Baby names: ప గుణింతంతో మొదలయ్యే అర్థవంతమైన పిల్లల పేర్లు, ఈ ట్రెండీ పేర్లు మీకు నచ్చడం ఖాయం-meaningful baby names that start with the letter p youre sure to love these trendy names ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baby Names: ప గుణింతంతో మొదలయ్యే అర్థవంతమైన పిల్లల పేర్లు, ఈ ట్రెండీ పేర్లు మీకు నచ్చడం ఖాయం

Baby names: ప గుణింతంతో మొదలయ్యే అర్థవంతమైన పిల్లల పేర్లు, ఈ ట్రెండీ పేర్లు మీకు నచ్చడం ఖాయం

Haritha Chappa HT Telugu
Sep 12, 2024 02:00 PM IST

Baby names: మీ బిడ్డకు ప్రత్యేకమైన, అర్థవంతమైన పేరు కోసం వెతుకుతున్నారా? మీ పిల్లలకు ప అక్షరంతో లేదా ప గుణింతంలోని ఇతర అక్షరాలతో పేరు పెట్టాలనుకుంటే ఇక్కడ మేము కొన్ని పేర్లు ఇచ్చాము. ఇవి ఆధునికంగా, అర్థవంతంగా, ట్రెండీగా ఉంటాయి.

క్యూట్ బేబీ నేమ్స్
క్యూట్ బేబీ నేమ్స్ (Pixabay)

పేరులోని మొదటి అక్షరం జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. అందుకే తల్లిదండ్రులు తమ బిడ్డకు చాలా ఆలోచించి పేరు పెడుతూ ఉంటారు. మీరు మొదటిసారి తల్లిదండ్రులుగా మారినట్లయితే, మీ బిడ్డ పేరు గురించి మీరు ఖచ్చితంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మీ బిడ్డకు ప్రత్యేకమైన, అర్థవంతమైన పేరును ఇవ్వడానికి మీరు బాగా ఆలోచిస్తున్నట్టయితే ఇక్కడ మేము మీకు కొన్ని పేర్లను ఇస్తున్నాము. మీ పాపకు లేదా బాబుకు ప గుణింతంతో వచ్చే పేరును పెట్టదలచుకుంటే ఇక్కడ కొన్ని పేర్లను ఇచ్చాము.

మీ పిల్లల పేరు ఆంగ్ల అక్షరం 'పి'తో పెట్టదలచుకుంటే ఇక్కడ మేము కొన్ని ఆధునికమైన, ప్రత్యేకమైన శిశువుల పేర్లను ఇచ్చాము. ఇవి ఎంతో అందమైన, అర్థవంతమైన పేర్లు.

ప గుణింతంతో వచ్చే అబ్బాయిల పేర్లు

పరాజ్ - ఓటమిలేని వాడు

పార్థ్ - కృష్ణుడు

పలాష్ - ఎర్రని పువ్వులు

పృథు - విష్ణుమూర్తి నామం

ప్రాణ్ష్ - నిండు ప్రాణం

ప్రియాన్ష్ - ప్రియమైన వ్యక్తి

పావిత్ - ప్రేమ

ప్రణీల్ - శివుడు

ప్రఫుల్ - పుష్పించడం

పాయస్ - పవిత్రమైన

పంకజ్ - కలువ పువ్వు

ప్రతీక్ - చిహ్నం

ప్రజ్వల్ - కాంతివంతమైన

అమ్మాయిల పేర్లు

పలోమి - తేనె

పినాకి - శివుని విల్లు

పల్లవి - పువ్వులు, మొగ్గలు

ప్రీష - దేవుడి వరం

ప్రియాంగి - మహాలక్ష్మీ

పద్మాక్షి - కలువ రేకుల్లాంటి కళ్లు

ప్రనూష - సూర్యుని మొదటి కిరణం

ప్రత్యూష-ఉదయం

పర్వి - పండుగ

పద్మజ - లక్ష్మీ దేవి

పర్విణి - పండుగ

పరిణీత - జ్ఞానం

పిహు - అద్భుతమైన

ప్రాచీ - ఉదయం

పారుల్ - ఒక పువ్వు

ప్రతీక్ష - సమయం, ఆశ

పౌలోమీ - ఇంద్రుని రెండో భార్య

టాపిక్