Mango Laddu: మ్యాంగో లడ్డూ ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది, నైవేద్యంగా నివేదించవచ్చు
Mango Laddu: శ్రావణ మాసం వచ్చేస్తోంది. శ్రావణ మాసంలో పూజల్లో నివేదించడానికి మ్యాంగో లడ్డూను కూడా పెట్టవచ్చు. ఈ లడ్డూలు తయారు చేయడం చాలా సులభం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి.
మ్యాంగో లడ్డూ
శ్రావణ మాసం వస్తోందంటే ముందుగా ఎలాంటి నైవేద్యాలను చేసుకోవాలో ప్రిపేర్ అవ్వాలి. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివుడిని పూజిస్తారు. అలాగే శుక్రవారం పూట లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఆ దేవతలకు నైవేద్యంగా సమర్పించుకునేందుకు ఒకసారి మ్యాంగో లడ్డూ చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లడ్డూలు తయారు చేయడం చాలా సులభం. వీటిని ఎలా తయారుచేయాలో తెలుసుకోండి.
మ్యాంగో లడ్డూ రెసిపీకి కావలసిన పదార్థాలు
మామిడి గుజ్జు - ఒక కప్పు
కండెన్స్ డ్ మిల్క్ - అర కప్పు
కొబ్బరి పొడి - ఒక కప్పు
యాలకుల పొడి - ఒక స్పూను
డ్రై ఫ్రూట్స్ మిక్స్ - అర కప్పు
మ్యాంగో లడ్డూ తయారీ విధానం:
- మ్యాంగో లడ్డూను తయారు చేయడానికి ముందుగా కొబ్బరిపొడిని తీసుకోవాలి.
- మందపాటి కళాయిలో కొబ్బరి పొడిని వేసి లేత గోధుమ రంగులోకి మారి సువాసన వచ్చే వరకు వేయించాలి.
- అదే కళాయిలో మామిడి గుజ్జు, కండెన్స్ డ్ మిల్క్, డ్రైఫ్రూట్స్, చిటికెడు యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
- పాన్ లో అన్నింటిని వేయించి, మిశ్రమం పిండిలా గట్టిగా అయ్యే వరకు బాగా కలపాలి.
- మిశ్రమం గట్టిపడ్డాక స్టవ్ ఆఫ్ చేయండి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లార్చి అరచేతిలో కొద్దిగా తీసుకుని ఆ మిశ్రమాన్ని లడ్డూ ఆకారంలో ఇవ్వాలి.
- ఒక గిన్నెలో ఈ లడ్డూలను వేసి వాటిపై కొబ్బరి కోరు చల్లాలి. అంతే టేస్టీ మామిడి లడ్డూలు రెడీ అయినట్టే.