Almond Pakora: రాఖీ పండగ రోజు స్పెషల్ స్నాక్.. స్పైసీ బాదాం పకోడీ
Almond Pakora: రాఖీ పండగ రోజు సాయంత్రం పూట తినడానికి కరకరలాగే, కారం కారం బాదాం పకోడీ చేసుకోండి. తయారీ ఎలాగో చూసేయండి.
బాదాం పప్పు పకోడీ (Photo by Chef Manish Mehrotra)
రాఖీ రోజు కూడా రోజూతినే స్నాక్స్ ఏం తింటారు. కాస్త విభిన్నంగా ఈ స్పైసీ బాదాం పకోడీ ప్రయత్నించి చూడండి.
కావాల్సిన పదార్థాలు:
1 కప్పు పొట్టులేని బాదాం పప్పు
2 చెంచాల శనగపిండి
1 చెంచా రవ్వ
డీప్ ఫ్రై కి సరిపడా నూనె
అరచెంచా కారం
పావు చెంచా పసుపు
అరచెంచా జీలకర్ర పొడి
తగినంత ఉప్పు
చిటికెడు ఇంగువ
కరివేపాకు తరుగు
2 చెంచాల నీళ్లు
1 చెంచా అల్లం తురుము
సగం చెంచా పచ్చిమిర్చి తరుగు
తయారీ విధానం:
- ముందుగా బాదాం పప్పును ఓవెన్ లో 180 డిట్రీ సెల్సియస్ దగ్గర 4 నిమిషాల పాటూ రోస్ట్ చేసుకోవాలి. లేదా కడాయిలో నూనె లేకుండా ఒక 5 నిమిషాల పాటూ వేయించండి.
- ఒక పెద్ద గిన్నెలో శనగపిండి, రవ్వ, వేయించిన బాదాం, ఇంగువ, జీలకర్ర పొడి, కారం, పసుపు, కరివేపాకు తరుగు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపండి. మధ్య మధ్యలో కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండి బాదాంలకు పట్టేలా చూడండి.
- కడాయిలో నూనె పోసుకుని వేడెక్కాక బాదాం ను పకోడీల్లాగా పోసుకొని వేయించుకోండి.
- రంగు మారగానే తీసేసుకుంటే చాలు. రుచికరమైన స్నాక్ రెడీ.