Rajma Pulao: రాజ్మా పులావ్.. మంచి లంచ్ బాక్స్ రెసిపీ..-rajma pulao recipe in detailed steps and measurements ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rajma Pulao: రాజ్మా పులావ్.. మంచి లంచ్ బాక్స్ రెసిపీ..

Rajma Pulao: రాజ్మా పులావ్.. మంచి లంచ్ బాక్స్ రెసిపీ..

HT Telugu Desk HT Telugu
Sep 06, 2023 12:24 PM IST

Rajma Pulao: మధ్యాహ్న భోజనంలోకి రుచికరమైన రాజ్మా పులావ్ ప్రయత్నించి చూడండి. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. తయారీ ఎలాగో తెలుసుకోండి.

రాజ్మా పులావ్
రాజ్మా పులావ్ (slurrp)

మధ్యాహ్న భోజనంలోకి కర్రీ, అన్నం కాకుండా ఏదైనా పులావ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఒకసారి రాజ్మా పులావ్ ప్రయత్నించండి. లంచ్ బాక్సుల్లోకి కూడా ఇది చాలా బాగుంటుంది. మామూలుగా రాజ్మాతో మసాలా కూర చేయడమే చూస్తుంటాం. కానీ ఈ పులావ్ రుచి దానికన్నా బాగుంటుంది. తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. దాని తయారీ ఎలాగో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

సగం కప్పు రాజ్మా గింజలు

1 కప్పు బాస్మతీ బియ్యం

2 చెంచాల నెయ్యి

అంగుళం దాల్చిన చెక్క ముక్క

2 లవంగాలు

2 యాలకులు

అరచెంచా జీలకర్ర

అరచెంచా అల్లం వెల్లుల్లి ముద్ద

1 చెంచా గరం మసాలా

1 ఉల్లిపాయ

1 టమాటా

3 పచ్చిమిర్చి

గుప్పెడు పుదీనా ఆకులు

1 చెంచా కారం

సగం చెంచా కసూరీ మేతీ

1 చెంచా నిమ్మరసం

తగినంత ఉప్పు

తయారీ విధానం:

  1. రాజ్మాను రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీళ్లు వంపేసి 2 కప్పుల నీల్లు పోసుకుని 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు అదే కుక్కర్లో నెయ్యి వేసుకుని వేడెక్కాక యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, జీలకర్ర వేసుకుని వేగనివ్వాలి. పచ్చిమర్చి ముక్కలు కూడా వేసుకోవాలి.
  3. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని నిమిషం పాటూ వేయించుకోవాలి.
  4. టమాటా ముక్కలు, ఉప్పు, కారం, కసూరీ మేతీ, గరం మసాలా వేసుకుని టమాటా ముక్కలు మెత్తబడే దాకా ఆగాలి.
  5. ఉడికించి పెట్టుకున్న రాజ్మా, పుదీనా ఆకులు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకటిన్నర కప్పుల నీల్లు పోసుకుని బియ్యం పోసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
  6. కుక్కర్ మూత్ పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేదాకా మూత పెట్టుకుని తీసేసుకుంటే చాలు. రాజ్మా పులావ్ రెడీ.

Whats_app_banner