Kadhi pokora curry: పంజాబీ స్టైల్ కడీ పకోడీ కర్రీ.. ఒక్కసారి తింటే వదలరు…-kadhi pokora curry recipe with detailed measurements ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kadhi Pokora Curry: పంజాబీ స్టైల్ కడీ పకోడీ కర్రీ.. ఒక్కసారి తింటే వదలరు…

Kadhi pokora curry: పంజాబీ స్టైల్ కడీ పకోడీ కర్రీ.. ఒక్కసారి తింటే వదలరు…

HT Telugu Desk HT Telugu
Aug 07, 2023 01:34 PM IST

Kadhi pokora curry: పంజాబీ స్టైల్ కడీ పకోడీ కర్రీ తయారీ చాలా సులభం. రుచిలో అమోఘంగా ఉంటుంది. అదెలాగో చూసేయండి.

కడీ పకోడీ కర్రీ
కడీ పకోడీ కర్రీ

ఏదైనా కొత్త కర్రీ చేయాలనుకుంటున్నారా? అయితే పంజాబీ స్పెషల్ కడీ పకోడా కర్రీ చేసి చూడండి. జీరా రైస్ లోకి లేదా వైట్ రైస్ లోకి ఈ కర్రీతో తింటే ఎంత తిన్నా కడుపు నిండదు. పకోడీలు, కర్రీ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో విడివిడిగా, వివరంగా తెలుసుకోండి.

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు పెరుగు

సగం కప్పు శనగపిండి

అరచెంచా ధనియాల పొడి

చెంచా కారం

అరచెంచా జీలకర్ర పొడి

అరచెంచా పసుపు

అరచెంచా గరం మసాలా

పావు చెంచా మిరియాల పొడి

తగినంత ఉప్పు

పావు కప్పు వంట నూనె

ఒక ఉల్లిపాయ తరుగు

4 వెల్లుల్లి తరుగు

చిన్న అల్లం ముక్క తరుగు

పకోడీ కోసం కావాల్సిన పదార్థాలు:

చిన్న ఉల్లిపాయ సన్నటి పొడవాటి ముక్కలు

చిన్న బంగాళదంుప సన్నటి ముక్కలు

1 చెంచా కసూరీ మేతీ

తగినంత ఉప్పు

సగం చెంచా కారం

చిటికెడు వంటసోడా

సగం చెంచా నిమ్మరసం

సగం కప్పు శనగపిండి

డీప్ ఫ్రై కి సరిపడా వంటనూనె

సగం చెంచా నిమ్మరసం

తయారీ విధానం:

  1. పెద్దగిన్నెలో పెరుగు, శనగపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి ఉండలుగా ఉంటే కొన్ని నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి.
  2. దీంట్లో ఇప్పుడు మసాలాలు, కాస్త ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు కడాయి పెట్టుకుని నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలి. అందులోనే రెండు చెంచాల నీళ్లు పోసుకోవాలి.
  4. నీళ్లు ఇంకిపోయాక వెల్లుల్లి, అల్లం వేసుకుని వేగనివ్వాలి. మిగతా మసాలాలు వేసుకుని కాసేపు వేగనివ్వాలి. అందులో పెరుగు కలుపుకున్న మిశ్రమం వేసుకుని కలుపుకోవాలి.
  5. ఒక కప్పు నీళ్లు పోసుకుని నూనె పైకి తేలేంత వరకు మిశ్రమాన్ని ఉడకనివ్వాలి. తర్వాత సన్నని మంట మీద ఉడకనివ్వాలి. ఆలోపు పకోడీలు సిద్ధం అవుతాయి.

పకోడీలు తయారు చేసే విధానం:

  1. ఒక గిన్నెలో పకోడీల కోసం కావాల్సిన పదార్థాలన్నీ వేసుకోవాలి. నూనె నీళ్లు తప్ప మిగతావన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి.
  2. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని పకోడీల పిండిలాగా కలుపుకోవాలి.
  3. కడాయిలో నూనె పోసుకుని వేడెక్కాక, పకోడీలు వేసుకోవాలి. రంగు మారేంత వరకు వేగనివ్వాలి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు ఉడుకుతున్న పెరుగు మిశ్రమం గ్యాస్ మీద నుంచి దించి కాస్త నిమ్మరసం పిండుకోవాలి.
  5. ఇపుడు సిద్ధం చేసుకున్న పకోడీలను ఈ మిశ్రమంలో వేసుకోవాలి. మెల్లగా కలుపుకోవాలి.
  6. ఒక పది నిమిషాలయ్యాక సర్వ్ చేసుకుంటే చాలు. పంజాబీ స్టైల్ కడీ పకోడా సిద్ధం.

Whats_app_banner