Lunar Eclipse 2023 । నేడే చంద్రగ్రహణం.. వివిధ నగరాల్లో గ్రహణం ఏర్పడే సమయాలు ఇవే!-lunar eclipse 2023 on may 5 indian cities that will witness chandra grahan city wise timing of penumbral moon eclipse ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lunar Eclipse 2023 । నేడే చంద్రగ్రహణం.. వివిధ నగరాల్లో గ్రహణం ఏర్పడే సమయాలు ఇవే!

Lunar Eclipse 2023 । నేడే చంద్రగ్రహణం.. వివిధ నగరాల్లో గ్రహణం ఏర్పడే సమయాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
May 05, 2023 09:44 AM IST

ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారతదేశంలోని ప్రజలు కూడా ఈ ఖగోళ దృగ్విషయాన్ని వీక్షించగలరు. సమయాలు తెలుసుకోండి.

Lunar Eclipse 2023 on May 5
Lunar Eclipse 2023 on May 5 (stock pic)

Lunar Eclipse 2023: ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది 2023 సంవత్సరంలో ఏర్పడుతున్న మొదటి చంద్రగ్రహణం. ప్రపంచంలోని చాలా చోట్ల గ్రహణాన్ని వీక్షించవచ్చు. భారతదేశంలోని ప్రజలు కూడా ఈ ఖగోళ దృగ్విషయాన్ని వీక్షించగలరు. సూర్యుడికి, చంద్రునికి మధ్య భూమి వచ్చినపుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది, ఈ సమయంలో భూమి నీడ చంద్రునిపై పడుతుంది.

కాగా, మే 5, శుక్రవారం రోజున ఏర్పడేది అరుదైన చంద్రగ్రహణం. దీనిని పెనంబ్రల్ చంద్రగ్రహణంగా పేర్కొంటున్నారు. సాధారణ చంద్రగ్రహణం ఎర్పడే సమయాల్లో చంద్రుడికి, సూర్యుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చినపుడు సూర్యకాంతితో ఎర్రగా మారిన భూవాతావరణం చంద్రునిపై ప్రతిబింబిస్తుంది. అందుకే సాధారణ చంద్రగ్రహణాల సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. అయితే ఇప్పుడు భూమి కొంత ఎత్తైన డిగ్రీలో ఉండటం వలన ఎర్రటి భూవాతావరణం చంద్రునిపై ప్రతిబింబించకపోవచ్చు. అందువల్ల ఈసారి చంద్రుడు ఎర్రగా కాకుండా కొద్దిగా మసకబారుతుంది కానీ కొంతవరకు ప్రకాశిస్తూనే ఉంటాడు. అందుకే దీనిని పెనంబ్రల్ చంద్రగ్రహణం అంటున్నారు.

చంద్రగ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది?

పెనుంబ్రల్ గ్రహణాన్ని చూసే ప్రాంతాలు ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా, ఐరోపాలో ఖండాల వారు వీక్షించవచ్చు. భారతదేశంలో న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరబాద్, అహ్మదాబాద్, వారణాసి, మధుర, పూణే, సూరత్, కాన్పూర్, విశాఖపట్నం, పాట్నా, ఊటీ, చండీగఢ్, ఉజ్జయిని, వారణాసి, సహా మరిన్ని ప్రాంతాలలో చూడవచ్చు.

భారతదేశంలో ఏయే నగరాల్లో ఏ సమయంలో చంద్రగ్రహణం కనిపిస్తుంది?

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే, 2023లో మొదటి చంద్ర గ్రహాన్ని చూడగలిగే భారతీయ నగరాలు, సమయాలు ఇక్కడ చూడండి.

న్యూఢిల్లీ: రాత్రి 8:44 (మే 5) నుండి ఉదయం 1:01 వరకు (మే 6)

ముంబై: రాత్రి 8:44 (మే 5) నుండి ఉదయం 1:01 వరకు (మే 6)

గురుగ్రామ్: 8:44 pm (మే 5) నుండి 1:01 am (మే 6)

హైదరాబాద్: రాత్రి 8:44 (మే 5) నుండి ఉదయం 1:01 వరకు (మే 6)

బెంగళూరు: రాత్రి 8:44 (మే 5) నుండి ఉదయం 1:01 వరకు (మే 6)

చెన్నై: రాత్రి 8:44 (మే 5) నుండి ఉదయం 1:01 వరకు (మే 6)

కోల్‌కతా: రాత్రి 8:44 (మే 5) నుండి ఉదయం 1:01 వరకు (మే 6)

భోపాల్: రాత్రి 8:44 (మే 5) నుండి ఉదయం 1:01 వరకు (మే 6)

చండీగఢ్: రాత్రి 8:44 (మే 5) నుండి ఉదయం 1:01 వరకు (మే 6)

పాట్నా: రాత్రి 8:44 (మే 5) నుండి ఉదయం 1:01 వరకు (మే 6)

అహ్మదాబాద్: రాత్రి 8:44 (మే 5) నుండి ఉదయం 1:01 వరకు (మే 6)

విశాఖపట్నం: రాత్రి 8:44 (మే 5) నుండి ఉదయం 1:01 వరకు (మే 6)

గౌహతి: రాత్రి 8:44 (మే 5) నుండి ఉదయం 1:01 వరకు (మే 6)

రాంచీ: రాత్రి 8:44 (మే 5) నుండి ఉదయం 1:01 వరకు (మే 6)

ఇంఫాల్: 8:44 pm (మే 5) నుండి 1:01 am (మే 6)

ఇటానగర్: రాత్రి 8:44 (మే 5) నుండి ఉదయం 1:01 వరకు (మే 6)

ఈ గ్రహణం మసకగా ఉండబోతుంది కాబట్టి తీక్షణ పరిశీలన అవసరం. లేదా ఫోటోగ్రఫిక్ కెమెరాలతో చూడవచ్చు.

WhatsApp channel