Yoga for Dengue: డెంగ్యూ తగ్గేందుకు యోగా గురువు చెప్పిన 4 యోగాసనాలివే-know different four yoga poses to faster recovery from dengue fever ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Yoga For Dengue: డెంగ్యూ తగ్గేందుకు యోగా గురువు చెప్పిన 4 యోగాసనాలివే

Yoga for Dengue: డెంగ్యూ తగ్గేందుకు యోగా గురువు చెప్పిన 4 యోగాసనాలివే

Published Jun 30, 2024 03:55 PM IST Koutik Pranaya Sree
Published Jun 30, 2024 03:55 PM IST

Yoga for Dengue: డెంగ్యూ జ్వరం ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని యోగాసనాలు త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి. ఆ యోగాసనాలు తెలుసుకోండి.

డెంగ్యూతో బాధపడేవారు జ్వరం, వాంతులు, తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు.అలాంటప్పుడు తగినన్ని నీళ్లు తాగాలి.  శక్తిని తిరిగి పొందడానికి, వ్యాధితో పోరాడటానికి సులభంగా జీర్ణమయ్యే, పోషకాలున్న ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం.తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల వ్యాధి నుండి త్వరగా కోలుకోవడం సులభమవుతుంది..

(1 / 6)

డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడానికి డైట్ టిప్స్, యోగాసనాలు ఎలా చేయాలో ప్రముఖ యోగా గురువు గ్రాండ్ మాస్టర్ అక్షర్ వివరించారు.

(2 / 6)

1 వజ్రాసనం - మీ మోకాళ్ళను చాప లేదా యోగా మ్యాట్ ను తాకేలా మడల్చాలి. పిరుదులను మడమలపై ఉంచండి. మడమలను ఒకదానికొకటి కొంత దూరంలో ఉంచండి. అరచేతులను  తొడలపై ఉంచి, వీపును నిటారుగా ఉంచి ముందుకు చూడండి.

(3 / 6)

2. మలాసనం - మీ చేతులను మీ శరీరానికి ఇరువైపులా నిటారుగా ఉంచాలి. మోకాళ్లను వంచి పాదాలను మాత్రమే భూమికి తాకేలా కూర్చోండి. అరచేతులను పాదాల పక్కన నేలపై ఉంచవచ్చు లేదా ప్రార్థన చేస్తున్నట్లు వాటిని మీ ఛాతీ ముందు జతచేయవచ్చు. వెన్నెముకను మాత్రం నిటారుగా ఉంచండి.

(4 / 6)

3. పశ్చిమోత్తనసనం - మీ కాళ్ళను ముందుకు చాపి ప్రారంభించండి. అవసరమైతే, మోకాళ్ళను కొద్దిగా వంచండి, చేతులను పైకి లేపండి, వెన్నెముకను నిటారుగా ఉంచండి. శ్వాసను వదులుతూ, ముందుకు వంగండి. మీ చేతి వేళ్లతో కాలి వేళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇలా 10 సెకన్ల పాటు చేయండి.

(5 / 6)

4. బ్రహ్మారీ ప్రాణాయామం - సుఖాసనం లేదా అర్ధ పద్మాసనం లేదా పద్మాసనం వంటి సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోండి. వీపును నిటారుగా ఉంచి, మీ కళ్లు మూసుకునిమీ చెవి బయటి భాగం పై బొటనవేలు ఉంచండి. చూపుడు వేలిని నుదుటిపై ఉంచండి, మీ మధ్య వేలిని ముక్కు మధ్య భాగంలో ఉంచండి. చిన్న వేలిని ముక్కు మూలలో ఉంచండి. శ్వాస పీలుస్తూ వదులుతూ ఉండండి. ఊపిర వదిలేటప్పడు తేనెటీగ లాగా "మ్మ్మ్మ్" అని శబ్దం చేస్తూ గాలి వదలండి. నోరు మూసే ఉంచి ఈ శబ్దం చేయాలి. 

(6 / 6)

4. బ్రహ్మారీ ప్రాణాయామం - సుఖాసనం లేదా అర్ధ పద్మాసనం లేదా పద్మాసనం వంటి సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోండి. వీపును నిటారుగా ఉంచి, మీ కళ్లు మూసుకుని

మీ చెవి బయటి భాగం పై బొటనవేలు ఉంచండి. చూపుడు వేలిని నుదుటిపై ఉంచండి, మీ మధ్య వేలిని ముక్కు మధ్య భాగంలో ఉంచండి. చిన్న వేలిని ముక్కు మూలలో ఉంచండి. శ్వాస పీలుస్తూ వదులుతూ ఉండండి. ఊపిర వదిలేటప్పడు తేనెటీగ లాగా "మ్మ్మ్మ్" అని శబ్దం చేస్తూ గాలి వదలండి. నోరు మూసే ఉంచి ఈ శబ్దం చేయాలి. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు