Morning Yoga Routine। రోజూ ఉదయం ఈ యోగాసనాలు సాధన చేయండి, మీకు తిరుగుండదు!-morning yoga poses and stretches to start your day in a healthy way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Morning Yoga Routine। రోజూ ఉదయం ఈ యోగాసనాలు సాధన చేయండి, మీకు తిరుగుండదు!

Morning Yoga Routine। రోజూ ఉదయం ఈ యోగాసనాలు సాధన చేయండి, మీకు తిరుగుండదు!

HT Telugu Desk HT Telugu
Jun 28, 2023 07:30 AM IST

Morning Yoga Poses: ఉదయం పూట మీరు ఆచరించటానికి 5 అద్భుతమైన యోగాసనాలు ఇక్కడ తెలియజేస్తున్నాం. వీటి కోసం కొన్ని నిమిషాలు కేటాయిస్తే, మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగలరు.

Morning Yoga Poses
Morning Yoga Poses (istock)

Morning Yoga Poses: ఉదయం లేవగానే యోగాసనాలు వేస్తే సోమరితనం పోయి ఉత్సాహం, శక్తి లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం యోగాసనాలు వేయండి. దీంతో రోజంతా మీరు ఎలాంటి ఒత్తిళ్లు, ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉంటారు. మానసిక, శరీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయం ఆచరించదగ్గ సులభమైన యోగా భంగిమలు చాలా ఉన్నాయి. అందులో కొన్నింటినైనా ఆచరించడం చేయాలి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల మీ శరీరం, మనస్సు ఎలాంటి ఒత్తిళ్లనైనా ఎదుర్కొనే శక్తిని పొందగలుగుతాయి. మీ శారీరక ఆరోగ్యమే కాకుండా, మీ మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

ఉదయం పూట మీరు ఆచరించటానికి 5 అద్భుతమైన యోగాసనాలు ఇక్కడ తెలియజేస్తున్నాం. వీటి కోసం కొన్ని నిమిషాలు కేటాయిస్తే, మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగలరు.

త్రికోణాసనం

త్రికోణాసనం అనేది నిలబడి చేసే ఆసనం. నిలబడి ఉన్న స్థితిలో పాదాల మధ్య 3-4 అడుగుల దూరం ఉంచి కుడి చేయి కుడి పాదాన్ని తాకేలా శరీరాన్ని వంచాలి. ఇదే తరహాలో ఎడమ చేయి ఎడమ పాదాన్ని తాకేలా శరీరాన్ని వంచాలి. ఇలా కుడి వైపు ఒకసారి, ఎడమ వైపు ఒకసారి క్రమపద్ధతిలో చేస్తూ ఉండాలి. ఈ ఆసనాలు శరీరానికి సమతుల్యత, స్థిరత్వాన్ని కల్పిస్తాయి.

వీరభద్రాసనం

వీరభద్రాసనం అనే యోగా భంగిమ శరీరానికి స్థిరత్వాన్ని కల్పిస్తుంది. ఇది మీ భుజాలను బలోపేతం చేయడానికి, భుజాలలో సమతుల్యత మెరుగుపరచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆసనం ద్వారా శరీర భాగాలను సాగదీయడం చేయడం ద్వారా ఆయా భాగాలకు రక్తప్రసరణను కలిగించి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇలా మొత్తం శరీర భాగాలకు శక్తి లభిస్తుంది కాబట్టి, ఇది మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది.

బాలాసనం

ఈ యోగాసనం ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శారీరకంగా మీ ఛాతీ, వీపు, భుజాలపైన ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం ఎప్పుడైనా వేసుకోవచ్చు. పగటి సమయంలో కూడా మీకు మైకముగా లేదా అలసటగా అనిపిస్తే. కొన్ని నిమిషాలు బాలాసనం భంగిమలో ఉంటే మార్పు కనిపిస్తుంది. ఈ ఆసనం వెన్ను, తుంటి, తొడలు, చీలమండల వరకు కండరాల్లో సున్నితమైన సాగతీతను కలిగించి మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది.

గరుడాసనం

గరుడ అనేది సంస్కృత పదం, ఇది అక్షరాలా డేగ అనే అర్థాన్ని సూచిస్తుంది. గరుడాసనం లేదా ఈగిల్ పోస్ అంటే డేగను పోలినట్లుగా భంగిమలో ఉండటం. ఈ ఆసనం వేయడం ద్వారా కండరాలకు విశ్రాంతి, మనస్సుకు ప్రశాంతత అలాగే శరీరానికి సమతుల్యతను తీసుకువస్తుంది.

ధనురాసనం

ఈ ఆసనం కాళ్లు, చేతి కండరాలపై ప్రభావం చూపుతుంది. దీంతో మీకు నడవటానికి, పనులు చేసుకోవడానికి కొత్త శక్తి, ఉత్సాహం లభిస్తాయి. స్త్రీలు రుతుక్రమంలో ఉన్నపుడు ఉన్నపుడు ధనురాసనం వేస్తే వారికి నొప్పుల నుంచి ఉపశమనం కలిగి శక్తి లభిస్తుంది. మలబద్ధకం సమస్యలు కూడా పరిష్కారం అవుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం