Keeway Benda V302C । భారత మార్కెట్లోకి మరో స్టైలిష్ మోటార్‌సైకిల్, ధర ఎంతంటే?
ద్విచక్ర వాహన తయారీదారు కీవే నుంచి Keeway Benda V302C అనే ఓ సరికొత్త మోటార్‌సైకిల్ మోడల్ భారత మార్కెట్లో విడుదలైంది. దీని ధర ఎంత, ఇతర విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.
హంగేయన్ ద్విచక్ర వాహన తయారీదారు కీవే తాజాగా తమ బ్రాండ్ నుంచి Keeway Benda V302C అనే బాబర్-స్టైల్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది Keeway నుంచి భారతదేశంలో విడుదలైన నాల్గవ ద్విచక్ర వాహనం కాగా, రెండవ V-ట్విన్ ఇంజన్ కలిగిన క్రూయిజర్ మోటార్‌సైకిల్. అంతకుముందు Keeway K-Light 250V పేరుతో ఒక క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
సరికొత్త Keeway Benda V302C ధరలు రూ. 3,89,000 నుంచి ప్రారంభమవుతాయి. ఇది గ్లోసీ గ్రే, గ్లోసీ బ్లాక్ అలాగే గ్లోసీ రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ పెయింట్ స్కీముల ఆధారంగా ఈ బైక్ ధరల్లో కూడా మార్పు ఉంటుంది. ఒకసారి ధరలను పరిశీలించండి, ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.
గ్లోసీ గ్రే కలర్ ఆప్షన్ ధర: రూ. 3,89,000
గ్లోసీ బ్లాక్ కలర్ ఆప్షన్ ధర: రూ. 3,99,000
గ్లోసీ రెడ్ కలర్ ఆప్షన్ ధర: రూ. 4,09,000
Keeway Benda V302C బైక్ కోసం ప్రీబుకింగ్స్ ప్రారంభమైనాయి. బాబర్ బెనెల్లీ లేదా కీవే డీలర్‌షిప్‌లలో రూ. 10,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి ఈ బైక్ బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు సెప్టెంబర్ 2022 నుంచి ప్రారంభం అవుతాయి.
Keeway Benda V302C ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఈ కీవే బెండా V302C మోటార్‌సైకిల్‌లో 298cc సామర్థ్యం కలిగిన ట్విన్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 29.5bhp శక్తిని, 26.5Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ ద్వారా 6 స్పీడ్ గేర్‌బాక్స్ తో అనుసంధానించారు.
మిగతా హార్డ్ వేర్ అంశాలను పరిశీలిస్తే.. ముందు భాగంలో 120 మిమీ వీల్ ట్రావెల్ కలిగిన టెలిస్కోపిక్ ఫోర్క్స్ సస్పెన్షన్, వెనక భాగంలో 42 మిమీ వీల్ ట్రావెల్‌తో డ్యూయల్ టెలిస్కోపిక్ కాయిల్ స్ప్రింగ్‌లను అమర్చారు. రెండు చక్రాలు డిస్క్ బ్రేకులు ఉంటాయి. డ్యూయల్-ఛానల్ ABS కలిగి ఉంది.
ఫీచర్ లిస్ట్‌లో LED లైటింగ్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్, స్పీడో కన్సోల్, గేర్ పొజిషనింగ్ ఇండికేటర్‌తో కూడిన వృత్తాకార LCD యూనిట్ మొదలైన ఫీచర్లను కలిగి ఉంది.
సంబంధిత కథనం