Silver Health Benefits : వెండి ప్లేట్‌లో తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు-may be you dont know the health benefits of eating in silver vessels ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Silver Health Benefits : వెండి ప్లేట్‌లో తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు

Silver Health Benefits : వెండి ప్లేట్‌లో తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు

Anand Sai HT Telugu
Feb 17, 2024 01:30 PM IST

Silver Health Benefits : వెండి గిన్నెల్లో ఆహారం తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వెండి ప్లేటులో భోజనం చేస్తే ఉపయోగాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

వెండి ప్లేటులో తింటే ప్రయోజనాలు
వెండి ప్లేటులో తింటే ప్రయోజనాలు (Unsplash)

ఒకప్పుడు వెండి ప్లేట్లలో భోజనం వడ్డించడం ప్రతిష్టగా భావించేవారు. ఆ తర్వాత రానురాను ఉక్కు, ఇతర లోహ పదార్థాలతో పాత్రలు తయారు చేశారు. ఇప్పటికీ కొన్ని ఇళ్లలో వెండి ప్లేట్, గ్లాసులను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఈ మెటల్ ప్లేట్లను ఉపయోగించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్లాస్టిక్, ఇతర లోహ పదార్థాలను ఉపయోగించే బదులుగా వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

వెండి ప్లేట్‌లో తింటే కచ్చితంగా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. మన భారతీయ సంప్రదాయాన్ని పరిశీలిస్తే పిల్లల అన్న ప్రాసన సమయంలోనూ వెండి పాత్రలోనే కలిపి తినిపిస్తారు. ఆ సమయంలో బహుమతులు కూడా వెండివే ఇస్తారు. రోజూ తీసుకునే ఆహారాన్ని వెండి ప్లేట్‌లోనే తీసుకోవడం ద్వారా ఏం ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోండి.

బ్యాక్టీరియా పెరగదు

వెండి ఒక సహజ యాంటీ బాక్టీరియల్. అంటే ఈ లోహంపై బ్యాక్టీరియా పెరగదు. వెండి పాత్రలో నీటిని వేడి చేయడం ద్వారా బ్యాక్టీరియా సంపూర్ణంగా నిర్మూలించబడుతుంది. అంతే కాదు వెండి ప్లేటులో తింటే బ్యాక్టీరియా చేరకుండా చేస్తుంది. కొన్ని బ్యాక్టీరియా వెండిపై మనుగడ సాగించదు. గతంలో ఆహారంలో బ్యాక్టీరియా నుండి కలుషితం కాకుండా ఉండటానికి వెండి ప్లేట్లలో పిల్లలకు ఆహారం అందించేవారు.

నిల్వ చేసిన ఆహారం ఎక్కువ కాలం ఉంటుంది

కొన్ని ఆహారాలు గతంలో వెండి పాత్రలలో నిల్వ చేసేవారు. దీంతో ఆహారం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. ఆహారంలోని సూక్ష్మజీవులను చంపి వాటి పెరుగుదలను అడ్డుకోవడం ద్వారా వెండి ఆహారాన్ని సంరక్షిస్తుంది. దీని కారణంగా ఆహార పదార్థాలు చాలా కాలం పాటు ఉంటాయి.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

వెండి పళ్లెంలో తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నమ్మకం. వెండిలోని యాంటీబ్యాక్టీరియల్ శక్తి దానిపై ఉంచిన ఆహారాన్ని కూడా పొందుతుంది. ఈ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, శరీరం వివిధ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించబడుతుంది. వెండి శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. శరీర వేడిని ఆకర్షిస్తుంది. ఈ కారణంగా వెండిని తరచుగా ఆభరణాల రూపంలో ధరిస్తారు.

వెండి తుప్పు పట్టదు

ప్లాస్టిక్ విషమే. కానీ విషపూరిత మూలకాలు లేని ఏకైక సురక్షితమైన లోహం వెండి. ఇది ఆక్సిజన్‌తో కలవదు. అది తుప్పు పట్టదు. చాలా లోహాలు ఆక్సిజన్‌తో కలిసిపోయి ఆక్సైడ్‌లను ఏర్పరచినప్పుడు చాలా విషపూరితం అవుతాయి. వెండి సురక్షితమైనది కాబట్టి, చాలా పలుచని వెండి పొరను స్వీట్లపై పొరగా పెడతారు.

ఆరోగ్యాన్ని కాపాడుకోండి

వెండి పళ్లెం జీవితాంతం ఉంటుంది. దీన్ని వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పరిగణించవచ్చు. మిగిలిన మెటల్ ప్లేట్లు కాలక్రమేణా అరిగిపోతాయి. కానీ సిల్వర్ ప్లేట్‌ని జీవితకాలం దాని అసలు స్థితిలోనే ఉపయోగించవచ్చు. తరువాతి తరం కూడా ఉపయోగించవచ్చు. ఇలా వెండితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వెండి ప్లేటులో తినేందుకు ప్రయత్నించండి. వెండిపై డబ్బులు పెడితే కూడా మీకు మంచి ఇన్వెస్ట్ మెంట్. ఈ లోహం ధర రోజు రోజుకు పెరుగుతుంది.

Whats_app_banner