K-Light 250V | కీవే క్రూయిజర్ బైక్ భారత్‌కు వచ్చేసింది, ధర రూ. 2.89 లక్షలు!-keeway k light 250v cruiser bike launched in india at inr 2 89 lakhs ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  K-light 250v | కీవే క్రూయిజర్ బైక్ భారత్‌కు వచ్చేసింది, ధర రూ. 2.89 లక్షలు!

K-Light 250V | కీవే క్రూయిజర్ బైక్ భారత్‌కు వచ్చేసింది, ధర రూ. 2.89 లక్షలు!

HT Telugu Desk HT Telugu
Jul 06, 2022 12:30 PM IST

కీవే మోటార్స్ నుంచి K-Light 250V మోటార్‌సైకిల్‌ భారత మార్కెట్లో విడుదలైంది. ఈ క్రూయిజర్ బైక్ విశేషాలను తెలుసుకోండి.

<p>K-Light 250V</p>
K-Light 250V

ప్రముఖ్య ద్విచక్ర వాహన తయారీదారు బెనెల్లీ అనుబంధ సంస్థ కీవే మోటార్స్ భారత మార్కెట్లో K-Light 250V మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ వద్ద దీని ధర రూ. 2.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి జూలై మధ్య వారం నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ హంగేరియన్ 2-వీలర్ మేకర్. ఈ ఏడాది ప్రారంభంలో వియస్టే 300, సిక్స్టీస్ 300ఐ పేర్లతో రెండు ప్రీమియం రేంజ్ స్కూటర్‌లతో పాటు ఈ K-Light 250V మోటార్‌సైకిల్‌ను ప్రదర్శించింది.

క్వార్టర్-లీటర్ క్రూయిజర్ అయినటువంటి ఈ K-Light 250V ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. డిజైన్ పరంగా హార్లీ డేవిడ్ సన్ ఫ్యాట్ బాబ్ క్రూయిజర్ ను పోలినట్లు ఉంటుంది. స్కూప్-అప్ చేసిన రైడర్ సీటు, వెనక్కి లాగినటువంటి హ్యాండిల్, కాళ్లు చాచుకునే విధంగా ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్‌లు ఉన్నాయి. ఈ మోటార్‌సైకిల్‌ మ్యాట్ బ్లూ, మ్యాట్ డార్క్ గ్రే, మాట్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో ఇక్కడ చూడండి.

K-Light 250V ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

K-Light 250Vలో 249cc ఎయిర్-కూల్డ్ ఫోర్-స్ట్రోక్ 8-వాల్వ్ V-ట్విన్ ఇంజన్‌ను అమర్చారు. దీనిని 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఈ ఇంజన్ 8,500 rpm వద్ద 18.7 hp శక్తిని అలాగే 5,500 rpm వద్ద 19 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ బైక్‌కు హెడ్‌లైట్ క్లస్టర్‌లో రౌండ్ DRL ద్వారా ఫ్రేమ్ చేసిన చిన్న LED ఉంటుంది. టెయిల్ ఎండ్‌లో LED బ్రేక్ లైట్ కూడా ఉంది.

సస్పెన్షన్ సిస్టమ్‌లో ముందువైపు టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్‌లు, వెనుకవైపు హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉన్నాయి. డ్యూయల్-ఛానల్ ABS స్టాండర్డ్‌గా వస్తుంది. రెండు చివరల డిస్క్ బ్రేక్‌ల ద్వారా బ్రేక్ పనిచేస్తుంది.

ఈ బైక్ 715 mm ఎత్తులో స్టెప్డ్ సీట్ సెట్ కలిగి ఉంది. దీని ఇంధన ట్యాంకు సామర్థ్యం 20-లీటర్లుగా ఉంది.

ఈ బైక్ కీవే కనెక్ట్ అనే టెక్-ఎనేబుల్డ్ సొల్యూషన్‌తో వస్తుంది. ఇందులో భాగంగా GPS ట్రాకింగ్, రిమోట్ ఇంజిన్ కట్-ఆఫ్, జియో-ఫెంక్‌నిగ్, రైడ్ డేటా రికార్డ్, స్పీడ్ లిమిట్ మొదలైన కనెక్టివిటీ ఫీచర్‌లను అందించే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. బైక్ లొకేషన్‌ను ముందుగా ఎంచుకున్న రెండు కాంటాక్ట్‌లతో పంచుకునే పానిక్ బటన్‌ కూడా ఈ బైక్ లో ఇచ్చారు.

K-Light 250Vపై కొనుగోలుపై కంపెనీ నుంచి 2 సంవత్సరాల వారంటీ లభిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం