Diabetes tips: డయాబెటిస్ ఉన్న వారు డ్రైఫ్రూట్స్ ఇలా తినండి, లేకుంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి-people with diabetes should eat dry fruits otherwise the sugar levels will increase ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes Tips: డయాబెటిస్ ఉన్న వారు డ్రైఫ్రూట్స్ ఇలా తినండి, లేకుంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి

Diabetes tips: డయాబెటిస్ ఉన్న వారు డ్రైఫ్రూట్స్ ఇలా తినండి, లేకుంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి

Haritha Chappa HT Telugu
Sep 18, 2024 04:30 PM IST

Diabetes tips: డయాబెటిస్ ఉన్నవారు ఆహారపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ డ్రై ఫ్రూట్స్ తింటుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్ కూడా మధుమేహులకు కీడు చేసే అవకాశం ఉంది.

డయాబెటిస్ ఉంటే డ్రైఫ్రూట్స్ తినవచ్చా?
డయాబెటిస్ ఉంటే డ్రైఫ్రూట్స్ తినవచ్చా? (Shutterstock)

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మంచి ఆహారం, మెరుగైన జీవనశైలి లేకపోవడం వల్ల మధుమేహం వంటి వ్యాధులు త్వరగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు షుగర్ వ్యాధి సాధారణమై పోయింది. ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ కనిపిస్తాడు. షుగర్ వ్యాధి ఉన్నప్పుడు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. షుగర్ లెవల్స్ త్వరగా పెంచే ఆహారాన్ని తినకూడదు. షుగర్ పేషెంట్లు తరచూ డ్రై ఫ్రూట్స్ ను డైట్ లో చేర్చుకుంటారు. అయితే షుగర్ పేషెంట్లు ఎలా తినాలో ప్రతి డయాబెటిక్ రోగి తెలుసుకోవాలి.

డ్రైఫ్రూట్స్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ మధుమేహ రోగులకు మేలు చేస్తాయన్న గ్యారంటీ లేదు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తున్నప్పటికీ వాటిని పరిమితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని డ్రై ఫ్రూట్స్ నీటిలో నానబెట్టి తింటే, మరికొన్ని నానబెట్టకుండా తినాలి.

అంజీర పండ్లు

పోషకాలు నిండిన రుచికరమైన డ్రై ఫ్రూట్ అంజీర్. ఇందులో ఫైబర్ తో పాటు నేచురల్ షుగర్ పుష్కలంగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లు ఈ పండ్లను ఎక్కువగా తినకూడదు. అలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరుగుతాయి. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున నానబెట్టిన అంజీర్లను తినకూడదు.

కిస్ మిస్

ఇవి తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా కిస్ మిస్‌లు చాలా మేలు చేస్తుంది. అయితే ఇది డయాబెటిస్ పేషెంట్లకు మాత్రం ఇవి కాస్త హానికరం. వాస్తవానికి, సహజ చక్కెర ఎండు ద్రాక్షలో పుష్కలంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, షుగర్ రోగులు వీటిని తక్కువగా తింటే మంచిది. ఉదయాన్నే పరగడుపున నానబెట్టిన ఎండు ద్రాక్ష తినడం పూర్తిగా మానుకోవాలి.

ఎండు ఖర్జూరం

ఉదయాన్నే పరగడుపున నానబెట్టిన ఎండు ఖర్జూరం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది పొట్టకు సంబంధించిన అనేక సమస్యలను తొలగిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థ కూడా దృఢంగా మారుస్తుంది. కానీ డయాబెటిక్ పేషెంట్లు ఉదయాన్నే పరగడుపున నానబెట్టిన ఎండు ఖర్జూరం తినకూడదు. ఇది ప్రయోజనానికి బదులు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అయితే డయాబెటిక్ పేషెంట్లు ఎండు ఖర్జూరాన్ని తక్కువ మోతాదులో తినవచ్చు.

ఎండుద్రాక్ష

ఎండు ద్రాక్షలో నేచురల్ షుగర్ పుష్కలంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, డయాబెటిక్ రోగులు దీనిని చాలా తక్కువ పరిమాణంలో తినాలి. షుగర్ లెవెల్స్ ను ఇవి ఎక్కువగా పెంచుతాయి. కాబట్టి వీటిని తినే ముందు ఆరోగ్య నిపుణుల సలహాతో మాత్రమే వీటిని తీసుకోవాలి. అయితే షుగర్ రోగులు ఎండుద్రాక్షను నానబెట్టి తినకూడదు ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని చాలా వేగంగా పెంచుతుంది.

పైన చెప్పిన డ్రైఫ్రూట్స్ కాకుండా బాదం, వాల్ నట్స్, జీడిపప్పు, వేరుశెనగపప్పులు వంటివి నీటిలో నానబెట్టి తింటే ఎంతో మంచిది. అలాగే గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్ వంటివి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Whats_app_banner