Aeroplane Mode Reasons : విమానంలో ప్రయాణించేప్పుడు మెుబైల్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఎందుకు పెట్టాలి?
Aeroplane Mode : దాదాపు అందరి ఫోన్లలో ఎయిర్ ప్లేన్ మోడ్ ఉంటుంది. అయితే విమానంలో ప్రయాణించేప్పుడు కచ్చితంగా ఇది ఆన్ చేయాలి. ఎందుకు అలా చేయాల్సి ఉంటుంది?
స్మార్ట్‌ఫోన్‌లోని అత్యంత ముఖ్యమైన ఫీచర్లలో ఎయిర్‌ప్లేన్ మోడ్ ఒకటి. మీరు వేగంగా ఛార్జ్ చేయవలసి వస్తే కాల్ లేదా ఇతర కార్యకలాపాలను ఉపయోగించకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. అయితే విమానంలో ప్రయాణించేటప్పుడు మొబైల్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఎందుకు ఉంచాలి?
చాలా సంవత్సరాల క్రితం విమానయాన సంస్థలు మొబైల్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ఇ-రీడర్‌లు, ఇతర పరికరాలను ఫ్లైట్లో వెళ్లే సమయంలో మొత్తం ఆఫ్ చేయమని ప్రయాణికులకు చెప్పడం మానేశాయి. ఎందుకంటే దాదాపు అన్ని పరికరాలు ఇప్పుడు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఎయిర్‌ప్లేన్ మోడ్ ఎందుకు విమానంలో ఆన్ చేయాలి?
ఫ్లైట్ మోడ్ లేదా ఎయిర్‌ప్లేన్ మోడ్ స్మార్ట్‌ఫోన్‌ల ప్రారంభ రోజుల్లో ప్రవేశపెట్టబడింది. అంతకు ముందు విమానంలో వెళ్లాలంటే ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయాలి. ప్రస్తుతం అన్ని మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లలో ఈ ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. దీనికి విమానం చిహ్నం ఉంది. మీరు సెట్టింగ్స్‌లోకి వెళ్లి దాన్ని ఆన్ చేస్తే మీ ఫోన్‌లోని ఇన్‌కమింగ్ కాల్స్, మెసేజ్‌లు, నెట్‌వర్క్ అన్నీ డిసేబుల్ చేస్తుంది. ఆపై దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడానికి, అదే సింబల్ మీద నొక్కండి.
సిగ్నల్స్ సమస్యలు
విమానంలో ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తే, దాని నుంచి వచ్చే సిగ్నల్స్ విమానంలోని కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తాయి. సెల్యులార్ కనెక్టింగ్ ఫీచర్‌ని కలిగి ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు రేడియో తరంగాలను, ఇతర కనెక్ట్ చేసే లక్షణాలతో ఇబ్బందులు కలిగిస్తాయి. ఇది విమానానికి అంతరాయం కలిగించవచ్చు. మొబైల్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచాలని చెబుతారు.
ఈ ఇబ్బందులు రావొచ్చు
ఒక రోజులో మిలియన్ల మంది ప్రజలు విమానంలో ప్రయాణిస్తుంటారు. ఈ సందర్భంలో నెట్‌వర్క్‌లలో భారీ అంతరాయాలు ఉంటాయి. ఇది విమానయాన సంస్థలకు కూడా సమస్యలను సృష్టిస్తుంది. ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో సిగ్నల్స్ సమస్యలు కూడా రావొచ్చు. చాలా కష్టాలను ఎదుర్కొంటారు. అందుకే విమానంలో ప్రయాణించేటప్పుడు మొబైల్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచాలని చెబుతారు.
ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేసినప్పుడు.. పరికరం సెల్యులార్ నెట్‌వర్క్‌లను నిలిపివేస్తుంది. మీరు సెల్యులార్ నెట్‌వర్క్ నుండి కాల్‌లు, సందేశాలను చేయలేరు, స్వీకరించలేరు. కానీ వై-ఫై సౌకర్యం ఉంటే వై-ఫై ద్వారా సందేశాలు పంపవచ్చు.
త్వరగా ఛార్జ్ అయ్యేందుకు
విమానంలో ప్రయాణించేటప్పుడు మాత్రమే కాకుండా చాలా మంది రోజువారీ ఉపయోగంలో కూడా ఎయిర్‌ప్లేన్ మోడ్ ఉపయోగిస్తున్నారు. మొబైల్‌ను త్వరగా ఛార్జ్ చేయడానికి మొబైల్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచుతున్నారు. ఇది మొబైల్‌కి త్వరగా ఛార్జ్ అవడంతో పాటు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.
ఒకరి కాల్ లేదా మెసేజ్ ద్వారా మీరు చికాకు పడినప్పుడు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేస్తే మీరు మీ మొబైల్‌కు వచ్చే సందేశాన్ని, కాల్‌లను బ్లాక్ చేయవచ్చు. ఎయిర్ ప్లేన్ మోడ్ ఆన్ చేయడం వలన ఎవరైనా ఫోన్ చేస్తే మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందని చెబుతుంది.
టాపిక్