటి Redmi 10 పవర్. ఈ రెండు ఫోన్లు రూ. 10 వేల లోపు బడ్జెట్ ధరల్లో ఉన్నాయి. ఈ రెండింటిలో Redmi 10 పవర్ కాన్ఫిగరేషన్ సామర్థ్యం అధికం కాబట్టి దీని ధర ఎక్కువగా ఉంటుంది. డిజైన్ పరంగా ఈ రెండు ఫోన్లు ఒకేలా ఉన్నాయి. అయితే ఏ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇచ్చారు. ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Redmi 10A స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

6.53-అంగుళాల HD+ డిస్‌ప్లే

3GB/4GB RAM, 32/64GB స్టోరేజ్ సామర్థ్యం

మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్

వెనకవైపు 13 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్

6000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఫాస్ట్ ఛార్జర్

3GB RAM/32 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,499/- కాగా, 4GB RAM/ 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,499/-

Redmi 10 Power స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

6.71-అంగుళాల IPS LCD HD డిస్‌ప్లే

8GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యం

క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్

వెనకవైపు 50 మెగా పిక్సెల్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్; ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్

6000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఫాస్ట్ ఛార్జర్

ధర రూ. 14,999/-

Redmi 10 పవర్ నలుపు, నారింజ రంగు ఛాయిస్ లలో లభ్యమవుతోంది. Redmi 10A బ్లూ, బ్లాక్ , గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అమెజాన్ ఇండియా ద్వారా ఏప్రిల్ 26 నుంచి ఈ ఫోన్స్ అందుబాటులో ఉంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం