Foods That Harm : ఇవి తినడం తగ్గించకపోతే.. మీ లివర్​ డ్యామేజ్​ అయిపోద్ది..-not just alcohol but daily intake of these substances affects the liver ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Foods That Harm : ఇవి తినడం తగ్గించకపోతే.. మీ లివర్​ డ్యామేజ్​ అయిపోద్ది..

Foods That Harm : ఇవి తినడం తగ్గించకపోతే.. మీ లివర్​ డ్యామేజ్​ అయిపోద్ది..

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 30, 2022 09:09 AM IST

కొన్ని ఆహారాలు చాలా మంచివిగా ఉంటాయి. అంత ప్రమాదకరమైనవిగా అనిపించవు. అందుకే వాటిని మనం తరచూ తీసుకుంటూ ఉంటాం. కానీ అవి మీ శరీరానికి, ముఖ్యంగా కాలేయానికి హాని కలిగించే ప్రమాదముంది అంటున్నారు వైద్య నిపుణులు. మరి ఏ ఆహారాలు తీసుకుంటే లివర్ డ్యామేజ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

<p>లివర్ డ్యామేజ్</p>
లివర్ డ్యామేజ్

Liver Health : చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటే మాత్రమే లివర్ డ్యామేజ్ అవుతుంది అనుకుంటారు. కానీ కాదండోయ్. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా లివర్ డ్యామేజ్​ అయ్యే ప్రమాదముంది. కొన్ని ఆహారాలు హానికరమైనవి కానప్పటికీ.. శరీరానికి తీవ్రమైన హాని చేస్తాయి. కొన్నిసార్లు కాలేయం సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని ఆహారాలను రోజువారీ డైట్ లిస్ట్ నుంచి తీసివేయాలి అంటున్నారు డా. సిద్ధార్థ్ వర్గబ్. మరీ డైట్​ నుంచి తీసేయాల్సిన ఆ ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం.

షుగర్

మనలో చాలా మంది చక్కెరను మితంగా తినడం వల్ల పెద్దగా హాని జరగదని అనుకుంటారు. షుగర్ రక్తంలో చక్కెర స్థాయిలను మాత్రమే పెంచుతుందని భావిస్తారు. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. కానీ అది అస్సలు పాయింట్ కాదు. చక్కెర తినడం వల్ల కాలేయ సమస్యలు కూడా పెరుగుతాయి. తక్కువ మోతాదులో చక్కెర తీసుకున్నా సరే.. అది కాలేయాన్ని దెబ్బతీస్తుంది.

మైదా పిండి

మైదా పిండి లేదా కొవ్వు పదార్ధాలు కాలేయానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి. చాలా మంది బిస్కెట్లు తింటారు. ఇందులో మైదా పిండి ఉంటుంది. అది మీకు ప్రమాదకరమైనది కావచ్చు. బిస్కెట్లు తరచూ తినడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది.

జంక్ ఫుడ్

చాలా మంది క్రమం తప్పకుండా జంక్ ఫుడ్ తింటారు. కొంచెం జంక్ ఫుడ్ తినడం వల్ల శరీరానికి హాని ఉండదు. అయితే విషయం అది కాదు. కానీ జంక్ ఫుడ్ కాలేయానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది.

రెడ్​ మీట్​

రెడ్​ మీట్​ లేదా అదనపు కొవ్వు ఉన్న మాంసం తింటే కాలేయానికి పెద్ద నష్టం కలుగుతుంది. ఈ తరహా మాంసాహారం తీసుకోవడం తగ్గించడం వల్ల కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఆల్కహాల్

తక్కువ మొత్తంలో ఆల్కహాల్ శరీరానికి హాని కలిగించదని చాలా మంది అనుకుంటారు. కానీ కాలేయం విషయంలో అది పూర్తిగా నిజం కాదు. ఆల్కహాల్ కాలేయానికి చాలా హాని కలిగిస్తుంది. తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగినా.. కాలేయం తీవ్రంగా దెబ్బతింటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం