Mother Diet After Delivery: డెలివరీ తర్వాత తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే!-mother diet after delivery healthy food options for new moms after delivery ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Mother Diet After Delivery Healthy Food Options For New Moms After Delivery

Mother Diet After Delivery: డెలివరీ తర్వాత తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే!

HT Telugu Desk HT Telugu
Jun 16, 2022 03:05 PM IST

Women Diet Chart After Delivery: డెలివరీ తర్వాత, మహిళల శరీరం చాలా బలహీనంగా మారుతుంది. ప్రసవ సమయంలో నొప్పి కారణంగా శరీరంపై చాలా ఒత్తిడి ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తల్లి, బిడ్డ ఇద్దరికీ హానికరం. అటువంటి పరిస్థితిలో, సరైన పోషకాలను తీసుకోవడం చాలా ముఖ్యం.

Mother Diet After Delivery
Mother Diet After Delivery

గర్భధారణ సమయంలో స్త్రీలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గర్భం దాల్చిన తర్వాత  సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ టైంలో మహిళలు.. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సరైన ఆహారం లేకపోతే తల్లులపైనే కాకుండా ఇది శిశువుపై కూడా ప్రభావం పడుతుంది. గర్భధారణ సమయంలోనే కాకుండా డెలవరీ తర్వాత కూడా మహిళలు సరైన పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రసవం తర్వాత స్త్రీలు చాలా బలహీనంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం చాలా అవసరం. డెలవరీ తర్వాత తల్లలు బిడ్డకుపాలు పట్టాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మహిళలకు రోజుకు 21000 కేలరీలు అవసరం. సరైన ఆహారాన్ని తీసుకోకపోతే తల్లి, బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రసవం తర్వాత మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ సూప్, గుడ్లు చేర్చండి

ప్రసవం తర్వాత నవజాత శిశువుకు తల్లి పాలే పోషకాహారం. తల్లి ఏది తిన్నా, అది పాల ద్వారా బిడ్డకు అందుతుంది. అటువంటి పరిస్థితిలో, ఆహారంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. మీరు మాంసాహారులైతే, స్త్రీ తప్పనిసరిగా చికెన్ సూప్ , గుడ్లను తన ఆహారంలో చేర్చుకోవాలి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ లోపాన్ని తీరుస్తుంది. శరీరంలోని ఎముకలను కూడా బలపరుస్తుంది. గుడ్డు, చికెన్ సూప్ శరీరానికి కావాల్సిన ప్రోటీన్, కాల్షియాన్ని అందించడంతో ఒమేగా లోపాన్ని తీరుస్తుంది.

పసుపు పాలు

ఇది కాకుండా నిద్రవేళలో పసుపు పాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో కాల్షియం, కేలరీలు ఉంటాయి. కొన్నిసార్లు బలహీనత కారణంగా, ప్రసవం తర్వాత తల్లికి పాలు అందవు. దీనికి ప్రధాన కారణం ప్రొటీన్‌లో పోషకాలు లేకపోవడమే. అటువంటి పరిస్థితిలో, పసుపు పాలు ఈ లోపాన్ని తీరుస్తాయి.

ఖర్జూరం తప్పనిసరిగా తినాలి

ప్రసవం తర్వాత స్త్రీలకు రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, శరీరం పూర్తిగా బలహీనంగా మారుతుంది రక్తహినతను అధిగమించడానికి మహిళలు ఖర్జూరాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఖర్జూరాలు సాధారణ చక్కెరలకు అద్భుతమైన మూలంగా పరిగణించబడతున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్