Palak Papad: ఓసారి పాలకూర అప్పడాలు చేసి చూడండి, పప్పు, సాంబార్‌తో జతగా అదిరిపోతాయి
Palak Papad: పాలకూరతో అప్పడాలు ఏంటి? అనుకోకండి. ఈ అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడూ ఒకేలాంటి వడియాలు కన్నా రుచికరమైన పాలకూర వడియాలు కొత్త రుచిని అందిస్తాయి. వీటిని చేయడం కూడా చాలా సులువు.
Palak Papad: పాలకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయినా వాటిని తినేవారి సంఖ్య ఎక్కువే. పాలకూరతో అప్పడాలు చేసి చూడండి... అందరూ ఇష్టంగా తింటారు. ఈ పాలకూర అప్పడాలు చేయడం చాలా సులువు. మండే ఎండలు వచ్చేస్తున్నాయి... వేసవిలో ఈ వడియాలు కేవలం రెండు రోజుల్లో చక్కగా ఎండిపోతాయి. వాటిని ఎలా చేయాలో ఇక్కడ మేము ఇస్తున్నాం.
పాలకూర అప్పడాలు రెసిపీకి కావలసిన పదార్థాలు
పాలకూర - రెండు కట్టలు
బియ్యం - ఒక కప్పు
నువ్వులు - మూడు స్పూన్లు
జీలకర్ర - ఒక స్పూన్
పచ్చిమిర్చి - ఐదు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - సరిపడినన్ని
పాలకూర అప్పడాలు రెసిపీ
1. బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పాలకూర సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
3. కళాయిలో మూడు కప్పులు నీటిని వేసి బాగా మరిగించాలి.
4. నీరు ఉడుకుతున్నప్పుడు కడిగిన బియ్యాన్ని వేసి ఉడికించాలి.
6. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
7. ఈ మొత్తాన్ని చిక్కగా మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
8. అప్పడాల పిండిలాగా అయ్యాక స్టవ్ కట్టేయాలి.
9. స్టవ్ కట్టేశాక నువ్వులు గింజలను వేసి కలుపుకోవాలి.
10. అలాగే ఒక స్పూన్ జీలకర్రను వేసి కలుపుకోవాలి.
11. ఈ మొత్తం మిశ్రమం గట్టిగా అయ్యేదాకా ఉడికించుకోవాలి.
12. మిశ్రమం చల్లారాక చిన్న ముద్దను తీసుకొని పల్చటి అప్పడాలలాగా ఒత్తుకోవాలి.
13. రెండు మూడు రోజులు పాటు ఎర్రటి ఎండలో ఆరబెడితే పాలకూర అప్పడాలు రెడీ అయిపోతాయి.
14. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి.
సాంబారు, పప్పు, పెరుగు వంటివి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు రుచిగా ఉంటాయి. ఇవి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవన్నీ కూడా అప్పడాల మనం అందుకోవచ్చు. కొంచెం నూనెలో ఈ అప్పడాలను వేయించండి. ఒక్కసారి చేసి చూడండి... మీకు వీటి రుచి అదిరిపోతుంది. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ లా కూడా ఈ అప్పడాలను తినేందుకు ఇష్టపడతారు. పాలకూరలో మనకు అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.