Paneer Popcorn Recipe : సాయంత్రవేళ టీకి జోడిగా.. పనీర్​ పాప్​కార్న్..-paneer popcorn recipe for evening snack here is the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paneer Popcorn Recipe : సాయంత్రవేళ టీకి జోడిగా.. పనీర్​ పాప్​కార్న్..

Paneer Popcorn Recipe : సాయంత్రవేళ టీకి జోడిగా.. పనీర్​ పాప్​కార్న్..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 19, 2022 04:15 PM IST

Paneer Popcorn Recipe : పాప్​కార్న్ అంటే పర్​ఫెక్ట్ స్నాక్. అయితే ఇంట్లో పాప్​కార్న్ చేసుకోవాలి అనుకునేవారికి.. ముఖ్యంగా పనీర్​తో కొత్తగా ఏమైనా ట్రై చేయాలి అనుకునేవారికి ఇక్కడో మంచి రెసిపీ ఉంది. మీ సాయంత్రాన్ని స్పెషల్​గా మార్చుకోవాలంటే దీనిని మీరు ట్రై చేయాల్సిందే.

పనీర్​ పాప్​కార్న్
పనీర్​ పాప్​కార్న్

Paneer Popcorn Recipe : శాఖాహారులకు పనీర్.. చికెన్ లాంటి ఆహారం అని చెప్పవచ్చు. ఈ పనీర్​తో ఎన్నో వైవిధ్యమైన వంటలు చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం స్నాక్​లాగా కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? మీ సాయంత్రాన్ని మరింత స్పెషల్​గా మార్చే పనీర్​ పాప్​కార్న్ మీకు కచ్చితంగా మంచి రుచితో పాటు.. స్పెషల్ ఫీలింగ్ ఇస్తుంది. అంతేకాకుండా దీనిని తయారు చేయడం చాలా సులభం. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* పనీర్ - 250 గ్రాములు

* కారం - పావు టీ స్పూన్

* పార్ల్సీ - పావు టీ స్పూన్

* ఒరిగానో - పావు టీ స్పూన్

* పెప్పర్ - పావు టీ స్పూన్

* సాల్ట్ - రుచికి తగినంత

* శెనగపిండి - అరకప్పు

* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్

* పసుపు - చిటికెడు

* బేకింగ్ సోడా - చిటికెడు

* బ్రెడ్ క్రంబ్స్ - అరకప్పు

తయారీ విధానం

ఓ గిన్నె తీసుకుని.. దానిలో పనీర్, కారం, పార్ల్సీ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, డ్రై పార్స్లీ, ఒరేగానో, పెప్పర్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపండి. పనీర్ క్యూబ్‌లు విరిగిపోకుండా పనీర్‌కు మొత్తం మసాలా పట్టేలా సున్నితంగా కలపండి. ఇప్పుడు మరొ గిన్నె తీసుకుని దానిలో.. శెనగపిండి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, బేకింగ్ సోడా వేసి కలంపిడి. నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి. మందపాటి పిండిని తయారు చేయండి. పిండి మృదువుగా, ఎటువంటి ముద్దలు లేకుండా ఉండాలి. ప్రతి పనీర్ క్యూబ్‌ను పూర్తిగా శెనగపిండితో కోట్ చేయండి. కోటెడ్ పనీర్‌ను బ్రెడ్‌క్రంబ్స్‌లో ఉంచండి. పనీర్‌ను బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. అంతే వేడి వేడి పనీర్ పాప్​కార్న్ రెడీ.

Whats_app_banner

సంబంధిత కథనం