Chandra Namaskar | చంద్ర నమస్కారాలు తెలుసా? వేసవిలో చేస్తే చల్లని ప్రయోజనాలు ఎన్నో!-moon salutation know cool benefits of chandra namaskar during the hot summer season
Telugu News  /  Lifestyle  /  Moon Salutation, Know Cool Benefits Of Chandra Namaskar During The Hot Summer Season
Chandra Namaskar
Chandra Namaskar (totalyoga/instagram)

Chandra Namaskar | చంద్ర నమస్కారాలు తెలుసా? వేసవిలో చేస్తే చల్లని ప్రయోజనాలు ఎన్నో!

26 May 2023, 19:30 ISTHT Telugu Desk
26 May 2023, 19:30 IST

Chandra Namaskar: చంద్ర నమస్కారాలు రాత్రిపూట ముఖ్యంగా చంద్రుడు కనిపించే సమయంలో ఆచరిస్తారు, చంద్ర నమస్కారాలు చేసేటపుడు కూడా కడుపు ఖాళీగా ఉండేలా చూసుకోవాలి.

Moon Salutation: ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని యోగా నిపుణులు చెప్పడం తెలిసిందే. అయితే మీరు సూర్య నమస్కారాల గురించి చాలాసార్లు వినే ఉంటారు, మరి ఎప్పుడైనా చంద్ర నమస్కారాల (Chandra Namaskar) గురించి విన్నారా? ఈ చంద్ర నమస్కారాలు అనేవి సాయంత్ర పూట అభ్యసించే ఆసనాలు. నిజానికి చంద్రుడు స్వంతంగా ప్రకాశించలేడు, సూర్యుని కాంతిని గ్రహించి మాత్రమే ప్రతిబింబింస్తాడు. కాబట్టి ఈ చంద్ర నమస్కారం కూడా సూర్య నమస్కారంకు ప్రతిబింబం లాంటిదే.

చంద్ర నమస్కారాలు రాత్రిపూట ముఖ్యంగా చంద్రుడు కనిపించే సమయంలో ఆచరిస్తారు, చంద్ర నమస్కారాలు చేసేటపుడు కూడా కడుపు ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. చంద్రుడు చల్లని వెన్నెలను అందిస్తాడు కాబట్టి చంద్రనమస్కారాలు చేయడం ద్వారా అది శరీరం, మనసుపై చల్లని ప్రశాంతమైన ప్రభావాలను కలిగిస్తుంది. ఈ వేసవి కాలంలో చంద్ర నమస్కారాలను ఆచరించడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.

చంద్ర నమస్కారాలను ఆచరించడం వలన కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇక్కడ తెలుసుకోండి.

శరీరానికి చల్లదనం

చంద్ర నమస్కారం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది వేడి వేసవి రోజులలో చంద్రనమస్కారాల మృదువైన, మనోహరమైన కదలికలు మీలోని అధిక వేడి విడుదల చేసి మిమ్మల్ని ప్రశాంతంగా, రిలాక్స్‌గా భావించేలా సహాయపడుతుంది. మీలోని ఉద్రిక్త భావాలను తొలగించడంలో సహాయపడుతుంది.

పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది

ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పే వాత, పిత్త, కఫా దోషాలను చంద్ర నమస్కారాలు తగ్గించగలవు. మండే వేసవిలో శరీరంలో వేడి-సంబంధిత పిత్త దోషాల పెరుగుదల కనిపిస్తుంది. చంద్ర నమస్కారం ఈ వేడిని తగ్గిస్తుంది, అదనపు పిత్తను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

హార్మోన్ల సమతుల్యత

అమావాస్య లేదా పౌర్ణమికి శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు కొందరిలో గమనించవచ్చు. ముఖ్యంగా ఆడవారిలో ఋతుచక్రంలో మార్పులు చోటు చేసుకుంటాయి. శరీరంలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి, ఇది మూడ్ మార్పులకు దారితీస్తుంది. రొమ్ముల సున్నితత్వం, ఉబ్బరం, మొటిమలు, ఆకలిలో మార్పులు వంటి సమస్యలు ఉంటాయి. చంద్ర నమస్కారాలు వీటికి పరిష్కారం చూపుతాయి.

సృజనాత్మకత పెరుగుతుంది

చంద్ర నమస్కారం చంద్ర శక్తిని ప్రసారం చేయడంలో మీకు సహాయపడుతుంది, ఇది సృజనాత్మక ఆలోచనలను పెంపొందిస్తుంది.

కండరాలకు ప్రయోజనం

శారీరక ప్రయోజనాలను పరిశీలిస్తే వెన్నెముక, హామ్ స్ట్రింగ్స్, కాళ్ళ వెనుక , కడుపు కండరాలను కూడా సాగదీస్తుంది వాటిని బలోపేతం చేస్తుంది. రక్త ప్రసరణ, శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థల పనితీరును కూడా సమతుల్యం చేస్తుంది.

ప్రశాంతమైన నిద్ర

చంద్ర నమస్కారాలు శరీరాన్ని, మనస్సును శాంతపరిచే లక్షణాలను కలిగి ఉంటాయి, . అందులోని ఈ యోగా భంగిమలను సాయంత్రం వేళ ఆచరించడం వలన మీ శరీరాన్ని, మనస్సును ప్రశాంతమైన నిద్ర కోసం సిద్ధం చేస్తుంది.

సంబంధిత కథనం