New Year Wishes 2024 for Parents: కనిపించే దేవతలు అమ్మానాన్న... వారికి ఇలా విషెస్ చెప్పండి-new year wishes for parents in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  New Year Wishes 2024 For Parents: కనిపించే దేవతలు అమ్మానాన్న... వారికి ఇలా విషెస్ చెప్పండి

New Year Wishes 2024 for Parents: కనిపించే దేవతలు అమ్మానాన్న... వారికి ఇలా విషెస్ చెప్పండి

Haritha Chappa HT Telugu
Dec 28, 2023 09:47 AM IST

New Year Wishes for Parents: హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా నాన్న!. రాబోయే సంవత్సరం మీకు అపారమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.

అమ్మానాన్నలకు హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు
అమ్మానాన్నలకు హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు (pixabay)

New Year Wishes for Parents: పాత ఏడాది 2023 ముగిసిపోతోంది. గత సంవత్సరంలోని సంతోషకరమైన క్షణాలను నెమరువేసుకోవలసిన సమయం ఇది. కొత్త ఏడాదిలో స్నేహితులకు, బంధువులకు శుభాకాంక్షలు పంపుతాము, కానీ మన వెన్నంటి ఉండే అమ్మానాన్నకు మాత్రం ఎందుకు చెప్పము? మొదటిగా చెప్పాల్సింది వారికే. ఈ ప్రపంచంలోకి మనల్ని తీసుకొచ్చి కంటికి రెప్పలా కాపాడుతున్న అమ్మానాన్నలకు ప్రథమంగా న్యూ ఇయర్ విషెస్ చెప్పాలి.

హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు

1. డియర్ అమ్మానాన్న...

మీకు ఈ సంవత్సరం అందంగా సాగిపోవాలని కోరుకుంటున్నాను.

ఈ ఏడాది మీకు కచ్చితంగా గొప్ప సంవత్సరం అవుతుంది.

హ్యాపీ న్యూ ఇయర్

2. ప్రియమైన తల్లిదండ్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ కొత్త సంవత్సరంలో మీకు ఆయురారోగ్యాలు,

సంతోషం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

3. ఈ కొత్త సంవత్సరం మీకు అంతులేని ఆనందాన్ని, ఆశీర్వాదాలను అందిస్తుందని ఆశిస్తున్నాను.

మీ జీవితమే నాకు స్ఫూర్తి.

హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా నాన్న

4. నా తల్లిదండ్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

నా జీవితంలో ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత మీకే.

ఎల్లవేళలా నాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు.

వారికి ప్రేమను అందించాల్సిన బాధ్యత నాదే.

5. స్వచ్ఛమైన ప్రేమకు

మచ్చలేని మమతకు

అచ్చమైన అనురాగానికి

నిలువెత్తు నిదర్శనం

అమ్మా నాన్న

వారికి హ్యాపీ న్యూఇయర్

6. మాకు ఈ జీవితాన్ని

ప్రసాదించిన అమ్మానాన్నలకు

హ్యాపీ న్యూ ఇయర్

7. ఎవరు చెప్పారు డబ్బున్నోళ్లు అదృష్టవంతులని

అమ్మానాన్నలు ఉన్నవాళ్లే నిజమైన అదృష్టవంతులు

హ్యాపీ న్యూ ఇయర్

8. దేవుడు అన్ని చోట్లా ఉండలేక

అమ్మానాన్నను బహుమతిగా మనకు ఇచ్చాడు

అనుక్షణం మన గురించి

మన శ్రేయస్సు గురించి ఆలోచించే అమ్మానాన్నకు

హ్యాపీ న్యూ ఇయర్

9. పిల్లల భవిష్యత్తు కోసం

తమ సుఖ సంతోషాలను వదులుకుని

వారి భవిష్యత్తు తీర్చిదిద్దే వారే తల్లిదండ్రులు

ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం

హ్యాపీ న్యూ ఇయర్

10. నాన్నకు ప్రేమను ఎలా చూపించాలో తెలియదు

అమ్మకు ప్రేమను ఎలా దాచుకోవాలో తెలియదు

వారికి ప్రేమించడం మాత్రమే తెలుసు

అలాంటి వారికి ఈ ఏడాది ప్రత్యేకంగా నిలవాలని కోరుకుంటున్నాను

హ్యాపీ న్యూ ఇయర్

Whats_app_banner