Happy Rakshabandhan: 20కి పైగా బెస్ట్ రాఖీ పండగ శుభాకాంక్షల మెసేజ్‌లు.. ప్రత్యేక వాట్సాప్, ఫేస్‌బుక్ స్టేటస్‌లు మీకోసం-raksha bandhan 2024 wishes photos whatsapp status messages ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Rakshabandhan: 20కి పైగా బెస్ట్ రాఖీ పండగ శుభాకాంక్షల మెసేజ్‌లు.. ప్రత్యేక వాట్సాప్, ఫేస్‌బుక్ స్టేటస్‌లు మీకోసం

Happy Rakshabandhan: 20కి పైగా బెస్ట్ రాఖీ పండగ శుభాకాంక్షల మెసేజ్‌లు.. ప్రత్యేక వాట్సాప్, ఫేస్‌బుక్ స్టేటస్‌లు మీకోసం

Koutik Pranaya Sree HT Telugu
Aug 18, 2024 01:12 PM IST

Happy Rakshabandhan 2024: మీ సోదర సోదరీమణులకు అర్థవంతమైన శుభాకాంక్షలు, చిత్రాలు, వాట్సాప్ సందేశాలు పండగ రోజు పంపకపోతే ఎలా. రాఖీ పండగ శుభాకాంక్షలకు సంబంధించిన ప్రత్యేక సందేశాలు, మెసేజీలు, ఫొటోలు చూసేయండి. మీ తోబుట్టువులతో పంచుకోండి.

రాఖీ పండగ శుభాకాంక్షలు
రాఖీ పండగ శుభాకాంక్షలు (Freepik)

ఈ ఏడాది ఆగస్టు 19న రక్షా బంధన్ వచ్చింది. సోదర సోదరీమణుల మధ్య ఉన్న శాశ్వత బంధాన్ని ఈ పండుగ గుర్తు చేస్తుంది. ఈ రక్షాబంధన్ రోజున సోదరీ మణులు తమ ప్రేమకు చిహ్నంగా తమ సోదరుడి మణికట్టుకు రాఖీ కడతారు. సోదరులు వారిని రక్షిస్తామని వాగ్దానం చేస్తారు. తోబుట్టువులు ఈ రోజును ప్రత్యేకం చేయడానికి బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ ప్రత్యేక దినాన పండగ శుభాకాంక్షలు, , వాట్సాప్ సందేశాలు, ఫేస్బుక్ స్టేటస్, మరెన్నో మీ తోబుట్టువులతో పంచుకోవడం ద్వారా మీరు పండుగను మరింత ప్రత్యేకంగా మార్చేయొచ్చు. 

హ్యాపీ రక్షా బంధన్

ప్రియమైన సోదరా, నేను నిన్ను ఎంత ప్రేమిస్తానో చెప్పలేను. దానికి ఆకాశం కూడా హద్దు కాదు. నువ్వు నీ చేష్టలతో నన్ను ఎంత విసిగించినా సరే నాకు నీ ప్రేమ చాలా ముఖ్యం. నువ్వు ముఖ్యం. హ్యాపీ రక్షాబంధన్. 

హ్యాపీ రక్షా బంధన్, సిస్టర్. నువ్వు ఈ ప్రపంచంలోనే ఉత్తమ సోదరివి. రోజురోజుకు మన బంధం మరింత బలపడుతుందని కోరుకుంటున్నాను.

రాఖీ పండగ 2024
రాఖీ పండగ 2024 (HT Photo)

మనం ఎంత దూరంగా ఉన్నా సరే మన బంధం విడదీయరానిది. ఈ రక్షా బంధన్ సందర్భంగా నీకు చాలా ప్రేమను పంపిస్తున్నాను.

నాకు ఇంత మంచి సోదరుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు. నువ్వు ఎప్పుడూ నా బెస్ట్ ఫ్రెండ్‌వే. నాకు అన్ని విషయాల్లోనూ మార్గనిర్దేశకుడివి. హ్యాపీ రాఖీ సోదరా.

ప్రియమైన సోదరి, మంచి చెడుల్లో నాకు తోడుగా ఉన్నందుకు థ్యాంక్యూ. హ్యాపీ రక్షాబంధన్.

నన్ను విసిగించేదీ నువ్వే.. నవ్వించేదీ నువ్వే.. ప్రేమించేదీ నువ్వే.. నన్ను అల్లారుముద్దుగా చూసుకునేదీ నువ్వే. నువ్వు నా జీవితంలో ఉండటం నా అదృష్టం. రక్షా బంధన్ శుభాకాంక్షలు.

శ్రావణంలో వచ్చే పండగల్లో రాఖీ పండగ కూడా ముఖ్యమైంది
శ్రావణంలో వచ్చే పండగల్లో రాఖీ పండగ కూడా ముఖ్యమైంది (Freepik)

నా బెస్ట్ సోదరుడికి రక్షా బంధన్ శుభాకాంక్షలు! నీకు ఈ ప్రపంచంలోని సంతోషాలు, శ్రేయస్సు, విజయాలు దక్కాలని ఆశీర్వదిస్తున్నా.

నాకు ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన సోదరి ఉంది. అన్ని సందర్భాల్లో బెస్ట్‌గా, కూల్ గా ఉండే నీకు థ్యాంక్స్! రక్షా బంధన్ శుభాకాంక్షలు.

సోదరి.., నువ్వే మొదటి నుండి నాకు రోల్ మోడల్. మన బంధం రోజురోజుకూ బలపడాలని ఆకాంక్షిస్తున్నా. రక్షా బంధన్ శుభాకాంక్షలు.

ప్రతిసారీ ఈ పండగ రోజు.. నేను ఎంత అదృష్టవంతుడినో మరీ ప్రత్యేకంగా గుర్తొస్తుంది. నువ్వు నా జీవితంలో ఉండటం నా అదృష్టం. హ్యాపీ రక్షా బంధన్. 

తోబుట్టువుల బంధాన్ని తెలిపే పండగ రాఖీ పండగ
తోబుట్టువుల బంధాన్ని తెలిపే పండగ రాఖీ పండగ (HT Photo)

నా సోదరుడికి ఎల్లప్పుడూ శాంతి, ఆరోగ్యం, సంతోషంతో పాటూ జీవితంలో అన్ని అదృష్టాలు ఉండాలని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ రాఖీ మై డియర్ బ్రదర్.

మనం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, మన బంధం ఎప్పటికీ మసకబారదు. ప్రేమ, ఆనందంతో నిండిన రక్షా బంధన్ శుభాకాంక్షలు.

బ్రదర్… నన్ను రక్షించడానికి ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండే నా సూపర్ హీరో నువ్వే హ్యాపీ రక్షా బంధన్!

నువ్వు నాకోసం చేసే ప్రతి పనికీ, నీ ప్రేమకు థ్యాంక్యూ. హ్యాపీ రక్షాబంధన్.

నా బెస్ట్ సిస్టర్/బ్రదర్, నువ్వు నాకు కుటుంబమే కాదు. బెస్ట్ ఫ్రెండ్‌వి కూడా. రక్షా బంధన్ శుభాకాంక్షలు.

రక్షాబంధన్ 2024
రక్షాబంధన్ 2024 (Freepik)

నా బలానికి, ధైర్యానికి మూలస్తంభం నువ్వే. నా రక్షకుడివి, నమ్మకస్తుడివీ నువ్వే. నువ్వు నా సోదరుడివి అయినందుకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను. రక్షా బంధన్ శుభాకాంక్షలు.

నువ్వు నా సోదరుడిగా ఉండటమే నాకు అతిపెద్ద బహుమతి. నాకోసం చేసే ప్రతి పనికీ థ్యాంక్యూ. హ్యాపీ రక్షాబంధన్.

నీతో గడిపిన ప్రతి క్షణం ప్రత్యేకమే. ఈ రక్షాబంధన్ నీ జీవితంలో ప్రేమను, ఆనందాల్ని తీసుకురావాలని కోరుకుంటున్నా.

"సోదరీమణులు ప్రపంచంలోనే ఉత్తమ స్నేహితులు." - మార్లిన్ మన్రో.

'నాకు అవసరమైనప్పుడు ఆమె నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె నా సర్వస్వం." - ఆష్లే ఓల్సెన్.

హ్యాపీ రక్షాబంధన్
హ్యాపీ రక్షాబంధన్ (Freepik)

"రాత్రి ఎంత చీకటిగా ఉన్నా, నీ దారిలో వెలుగు నింపడానికి నేనెప్పుడూ ఉంటాను." - హఫ్సా ఫైజల్.

నీలాగే ఉంటూ, నీతోనే పోట్లాడుతూ, నీ జీవితంలో వెలుగు నింపే రూపమే తోబుట్టువు. హ్యాపీ రక్షాబంధన్.