Puppy Yoga: అలియా భట్ అందంగా, సన్నగా ఉండటానికి పప్పీ యోగానే కారణం, ఇది ఎలా చేయాలంటే-puppy yoga is the reason why alia bhatt is beautiful and slim heres how to do it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Puppy Yoga: అలియా భట్ అందంగా, సన్నగా ఉండటానికి పప్పీ యోగానే కారణం, ఇది ఎలా చేయాలంటే

Puppy Yoga: అలియా భట్ అందంగా, సన్నగా ఉండటానికి పప్పీ యోగానే కారణం, ఇది ఎలా చేయాలంటే

Haritha Chappa HT Telugu

Puppy Yoga: పప్పీ యోగాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ యోగాభ్యాసంలో స్ట్రెచింగ్, శ్వాస యోగా భంగిమలు ఉంటాయి. వెన్ను, దిగువ శరీరంలోని నొప్పుల నుండి ఇది ఉపశమనం కలిగిస్తాయి. అలియ భట్ ప్రతిరోజూ ఈ పప్పీ యోగాను ప్రాక్టీసు చేస్తుంది.

పప్పీ యోగా ఉపయోగాలు

Puppy Yoga: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి యోగా ఉత్తమ అభ్యాసం. భారతదేశంలో వేలాది సంవత్సరాలుగా ఋషులు యోగాను చేస్తున్నారు. నేడు యోగాకు ఎంతో ఆదరణ దొరుకుపోతోంది. రాజకీయ నాయకులు, పెద్ద సెలబ్రిటీలు ఆరోగ్యంగా ఉండటానికి యోగా చేయాలని సిఫార్సు చేస్తున్నారు. సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ అన్షుకా చెబుతున్న ప్రకారం పప్పీ యోగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అలియా భట్ డెలివరీ అయ్యాక త్వరగా నాజూకైన శరీరాన్ని సొంతం చేసుకోవడానికి పప్పీ యోగా ఎంతో ఉపయోగపడుతుంది. అలియా భట్ పప్పీ యోగా చేస్తున్న ఫోటోలు, వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పప్పీ యోగాను ఉత్తాన శిశు ఆసనం అని కూడా అంటారు. ఆలియా ఒక చక్రం సహాయంతో ఈ యోగాను బాగా ప్రాక్టీసు చేస్తుంది. భుజాలు, గుండెకు పప్పీ యోగా ఎంతో సహాయపడుతుందని అన్షుకా చెబుతోంది.

పప్పీ యోగాను శునక భంగిమ అని కూడా పిలుస్తారు. ఈ యోగాభ్యాసం సమయంలో, వ్యక్తి స్ట్రెచింగ్, శ్వాసకు సంబంధించిన యోగా భంగిమలు చేయాల్సి వస్తుంది.

పప్పీ యోగా ప్రయోజనాలు

పప్పీ యోగాసనం శరీరానికి, మనస్సుకు అనేక రకాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది.

గంటల తరబడి ఒకే చోట కూర్చునేవారికి ఈ యోగాసనం ఒక వరం. ఈ యోగా చేయడం వల్ల శరీరం కింది భాగంలో ఒత్తిడితో పాటు నరాలు స్ట్రెచ్ అవుతాయి. ఇది నడుము, దిగువ శరీర నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

పప్పీ యోగా మనస్సును శాంతపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ కారణంగా దీనిని మెల్టింగ్ హార్ట్ పోజ్ అని కూడా పిలుస్తారు.

కుక్కపిల్ల యోగా చేయడం వల్ల భుజం నుంచి పిరుదుల వరకు కండరాలు స్ట్రెచ్ అవుతాయి. దీని వల్ల శరీరం పూర్తిగా రిలాక్స్ అవుతుంది. భుజం నొప్పి సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

పప్పీ యోగా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది నడుము, వీపు, కాళ్ళ దిగువ భాగంలో నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

పప్పీ యోగా చేసే పద్ధతి

పప్పీ యోగా చేయాలంటే ముందుగా నేలపై వజ్రాసన భంగిమలో కూర్చొని లోతైన శ్వాస తీసుకుని రెండు చేతులను పైకి లేపాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను బయటకు తీసి, మీ శరీరాన్ని ముందుకు వంచండి. ఇప్పుడు మీ రెండు చేతులను నేలపై ఉంచండి. మీ దిగువ భాగాన్ని పైకి లేపడానికి ప్రయత్నించండి. ఇలా చేసేటప్పుడు, మీ కాళ్ళు నిటారుగా, వెనుక భాగం పైకి ఉండాలి. ఈ భంగిమలో రెండు నిమిషాలు ఉండండి. తరువాత సాధారణ స్థితిలో కూర్చోండి.