వ్యక్తులు ఎక్కువగా ఏ విషయాల్లో పశ్చాత్తాపం చెందుతారో తెలుసా?
వ్యక్తులు తీసుకునే నిర్ణయాలే కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే సరైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి పశ్చాత్తాపాలు ఎదురుకావు. అలాకాకుండా నిర్ణయాలు బెడిసికొడితే బాధలు, పశ్చాత్తాపాలే మనల్ని వేధిస్తాయి. ఈ విధంగా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎన్నో విషయాల్లో మన నిర్ణయాలే మన జీవితాన్ని శాసిస్తాయి.
జీవితంలో ఎన్నో విషయాలు వచ్చిపోతుంటాయి. కష్టాలను అధిగమిస్తూ, సుఖాలను అనుభవిస్తూ లైఫ్ మొత్తం ఆనందంగా గడపాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఇలా ఉండాలంటే వ్యక్తులు తీసుకునే నిర్ణయాలే కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే సరైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి పశ్చాత్తాపాలు ఎదురుకావు. అలాకాకుండా నిర్ణయాలు బెడిసికొడితే బాధలు, పశ్చాత్తాపాలే మనల్ని వేధిస్తాయి. ఈ విధంగా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎన్నో విషయాల్లో మన నిర్ణయాలే మన జీవితాన్ని శాసిస్తాయి. ఈ నేపథ్యంలో జీవితంలో వ్యక్తులు ఎక్కువగా పశ్చాత్తాప పడే కొన్ని విషయాలున్నాయి. వీటి గురించి తెలుసుకోవడం ద్వారా మీ జీవితంలో వాటిని అధిగమించే అవకాశముంటుంది.
అనుబంధాల విషయంలోనే ఎక్కువ..
ఎక్కువ మంది జీవితంలో అనుబంధాల విషయంలోనే పశ్చాత్తాపం చెందుతుంటారు. మంచి తల్లిదండ్రులుగా ఉండలేకపోయామనో, మంచి భర్త లేదా భార్య, కూతురు లేదా కుమారుడు ఇలా వివిధ రకాల బంధాల్లో కరెక్టుగా ఉండలేకపోయామనే బాధను కలిగి ఉంటారట. ఎందుకంటే కుటుంబమంత అత్యంత సన్నిహితంగా ఉండే బంధాలు ఇంకేవీ లేవు. స్నేహితులైనా, శ్రేయోభిలాషులైనా కుటుంబం తర్వాతే ఉంటారు. కుటుంబంలో అందరూ ఐకమత్యంతో ఉంటే ఎవ్వరూ మీకు హాని తలపెట్టలేరు. కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఎవరు మీకు అత్యంత సన్నిహితంగా ఉంటారో వారికి ప్రాధాన్యతనివ్వండి.
పనిపై దృష్టి(Work holism)..
డబ్బు సంపాదన అనేది జీవితంలో ఒక భాగమనే విషయాన్ని వ్యక్తులు తరచూ మరచిపోతుంటారు. ఈ భౌతిక ప్రపంచంలో విలాసవంతంగా ఉండేందుకు వస్తువులపై డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. ఇందుకోసం అధికంగా కష్టపడుతుంటారు. ఎంతలా అంటే తమ కోసం తామే సమయాన్ని కేటాయించుకోలేనంతగా శ్రమిస్తుంటారు. ఆ డబ్బు మీరు ఉపయోగించేంత సమయం లేకపోతే వేరేవారికి ఇవ్వడం మంచిది.
ప్రయాణాలు చేయలేకపోవడం..
మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటం, ప్రయాణం చేయడం, కొత్త వ్యక్తులను కలవడం, విభిన్న వంటలను ఆస్వాదించడం లాంటి విషయాలను ప్రతి ఒక్కరూ అనుభవించాలని అనుకుంటారు. బావిలో కప్పలా ఉండాలని ఎవ్వరూ కోరుకోరు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల చాలా మంది వివిధ రకాల ప్రదేశాలను చూడలేకపోయామని తర్వాత విచారం వ్యక్తం చేస్తుంటారు. కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే చేయండి. మీరు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నట్లయితే ఇంతకంటే మీకు మంచి సాకు ఉండదు.
సురక్షితంగా ఉండాలనుకోవడం..
జీవితంలో రిస్క్ తీసుకోవడం అనేది ఎదుగుదల్లో ఓ భాగం. మీకు ఆలోచనలు, కోరికలు ఉన్నప్పటికీ రిస్క్ తీసుకోవడానికి భయపడితే.. మరణించినట్లే అని ఓ సినీ కవి చెప్పిన డైలాగును గుర్తుకు తెచ్చుకోండి. మీరు విఫలమైతే కనీసం దాన్నుంచి మీరు నేర్చుకునే అవకాశముంటుంది. కనీసం దాని గురించి మీకు కలలు కూడా ఉండవు. అది భవిష్యత్తులో మీ కోరికలను నియంత్రిస్తుంది.
కలల్లోనే విహరించడం..
చాలా మంది అలా చేద్దాం, ఇలా చేద్దామని కలలు కంటూనే ఉంటారు. అలా కాకుండా ఆ కలలను నిజం చేసుకోవడానికి, కోరుకున్న వాటిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తే భవిష్యత్తులో ప్రశాంతంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లాలనుకుంటే వెంటనే ప్లాన్ సిద్ధం చేసుకోండి. అడ్వెంచర్స్ చేయాలనుకుంటే అందుకు ప్రణాళిక వేయండి. ముందు మీరు చేయాలనుకున్న పని చేయడం మంచిది.
ఇతరులకు సహాయం చేయలేకపోవడం..
చాలా మందిలో ఈ విషయం విచారాన్ని కలిగిస్తుంది. ఎవరైనా సహాయం అడిగిన్పప్పుడు మీరు చేయగలిగే స్థితిలో ఉన్నప్పటికీ ఆదుకోలేకపోతే ఆ బాధ మిమ్మల్ని చాలా రోజులు వేధిస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటి పశ్చాత్తాపం ఉంటే ఇంకో అవకాశం వస్తే దాన్ని వదులుకోకండి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది.
సంబంధిత కథనం