Chanakya Niti Telugu : చాణక్యుడి ప్రకారం.. ఈ లక్షణాలు స్త్రీలకు అందాన్ని తీసుకురాలేవు-most of the women have these bad qualities according to chanakya niti ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti Telugu : చాణక్యుడి ప్రకారం.. ఈ లక్షణాలు స్త్రీలకు అందాన్ని తీసుకురాలేవు

Chanakya Niti Telugu : చాణక్యుడి ప్రకారం.. ఈ లక్షణాలు స్త్రీలకు అందాన్ని తీసుకురాలేవు

Anand Sai HT Telugu Published Apr 20, 2024 08:00 AM IST
Anand Sai HT Telugu
Published Apr 20, 2024 08:00 AM IST

Chanakya Niti On Women : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మహిళల గురించి అనేక విషయాలు చెప్పాడు. కొన్ని లక్షణాలు మహిళలను ఇబ్బందుల్లో పడేస్తాయని వివరించాడు.

 మహిళలపై చాణక్య నీతి
మహిళలపై చాణక్య నీతి

స్త్రీని శక్తితో పోలుస్తారు. కుటుంబాన్ని నిర్మించే శక్తి మహిళలకు ఉంది. అలాగే స్త్రీ మనసు చేస్తే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే శక్తి కూడా ఉంది. స్త్రీ అంటే చాలా శక్తిమంతురాలు. సమాజంలో మహిళలకు గౌరవ స్థానం ఉంది. చాణక్యుడి ప్రకారం స్త్రీలలో కొన్ని లక్షణాలు ఉంటే జీవితం బంగారుమయం అవుతుంది. అదేవిధంగా ఆమెలోని మరికొన్ని లక్షణాలు ఆమె జీవితాన్ని నాశనం చేస్తాయని చాణక్యుడు చెప్పాడు. అయితే చాణక్యుడి ప్రకారం స్త్రీలకు ఉండకూడని లక్షణాలు ఏమిటి?

అత్యాశతో ప్రమాదం

చాణక్యుడి ప్రకారం స్త్రీలు పురుషుల కంటే అత్యాశ ఎక్కువ. అది డబ్బు, నగలు, బట్టలు మొదలైనవి కావచ్చు. మనిషికి కోరిక ఉండాలి కానీ దురాశ ఉండకూడదు అంటారు. అతిగా అత్యాశతో ఉంటే మోక్షానికి అవకాశం లేదని చాణక్యుడు చెప్పాడు. దీనితో భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే అత్యాశ మనిషిని నరకంలోకి నెట్టేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి.

ఎక్కువగా ఆలోచించాలి

చాణక్యుడు ప్రకారం, మహిళలు ఏదైనా పని చేసేటప్పుడు కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించరు. ప్రతి పని చేసేటప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయాలి. కొంచెం తడబడినా ప్రమాదంలో పడతారు. ఆలోచించకుండా చేసే పనులు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి తీసుకెళ్తాయి. తర్వాత ఎంత ప్రయత్నం చేసినా బయటకు రాలేరని చాణక్య నీతి చెబుతుంది. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు బాగా ఆలోచించాలి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది.

అతిగా స్వార్థం ఉండకూడదు

చాణక్యుడి ప్రకారం కొందరు స్త్రీలు చాలా స్వార్థపరులు. మహిళలు తమ పనిని పూర్తి చేయడం కోసం దేనికైనా సిద్ధపడతారు. ఈ గుణం కొందరికి సహజంగానే ఉంటుంది. స్త్రీలు ఈ లక్షణాలను విడిచిపెట్టాలని చాణక్యుడు చెప్పాడు. దీనితో అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అవతలివారు మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో తెలియదు. చిక్కుల్లో పడకుండా పరిస్థితిని డీల్ చేయాలి. అలాకాకుండా ఉంటే చెడ్డ పేరు వస్తుంది.

మితిమీరిన ధైర్యంతో ఇబ్బందులు

చాణక్యుడి ప్రకారం స్త్రీలకు ధైర్యం మంచిదే కానీ మితిమీరిన ధైర్యం మంచిది కాదు. మీ ఈ మితిమీరిన ధైర్యసాహసాలు మీకు ఒక రోజు ఇబ్బందుల్లో పడేస్తాయి అని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే కొన్నిసార్లు ధైర్యం చేసి.. ముందుకు సాగుతాం. కానీ ముందు ఏం జరుగుతుందో అంచనా వేయలేం. ఈ విషయం పురుషులకు కూడా వర్తిస్తుంది.

అబద్ధాలతో చిక్కులు

చాణక్యుడి ప్రకారం కొందరు స్త్రీలకు అబద్ధం చెప్పే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చెప్పే అబద్ధాలే వాళ్ళని కష్టాల్లో పడేస్తాయి. స్త్రీలు అలాంటి గుణాలను వదిలేయాలని చాణక్యుడు చెప్పాడు. ఈ గుణాలు స్త్రీలకు అందాన్ని తీసుకురావని చాణక్యుడు చెప్పాడు. కొన్నిసార్లు అసలు నిజం తెలిసినప్పుడు మిమ్మల్ని నమ్మినవారు దూరం అవుతారు. అందుకే జీవితంలో ఎవరైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలి.

ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా పరిపూర్ణంగా ఉండలేడు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. చాణక్య నీతి ప్రకారం స్త్రీలు కూడా ఈ లక్షణాలలో కొన్నింటిని మార్చుకోవాలి అని చాణక్యుడు చెప్పాడు. అప్పుడే జీవితం అందంగా బాగుంటుంది. కుటుంబంతో కలిసి సంతోషంగా గడపవచ్చు.

Whats_app_banner