Telugu News / Lifestyle /
Cloves benefits: రెండే లవంగాలు.. చెప్పలేనని ప్రయోజనాలు..
Cloves benefits: లవంగాలను మసాలా దినుసుగానే కాక, దాంతో మనకున్న ఆరోగ్య ప్రయోజనాలేంటో, దాన్నెలా వాడొచ్చో వివరంగా తెలుసుకోండి.
లవంగాల ప్రయోజనాలు (freepik)
మాంసాహారం, మసాలా కూరల్లో మనమంతా తరచుగా వాడే సుగంధ ద్రవ్యం లవంగం. మనకు తెలిసినంత వరకు దీనికి ఉన్న ఉపయోగం ఇదే. కానీ దీనిలో ఔషధ విలువల వల్ల దీన్ని ఫార్మాస్యుటికల్, కాస్మొటిక్స్ రంగాలకు సంబంధించిన ఉత్పత్తుల్లోనూ ఎక్కువగా వాడుతుంటారు. అందుకనే లవంగాలను రోజూ ఒకటి రెండు తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం.
ట్రెండింగ్ వార్తలు
లవంగాలు తినడం వల్ల ఉపయోగాలు :
- రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీటితో రెండు లవంగాల్ని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, మలబద్ధకం సహా పొట్ట సంబంధిత సమస్యలు అన్నింటికీ ఇది పరిష్కార మార్గాన్ని చూపుతుంది.
- లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరగడంలో ఇవి సహకరిస్తాయి. యుక్త వయసులో ఉన్న వారిని యాక్నే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. దీనిలో ఉండే సాల్సిలేట్ దీనిపై సమర్థవంతంగా పని చేస్తుంది.
- దంత క్షయం సమస్యలు ఉన్న వారిలో పన్ను పోటు అనేది సాధారణంగా వస్తూ ఉంటుంది. అలా నొప్పి వస్తున్న పన్ను మీద ఒక లవంగ మొగ్గను పెట్టి ఉంచడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. దంత సమస్యలు, చిగుళ్లలో సమస్యలు ఉన్న వారు ఈ పొడిని పళ్లు తోముకోవడానికి ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది. అలాగే కొందరికి నోటి నుంచి దుర్వాసన సమస్య ఇబ్బంది పెడుతుంది. అలాంటి వారు ఓ లవంగాన్ని నోట్లో వేసుకుని నమలడం వల్ల దుర్వాసన తగ్గుతుంది.
- కొంత మందికి కాళ్లూ, చేతులు వణుకుతుంటాయి. అలాంటి వారు పడుకునే ముందు ఒకటి రెండు లవంగాలను తినడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
- సైనస్, ఆస్థమా, వైరల్ ఇన్‌ఫెక్షన్లు, దగ్గు, జలుబు లాంటి లక్షణాలతో బాధ పడేవారికి లవంగాలు వంటింట్లోనే ఉన్న మందులా పని చేస్తాయి.
- రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల లాంటివి దరి చేరకుండా చూస్తాయి.
- కొందరికి బస్సులు, కార్లలో ప్రయాణం పడదు. వికారం, వాంతులతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు ప్రయాణానికి ముందు, ప్రయాణ సమయంలో రెండు లవంగాలను తినడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయి వాంతులు తగ్గుతాయి.
- లవంగ నూనె మన శరీరం పైన వచ్చే వాపులు, నొప్పుల్లాంటి వాటిని చక్కగా తగ్గిస్తుంది. అయితే దీన్ని నేరుగా వాడకుండా ఏదైనా నూనెతో కలిపి, సమస్య ఉన్నచోట రాసుకోవాలి.