Sabudana: వీళ్లు సాబుదానా అస్సలు తినకూడదు, డయాబెటిస్ పేషెంట్లు ఇది చదవాల్సిందే
Sabudana: సాబుదానా వల్ల శరీరానికి అనేక పోషకాలు దొరుకుతాయి. కానీ కొందరు మాత్రం దానికి దూరంగా ఉండటమే మేలు. లేదంటే దానివల్ల జరిగే నష్టాలేంటో చూడండి.
ఉపవాస సమయంలో ఎక్కువగా తినే ఆహారాల్లో సాబుదానా ఒకటి. పండ్లతో పాటే ఎక్కువగా సాబుదానాతో చేసిన కిచిడీ, తాలీ పీట్, పాయసం, సాబుదాన వడలు తింటుంటారు. సాబుదానా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే దీంతో చేసేవన్నీ రుచిగానూ ఉంటాయి. సాబుదానాలో ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్, ఫైబర్, కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలున్నా సరే కొంతమంది మాత్రం సాబుదానా తినకపోవడమే మంచిది. లేదంటే వాళ్ల ఆరోగ్య స్థితికి మరింత హాని జరుగుతుంది.
డయాబెటిస్:
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం కార్బోహైడ్రేట్లు శరీరంలో చక్కెర మొత్తాన్ని పెంచేస్తాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువ. షుగర్ పేషెంట్లు జీఐ తక్కువుండే ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. సాబుదానాలో కార్బోహైడ్రేట్ల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు సాబుదానాకు దూరంగా ఉండటం అత్యవసరం. దీని ప్రభావం షుగర్ స్థాయుల మీద పడుతుంది.
అధిక బరువు:
నవరాత్రి ఉపవాసం సమయంలో కేవలం సగ్గుబియ్యం లేదా సాబుదానా మాత్రమే తీసుకోవడం వల్ల ఎన్నో కిలోల బరువు తగ్గేయొచ్చు అనుకుంటే మాత్రం పొరపాటే. సాబుదానాలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు రెండూ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ బరువు తగ్గించడం పక్కన పెడితే మరింత వేగంగా మీ బరువును పెంచుతుంది.
థైరాయిడ్:
సాబుదానాను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. దీని వల్ల క్రమంగా థైరాయిడ్ సమస్యలు రావచ్చు. కాబట్టి ఇప్పటికే ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్లు సగ్గుబియ్యం ఎక్కువగా తినకుండా ఉండటమే మేలు. సగ్గుబియ్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు, ఛాతీ లో మంట, తలనొప్పులు, థైరాయిడ్ సమస్యలు రావచ్చు.
జీర్ణ సమస్యలు:
సగ్గుబియ్యం ఎక్కువగా తీసుకుంటే బ్లోటింగ్, మలబద్దకం లాంటి సమస్యలు చుట్టుముట్టేస్తాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడేవారు దీనికి దూరంగా ఉండాలి.
అలాగే దీంట్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. ప్రొటీన్లు, ఐరన్ లాంటివి తక్కువ. కాబట్టి కేవలం శక్తికోసం ఉపవాసం రోజున సాబుదానా మీదే ఆధారపడకూడదు. సరైన పోషకాలున్న పండ్లు, కూరగాయలు చేర్చుకోవాలి.
టాపిక్